Wednesday, January 11, 2012

ధళితుల ముందడుగు --Sampadakiyam




స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిన తరువాత దళితుల వికాసంలో కొత్త రేకు విచ్చుకుంటున్నది. ఇప్పుడు దళితులు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని మాత్రమే కోరడం లేదు. దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలనే దగ్గరే ఆగిపోలేదు. అభివృద్ధి ఫలా లు అందుకోవడానికి తమకు చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో 2005 లోనే అఖిల భారత స్థాయిలో దళిత వ్యాపార, పారిక్షిశామిక కూటమి (డిక్కి) ఏర్పాటయింది. ఇటీవలనే డిక్కి రాష్ట్ర విభాగం కూడా ఏర్పడడం దళితుల అభివృద్ధి పథంలో మైలురాయిగా చెప్పవచ్చు. విశాఖ ఇండవూస్టీస్ అధినేత వివేక్ తదితర పారిక్షిశామిక వేత్తలు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నందున దళితులలో పారిక్షిశామికవర్గం ఎదగడానికి దారి పడుతుందని ఆశించవచ్చు. 


డిక్కి ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఏర్పడిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దళిత పారిక్షిశామిక వేత్తలను ప్రోత్సహించడానికి చేపడుతున్న పథకాలను కొన్నింటిని వివరించారు. అయితే ఇవన్నీ కంటి తుడుపు చర్యలు మాత్రమే. సరళీకరణ నేపథ్యంలో రాజకీయ పెద్దలతో సంబంధం ఉన్న పెద్దమనుషులు సాగిస్తున్న వ్యాపారాలతో పోలిస్తే దళితులకు విదిలిస్తున్న నిధులు బహుస్వల్పం. దళిత పారిక్షిశామిక వేత్తలు ఎదగడానికి ప్రభుత్వ, సమాజ సంస్కృతిలోనే భారీ మార్పు రావాలె. ఉదాహరణకు-కేంద్ర సామాజిక న్యాయ శాఖ దాదాపు 20 పథకాల కింద సాగించే రుణ వితరణ గతంతో పోలిస్తే ఈ ఏడాది 33.8 శాతం తగ్గినట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. బ్యాంకులు కూడా వివిధ కారణాలు చూపి రుణాలు నిరాకరిస్తున్నాయి. పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వక పోవడం దళితులకు సమస్యగా ఉన్నది. తమకు తోలు వ్యాపారం చేయడానికి రుణం ఇస్తామన్నారు కానీ కోచింగ్ సెంటర్ పెట్టుకుంటామంటే మాత్రం ఆమోదించలేదు అని ఒక దళితుడు వాపోయాడంటే, బ్యాంకు అధికారులలో వివక్ష ఎంతగా పాతుకుపోయిందో తెలుస్తున్నది. 



సరళీకరణ తరువాత గత ఐదేళ్ళ బడ్జెట్‌ను గమనిస్తే లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపార సంస్థలకు పన్నులను రద్దు చేసినట్టు తెలుస్తుంది. పైకి స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలు ఎంత వల్లించినా, ఒక వ్యాపార వర్గం అంతర్జాతీయ మార్పుల వల్ల, సామాజిక మార్పుల వల్ల ఇబ్బందులలో పడితే ప్రభుత్వం వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, అనేక రాయితీలు కల్పించి నిలబెడుతుంది. పరిక్షిశమలు నిలదొక్కుకునే వరకు అనేక నిబంధనలు ఉల్లంఘించినా చూసీ చూడనట్టు ఉంటుంది. రాజకీయ, పరిపాలక, వ్యాపార రంగాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉంటాయనేది బహిరంగ రహస్యం. పాలకవర్గంతో అటువంటి అనుబంధం లేకపోవడం వల్లనే తెలంగాణలోని సిరిసిల్లాలో మరమగ్గాలు విజయవంతంగా నడిచి కూడా చివరకు మూలకు పడడానికి కారణం ‘స్టేట్ సపోర్ట్’ లేకపోవడం వల్లనే. అందువల్ల దళితులకు కొన్ని పథకాలు, కొన్ని కంటి తుడుపు సబ్సిడీలు ప్రకటించినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ మద్దతు లేకుండా ఏ వ్యాపారవర్గం నిలదొక్కుకోదు. అదే విధానం దళితుల ప్రోత్సాహం విషయంలో ప్రభుత్వం ఎందుకు అనుసరించ కూడదు? 



మన దేశంలో దళిత పారిక్షిశామిక వేత్తలను తయారు చేయాలనే భావనకు పునాది అమెరికాలో ఉన్నది. అమెరికాలో ఫోర్డ్, వాల్‌మార్ట్, ఐబిఎం వంటి 15 సంస్థలు నల్లజాతీయులు, మహిళలు యజమానులు గా ఉన్న సంస్థల నుంచి వంద కోట్ల డాలర్ల మేర విడిభాగాలు కొనుగోలు చేస్తాయి. ఇదే విధానం మన దేశంలో అనుసరించాలనే భావన ఈ మధ్యకాలంలో ప్రభుత్వ, బడా పారిక్షిశామిక వర్గాలలో రూపుదిద్దుకున్నది. టాటా సంస్థ ఈ విషయంలో ముందడుగు వేసింది. 



దళితులలో ఒక పారిక్షిశామిక వర్గం రూపుదిద్దుకున్నంత మాత్రాన అది మొత్తం దళితుల అభివృద్ధి అవుతుందా అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా తలెత్తుతున్నది. ఆనంద్ తేల్తుంబ్డే వంటి మేధావి కూడా కొందరు దళిత పారిక్షిశామికుల ఉన్నతిని మొత్తం దళితుల అభివృద్ధికి దోహదపడేదిగా చూడకూడదని అభివూపాయపడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం మొత్తం దళితుల అభివృద్ధికి వ్యూహాలు రూపొందిస్తూనే అందులో భాగంగా దళిత పారిక్షిశామిక వేత్తల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలె. దళితుల్లో అసంఖ్యాకులు కటిక పేదరికంలో ఉన్నారు. దళితులపై దాడులు నిరోధించాలనేది ఇప్పటికీ ఒక ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. పేద దళితులు ఎక్కువగా ఆధారపడుతున్న ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా, దళితులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేయకుండా కొందరు దళిత పారిక్షిశామికులను అభివృద్ధికి సంకేతాలుగా చిత్రీకరించడం సబ బు కాదనే వాదన దళిత వర్గాలలోనే ఉన్నది. అయినప్పటికీ దళితులలో వ్యాపార కౌశలాన్ని పెంపొందించడానికి, ఔత్సాహికులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి సాగిస్తున్న కృషిని తక్కువగా అంచనా వేయలేము. 



తరతరాలుగా దోపిడీకి, వివక్షకు గురైన దళిత సమాజానికి, తామూ అభివృద్ధి సోపానాలను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసం కలిగించాలె. దళితుల అణచివేత సామాజి క సమస్య అయినందువల్ల ఆర్థిక చేయూత మాత్రమే సరిపోదు. వారికి స్ఫూర్తి ప్రదాత లు అనేక రంగాలలో కనిపించాలె. ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా చేయూత నివ్వ డం ఎంత అవసరమో, వారిలో సమష్టి చైతన్యాన్ని నింపడం కూడా అంతే అవసరం. రాజకీయ, వ్యాపార రంగాలలో తమ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఉంటే కోట్లాది మంది దళితులలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. రాజకీయ రంగంలో మాయావతి ఆవిర్భావం మాదిరిగానే అఖిల భారత స్థాయిలో ఏర్పడిన డిక్కి, ఇటీవలే ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఈ దిశలో ఒక ముందడుగు


Namasete telangana news paper dated 12/1/2012

No comments:

Post a Comment