Tuesday, January 24, 2012

సిద్ధాంత పోరాట పాఠాలు చెప్పిన మార్క్సిస్ట్‌ పంతుళ్ళూ సిపిఎం నాయకత్వానికి వీరయ్యలు తగరా ?


ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు ఉద్య మచరిత్రలో పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య త్యాగధనులు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొ మరయ్య, చెరుకూరి రాజ్‌కుమార్‌, మ ల్లోజుల కోటేశ్వరరావు ప్రాణాలర్పించి న త్యాగమూర్తులు. అవకాశం లేక ఆద ర్శాలు వల్లించేవారికన్నా దోపి డిదారులుగా కొనసా గటానికి ఉన్న అన్ని అవకాశాల్ని వదు లుకుని ఆదర్శజీవితాలు గడిపిన యస్‌.ఆర్‌.శంకరన్‌ లాంటి వాళ్ళనూ ఈ సమాజం విస్మరించదు. యస్‌.ఆర్‌. శంకరన్‌, కిష న్‌జీల గురించి పత్రికల్లో రాసినపుడు, కడుపులో చల్ల కదలకుం డా పడక కుర్చీల్లో కూర్చొని వాదనలు చేసే మిత్రులు, బ్రాహ్మ ణుడైన మల్లోజులగురించి అంత రాయాలా అనటమే గాక కొం దరు విమర్శిస్తూ వ్యాసాలు కూడా రాశారు. నేను మల్లోజుల గు రించి రాసినా, బిన్‌ లాడెన్‌ల గురించి రాసినా మనుషుల గురిం చి, వాళ్ళ త్యాగాల గురించి రాసాను. నన్నలా అడిగిన వాళ్ళు సం తృప్తి చెందలేదు. అలాంటివాళ్ళ గురించి ఆలోచించనవసరం ేదు. ఈ వ్యాసంలో నేను చెప్పే అంశాలతో, అభిప్రాయాలతో వ్య క్తులుగానీ సంస్థలుగానీ ఏకీభవించాలని కూడా నేను అనుకోవడం లేదు.

కొన్నిరోజుల క్రితం నాకు ఒక పాత కమ్యూనిస్టు అభిమాని కల్సారు. ఆయన జీవన విధానం శ్రమను (స్వంత) నమ్ముకున్న పాత కమ్యూనిస్టుల్లాగే ఉంటుంది. సి.కె. నారాయణరెడ్డి, చనిపో యిన డాక్టర్‌ చౌదరి లాగా. భారతదేశంలో రక్త సంబంధం కన్నా బలమైన సెంటిమెంట్‌ కులానికున్నది. కుల సెంటిమెంట్‌ ముం దు ‘వర్గ’ సెంటిమెంట్‌ బలాదూర్‌. ‘తనకు మించిన ధర్మమేలా’ అ నే నానుడి తన ‘కులానికి మించిన న్యాయమేలా’గా మారిపో యింది. ఇప్పుడు కాదు ఎప్పుడో మారిపోయిందిలా. ఇప్పుడు మారి పోతుందనుకుంటున్నారు చాలామంది. 

వాస్తవానికిలా ఎపు డోమారిపోయింది అనటానికి నా పేషెంటైన ఆ పాతకాలపు కమ్యూనిస్టు అన్న మాటలే సాక్షం. అవి... ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా పనిచేస్తున్న కాలంలో క్రిష్ణా, గుంటూరు జిల్లాల నుండి రాయలసీమకు నాన్‌ రెడ్డి కామ్రేడ్స్‌ని (బి.సి., యస్‌.సి) పంపవ ల్సిన పరిస్థితి వచ్చింది. బి.సి., ఎస్‌.సి కామ్రేడ్స్‌కి ‘రెడ్డి’ తోక తగి లించి కామ్రేడ్‌ రెడ్డిగా బాప్టిజం యిచ్చి పంపారట. 

ఒక ఉన్నత మైన సిద్ధాంత బలంతో కుల వర్గ వ్యవస్థని సమూలంగా పెకిలించి వేయవల్సిన పార్టీ ఆ వ్యవస్థకు జడిసి మాల కామ్రేడ్‌ని రెడ్డి కా మ్రేడ్‌గా అవతారమెత్తించి రెడ్ల యిళ్ళల్లో తిప్పటం పక్కా తిరోగ మనవాదంగా అర్ధం చేసికోవాలి. అంటే అంటరాని వాళ్ళు కులం దాచుకున్నామనే ఆత్మవంచనతో ప్రతిక్షణం బ్రతుకుతూ, తన భాష సంసృ్కతి ఎక్కడ బయటపడుద్దోననే భయంతో కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలన్నమాట. ఎంత దౌర్భాగ్యం! శతృగుండెల్లో గు బులుపుట్టించే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికి తనే నిత్య నర కాన్ని అనుభవించే కామ్రేడ్‌, ధీటైన కమ్యూనిస్టుపార్టీనెలా నిర్మిస్తాడు?

ఒక కమ్యూనిస్టు పార్టీ తన నిర్మాణ కార్యక్రమంలో యింత డిఫెన్స్‌ పాత్రను ఎందుకు ఆశ్రయించింది? ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? వర్గ సమస్యా? కాదు అది కుల సమస్య. పుచ్చలపల్లి సుందరయ్యగారు, కొండపల్లి సీతారా మయ్యగారు ‘‘రెడ్డి’’ని తొలగించుకున్న మాత్రాన వారి ‘‘రెడ్డి’’ పునాదిని ప్రజలు మర్చిపోతారా? అది త్యాగాలకి చిహ్నమా? పుచ్చలపల్లి సుందర య్యగారు, కొండపల్లి సీతారామయ్యగారు త్యాగమూర్తులు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరంలేదు. రాయలసీలో పనిచేయటానికి దళితకామ్రేడ్స్‌కి రెడ్డి తగిలించటా నికిగాని, పైన పేర్కొన్న యిద్దరు కమ్యూనిస్టు నాయకులు రెడ్డిని తీసివేసుకోవటంలోగానీ ఒకవాస్తవం లేదా? ఆ వాస్తవమే ‘కు లం’. వర్గం కన్నా కులం వాస్తవం. వర్గానికి క్రిందికి మీదికి మారే గుణం ఉంది. 

కులం కదలదు. ఈ వాస్తవాన్ని కమ్యూనిస్టు పారీ లు తమఎజెండాలోకి తీసికొని రాకపోవటానికి గల కారణం యింతవరకు భారతదేశంలో పనిచేసే ఒక్క కమ్యూనిస్టుపార్టీ కూడా వివరించలేదు. కారణం కమ్యూనిస్టు పార్టీలు దోపిడివర్గా లని, దోపిడికి గురయ్యే వర్గాలని గుర్తించాయి కానీ, దోపిడి కు లాల్ని దోపిడికి గురయ్యే కులాల్ని గుర్తించ నిరాకరించటమే. 90 ఏళ్ళ నుండి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం గ్రామీణ భార తం లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ సామాజిక వాస్తవాన్ని ఎందుకు గుర్తించ నిరాకరిస్తూ వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. 

కానీ 1980 దశకం వరకు వీళ్ళు ఈ ప్రశ్ననే వేయనివ్వ లే దు. వేయవల్సిన వాళ్ళు ఎందుకు వెయ్యలేక పోయ్యారు? వీట న్నిటికి శాస్ర్తీయ పద్ధతిలో సమాధానాలు చెప్పటానికి దురదృష్టవ శాత్తు ఎవరూ సిద్ధంగా లేరు. వ్యక్తుల రాజకీయ అవగాహనకి ఆ యా దేశాల్లో ఉన్న సామాజిక జీవన వైవిధ్యాలనేది వాస్తవం కా దా? అలాంటపడు ఐరోపా దేశాల్లోని సామాజిక జీవన విధా నానికి, చైనా ప్రజల జీవన విధానానికి భిన్నమైన పరిస్థితులుండ బట్టే కదా రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1946లో రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ అధినేత స్టాలిన్‌ సూచన మేరకు షాంఘై షేక్‌ ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరకుండా, మావో నాయకత్వం లోని ఎర్రసైన్యం షాంఘై షేక్‌తో అంతర్యుద్ధానికి తలపడి 1949 లో చైనాను విముక్తి చేసాడు. 

స్టాలిన్‌ గొప్పతనం ఏమిటంటే 1949లోనే ‘‘చైనా విప్లవం విషయంలో 1946లో మనం చేసిన నిర్ణయం తప్పు’’ అని రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ పోలిట్‌ బ్యూరో మీటింగ్‌లో ఒప్పుకున్నాడు.
మరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్టాలిన్‌ సూచన మేరకు విరమించామన్న భారత కమ్యూనిస్టు పార్టీ వాదనని ఏమను కోవాలి? ఎవరేమనుకున్నా అట్టడుగుకు అణగదొక్కబడుతున్న వాళ్ళగా ఒక విషయాన్ని విస్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. అది, ఈ దేశంలో అణచివేయబడ్డ కులాలకు బుద్దుడు, రామాను జుడు, జీసస్‌, పూలే, అంబేడ్కర్‌, మార్క్స్‌లు అండగా నిలిచారనేది అక్షర సత్యం. క్రిస్టియానిటి షేక్‌హ్యాండిచ్చి మమ్మల్ని చదువుకో మన్నది. 

అంబేడ్కర్‌ చదువుకోటానికి ఆత్మ గౌరవంతో బ్రతకటా నికి సదుపాయాలు కల్పిస్తే, కమ్యూనిస్టు పార్టీలు, ఆత్మగౌరవం తో బ్రతకటానికి కావాల్సిన ధైర్య సాహసాల్ని, రేషనాలిటిని అం దించాయి. అందుకు మేము ఈ మూడు సంస్థలకు సదా కృతజ్ఞు లం. అయితే చదువుకోండన్న క్రిస్టియానిటి క్లర్క్‌ల్ని, కానిస్టేబు ల్ని, పాస్టర్స్‌ వరకు వస్తే చాలనే ఒక సైకలాజికల్‌ సీలింగ్‌ని విధిం చింది. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీలు, ధైర్యాన్నితెచ్చుకుని వేరేవాళ్ళని ప్రశ్నించండి కాని, మమ్మల్ని ప్రశ్నించవద్దనే బ్యూరొ క్రటిక్‌ డిక్టేటర్‌షిప్‌తో మా శ్రేణుల్ని అణచి వుంచుతున్నాయి. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఒక్కరే అణచివేయబడ్డ ఈ జాతుల్ని, ‘మీ అభివృద్ధికి హద్దు ఆకాశం’’ కూడా కాకూడదన్నాడు. అం దుకే మేము ఆయన్ని అందరికంటే ఎక్కువగా ఆరాధిస్తాం.

ఒక పత్రికలో నేను రాసిన ‘‘ఆధ్యాత్మిక ప్రజాస్వామేది?’’ అన్న వ్యాసం చదివి నా మిత్రులు కొందరు ఫోన్‌ చేసి ‘మీరు, ఐలయ్య’ హిందూ మతాన్ని సంస్కరిద్దామనుకుంటున్నారా? అన్నారు. అ దేనిజమైతే హిందూ సంస్థలు మీకు కృతజ్ఞతగా ఉంటాయన్నారు. కృతజ్ఞతలు వద్దులేగాని, బెదిరింపులు లేకుంటే చాల్లే అన్నాను. నిర్మించబడిన ఏ సంస్థ అయినా సామాన్య ప్రజల అవసరాలని తీర్చకుండా, కొద్దిమంది అవసరాలనే తీర్చే వ్యవస్థగా మారినప్పు డు ఒకవేళ ఆ సంస్థ ఏమేరకైనా అశేష ప్రజల గురించి కొంచెం ఆలోచించటం మొదలుపెట్టినా అహ్వానించడగినదే కదా! 

హిందూ మతాధిపతులుగాని, క్రిష్టియన్‌ మతాధిపతులుగాని, కొంత వరకైనా మారినటై్లతే, ఆ మార్పు అశేష ప్రజల, ముఖ్యంగా అణ గదొక్కబడుతున్న కులాల ప్రయోజనాలకు బాధ్యత పడే విధంగా మారితే, అది హిందూ సంస్థైనా, క్రిస్టియన్‌ సంస్థైనా, కమ్యూని స్టు సంస్థైనా వాటికి షరతులులేని మద్దతు ప్రకటిస్తాము. మార్చు కోటానికి వాళ్ళు సిద్ధమేనా అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలి పోకూడదన్నది మా కోరిక.సి.పి.యం రాష్ట్ర మహాసభలు భద్రాచలంలో ఫిబ్రవరిలో జరగబోతున్న సందర్భంగా ఒక చర్చ ముందుకొచ్చింది. 

కాబోయే సి.పి.యం.పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎవరు అన్నదే ఆ చర్చ. బి.వి.రాఘవులు మూడు దఫాలుగా యిప్పటి వరకు ఎన్ని కయ్యా రు కాబట్టి, వీరయ్యగాని తమ్మినేని వీరభద్రం కాని ఈసారి రాష్ట్ర కార్యదర్శి అవచ్చు అనేది మీడియా ఊహించింది. పార్లమెం టరీ కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో యిప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎస్‌.సి., బి.సి., ఎస్‌.టి., మైనారిటీ కులాల నుండి రాష్ట్ర స్థాయి సెక్రెటరీ లేడు. 90 సంవత్సరాల ఉద్యమ రాజకీయ చరి త్రలో శ్రామిక ఉత్పత్తి కులాలైన, కోయ, గోండు, లంబాడా, మాల, మాదిగ, బి.సి., మైనారీటి కులాలు కమ్యూనిస్టు పార్టీ లకు ఆశ్రయం యిచ్చి రాజ్యహింస భరించి కుటుంబాల్ని నాశనం చేసుకుంటూ, పోలీసు కాల్పుల్లో ప్రాణాలొడ్డుతున్న ఈ కులాల్లో ఒక్కరంటే ఒక్కరు పార్టీని నడపటానికి అర్హత సంపాదించలేదంటే ఆ లోపం ఎవరిది? 

90 సంవత్సరాలు సిద్ధాంత పోరాట పాఠాలు చెప్పిన ఈ పం తుళ్ళది కాదా? అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటకాలం నుండి యిప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలని పెం చి, పోషించి అసెంబ్లీ, పార్లమెంటులలో అధికారాన్ని కట్టబెడ్తుంది తెలంగాణా శ్రామిక కులాలు. కానీ ఈ పార్టీల సెక్రెటరీలందరూ ఆంధ్రా రాయలసీమ పెత్తందారీ కులాలవాళ్ళే. కాంగ్రెస్‌, బి.జె.పి. లాంటి కరుడుగట్టిన హిందూత్వ పార్టీల్లోనైనా అవి పరిమితం గానైనా అధికార పగ్గాల్ని అందించటానికి సిద్ధమయ్యాయి కాని, ఎన్నో ఆశలతో, ప్రాణత్యాగాలకి సిద్ధపడి వామపక్ష పార్టీల్లో చేరిన ఈ కులాలకి నాయకత్వం ఎందుకు దక్కనివ్వటంలేదు. వీరయ్యే కాదు, కమ్యూనిస్టు పార్టీల్లో పని చేస్తున్న శ్రామిక కులాల నుండి వచ్చిన నాయకులకి రాష్ట్ర నాయకత్వమే కాదు జాతీయ నాయ కత్వం వహించే దమ్ము, తెలివి, ‘నిజాయితీ’ ఉన్నాయి. 

అందుకు సి.పి.ఐ. జాతీయ నాయకుడు డి.రాజా ఓ తాజా ఉదాహరణ. సి.పి.యం. పార్టీలో పాటూరిరామయ్య మరో ఉదాహరణ. సి. పి.యం. రాష్టప్రార్టీ సెక్రటరీగా వీరయ్య పేరు పేపర్లో కనబడ గానే, కంగారెందుకు? ఖండన మండనలెందుకు? ఉద్యమాలు ఊపిరిగా, సిద్ధాంతం ప్రాణంగా చెప్పుకుంటున్న ఈ పార్టీల్లో, బహుజన కులాలు ఏనాడైనా ప్రాణాలర్పించటానకి వెనుకంజ వేసారా? తెలంగాణా సాయుధ పోరాటంలోనే కాదు నిన్నగాక మొన్న జరిగిన బషీర్‌ బాగ్‌ ‘విద్యుత్‌’ పోరాటంలో పోలీసు కాల్పు ల్లో ప్రాణాలర్పించింది ఎవరు? భూపోరాటం సందర్భంగా ముది గొండ కాల్పుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిందెవరు? పారిపో యి ప్రాణాల్ని రక్షించుకుందెవరు? చరిత్ర క్షమించదు!

1990 దశకంలో ఎ.పి. సివిల్‌ లిబర్టీస్‌ సంస్థలో జరిగిన ఒక చర్చ ఉదహరించటానికిది సరియైన సమయమే! కంచ ఐలయ్య బాలగోపాల్‌ స్థానంలో సెక్రెటరీ కావాల్సి ఉండె. అప్పుడు సివిల్‌ లిబర్టీస్‌ పెద్ద మనిషి ఒకరు ఐలయ్య నీవు సెక్రటరీ అయితే ఎవ రూ పని చెయ్యరు. ఫండ్స్‌రావు. బాలగోపాల్‌ ఉంటేనే పని స వ్యంగా జరుగుద్ది అన్నాడు. ఆ దెబ్బతో ఐలయ్య లాంటి మేధా వి వామపక్ష ఉద్యమాలకి, పౌరహక్కుల ఉద్యమాలకి దూరంగా నెట్టబడ్డాడు. అందుకే బాధాకరంగా ఉన్నా ఒక విషయం పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఈ దేశంలో హేతువాదులు హిందూ హే తువాదులుగా, కమ్యూనిస్టులు హిందూ కమ్యూనిస్టులుగా మిగి లిపోతారా లేక మార్చుకుని హేతువాదులుగా, కమ్యూనిస్టులుగా రూపాంతరం చెందుతారా? వామపక్షీయులుగానే మిగలాలంటే, వీళ్ళ ఆలోచన్లని, ఆచరణని సమూలంగా మార్చుకోవాలి.

మార్కిజమ్‌లో వ్యక్తి ప్రాధాన్యతకి తక్కువ, ప్రజల భాగస్వా మ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటారు. ప్రజలే చరి త్ర నిర్మాతలంటారు. సందేహం లేదు సి.పి.యం. పార్టీకి వీర య్యలాంటి ఒక 35 సంవత్సరాల సుదీర్ఘ వామపక్ష రాజకీయ అనుభవం ఉన్న బి.సి. కులస్థుడు, తెలంగాణీయుడు పనికిరా డా? ఎపుడూ ఆ పార్టీకి కమ్మ నాయకత్వమే కావాలా? వీర య్య, నాగయ్య, రాములు, వెస్లీలు కాకపోయినా పాటూరి రామయ్య లాంటి నిజాయితీపరుడు అనుభవజ్ఞుడు పార్టీ సెక్రటరీ పదవికి అర్హుడు కాదా? ‘‘డబ్బుండాల, మాయ ఉండాల, దబాయింపు’’ సెక్షనుండాలా వామపక్ష పార్టీలకు నాయకత్వం వహించడానికి? అపుడు రామపక్షానికి, వామపక్షానికి తేడా ఏమిటి? ఈ దేశం లో రెండుసంస్థలు ప్రధానంగా తమని తాము సంస్కరించుకోవా లి. అది ఒకటి హిందూ మైండ్‌సెట్‌. రెండు వామపక్ష పార్టీ నాయ కుల మైండ్‌సెట్‌. నేనేమి ఆర్‌.యస్‌.యస్‌., భజరంగ్‌దళ్‌, వి.హె చ్‌.పి. నాయకుల్ని కోరటంలేదు మారమని. 

gopinadh
హిందూ గుళ్ళల్లో పూజలు నిర్వహించే పూజారుల్ని మారమం టున్నాను. వేదాల్లో, పురాణాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తులోని శ్రామిక కులాలకు వ్యతిరేకంగా వున్న పురుషసూక్తం లాంటి ఫాసిస్ట్‌ సిద్ధాంతాల్ని వదిలించుకోమంటున్నాను. అదేవిధంగా వా మపక్ష పార్టీల్లో తిష్టవేసిన కుల రాజకీయాల నుండి బయటప డమంటున్నాము. హిందూమతానికి సకల సేవలందిస్తున్న బహు జన శ్రామికకులాల వాళ్ళు వాళ్ళ భయంవల్లనో, మానసిక బలీహ నతవల్లనో మీ దేవుళ్ళకు జీవితాంతం మొక్కుతున్న దేవాలయాల్లో పూజలు నిర్వహించటానికి కూడా కనీసం పూజారులను కాని వ్వండి. మావాళ్ళ వాటా మావాళ్ళకు రానివ్వండి. అదే విధంగా వామపక్ష పార్టీల్లో గత 90 ఏళ్ళుగా ఒకటి, రెండు కులాలే ఆధి పత్యం వహిస్తున్నాయి. ఇప్పుడైనా, గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకొని వీరయ్యలాంటి వాళ్ళని, నాయకత్వం లోకి వస్తున్నప్పుడు అడ్డుకోకండి. అడ్డుకుంటే హిందూ మతం లాగా, వామపక్ష పార్టీలు కూడా జీవచ్ఛవాల్లాగా మ్యూజియంల్లో చేరిపోతాయి!

Surya News Paper Dated 24/1/2012 

No comments:

Post a Comment