Thursday, February 2, 2012

ఆదివాసీల సందుక మేడారం మ్యూజియం2-(97) talangana patrika telangana culture telangana politics telangana cinema

మేడారంలో జరుగుతున్నది ఒక జాతర కాదు. ఒక వినోద కార్యక్షికమం అంతకన్నా కాదు. సాహసానికి ప్రతీకగా నిలిచిన నేల అది. ఆధిపత్యంపై ఆదివాసీలు ఎగురవేసిన తిరుగుబాటు జెండాకు ఆ ప్రదేశం నిదర్శనం. మానవజాతి చరివూతంతా ఆధిపత్యాల చరి త్రే. ఆ ఆధిపత్యాలను తెగనరికి ప్రజల పక్షం వహించినవన్నీ విముక్తి ఉద్యమాలే. అవి ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి, చరిత్ర రకరకాలుగా తనను తాను రూపొందించుకుంటూ ముందుకుసాగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల పక్షాన నిలబడి, కలబడిన యోధుల జన్మస్థలంగా మేడా రం చరివూతలో ప్రసిద్ధి కెక్కింది. అక్కడున్న ప్రతీకలు ఆ త్యాగాని కి స్వరూపాలు. లక్షలాదిమంది గిరిజనులు పరిసర రాష్ట్రాల నుంచి వాహనాల్లో ఎన్నో ప్రయాసలకు ఓర్చి అక్క డ నివాళులర్పించడమే కొందరు పుణ్యమనుకుంటారు. కొందరు బాధ్యత అనుకుంటారు. మరికొందరు స్ఫూర్తి చెందుతారు. 

నేను ఇటీవల మేడారం వెళ్ళుతున్నప్పుడు ఎవ రు తాతా ఈ సమ్మక్క అని పిల్లలు అడుగుతుంటే వొళ్లు పులకరించింది. వారు చేసిన వీరోచిత పోరా టం ఈతరానికి వివరంగా చరివూతలో చెప్పలేకపోయామని బాధపడుతూ.. కనీసం మన సంస్కృతి అయిన వారి ఆశయాలను బతికించటానికి ఇలాం టి కార్యక్షికమాలు, జన జాతరలు ఉపయోగపడతాయి. జనం కోసం త్యాగం చేసిన మనుషులను గురించి చిన్న పిల్లలకు చెప్పి తే వాళ్లు ఆ వీరులను తమ గుండెల్లో దాచుకుంటారు. వారు ఏ త్యాగం చేశారో అక్కడ చెప్పే నాథుడెవరూ లేరు. ఆది కేవలం గిరిజనుల పాటల్లోనూ. మాటల్లోనూ లీనమైఉన్నది. కానీ ఈ సమాజానికి సమ్మక్క, సారక్కలను ఒక దేవతలుగానే చూపుతున్నారు. అది కూడా ఎండోన్మెంట్‌శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్షిక మం నిర్వహిస్తున్నారు.

ఈ శాఖ ఉద్దేశం కూడా ప్రజల్లో వారం భక్తి కలిగించాలనే కానీ, స్ఫూర్తి కలిగించాలని మాత్రం కాదు. మనుషులను దేవతలుగా చేస్తారు. సామాన్యుడు వారిపట్ల భక్తి చూపించి ‘ఇది మనం చేయవలసిన పనికాదు, ఈ పని మానవాతీతులు చేసేపని’ అని చెప్పి ప్రజలను నిస్సహాయకులుగా చేయటమే వారిపని. కానీ చేసిన త్యాగాన్ని చెబితే.. ఆ ఆదిమ సమాజ జాతులపై సమాజానికి గౌరవం పెరిగేది. వీటిని తెలపటానికే నేను గత మూడు సంవత్సరాల నుంచి మ్యూజియం పెట్టండని వూపభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

వీరులు చేసిన త్యాగాల గడ్డ అది. అది పుణ్య రణక్షేత్రం. ప్రజ లు నివాళులర్పిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివస్తున్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించటానికి రోడ్లు వేస్తున్నారు.బోరుబావులు వేస్తూ సౌకర్యాలు కలుగజేస్తున్నారు. అందుకు ప్రభుత్వానికి, జిల్లా పాలనాయంవూతాగానికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు. ఇవన్నీ మన కోసం చేసుకుంటున్న పనులు. కానీ ఆ త్యాగాన్ని వచ్చే తరానికి స్ఫూర్తిని మాత్రం కలిగించలేకపోతున్నాం. మనకున్న మూడువేల దేవుళ్లలో సమ్మక్క సారలమ్మ లను కూడా దేవతలుగా మార్చివేశారు. ఇదే అంబేద్కర్ విషయంలో కూడా జరిగింది. పీడిత ప్రజానీకం కోసం పోరాడిన యోధుడు. సామాజిక సంకెళ్లను తెంచటానికి జీవితాన్ని అర్పించిన మనిషని, తరతరాలుగా ఆధిపత్యవర్గాల కింద నలిగిన, దారివూద్యంలో బక్కచిక్కిన వ్యక్తుల కోసం రాజ్యాంగాన్ని ప్రసాదించా రు. అట్టడుగు దళిత బహుజన వర్గాలకు ఒక తోవ చూపిన వ్యక్తి అని మన నాయకులు ప్రచారం చేయలేకపోయారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించటంలో పాలకులు ఇప్పటికీ రాజ్యాం గం సాక్షిగా ఘోరంగా విఫలమవుతూ వస్తున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించటమంటే.. దళిత బహుజన వర్గాలు ఆత్మగౌరవంతో నిలబడేందుకు కృషి చేయటమే. కానీ మన పాలకు లు ఆ పని చేయడం లేదు. అంబేద్కర్ విగ్రహాల వెనుక అంకిత భావం, సేవ, లక్ష్యాలు, వారు చూపిన మార్గంలో అదే దీక్షతో జాతి ముందుకు సాగాలి. 

ఈ విగ్రహాలు వచ్చే తరంలో చైతన్యం రగులుకొల్పే ప్రతీకలు గా నిలబడి తీరుతాయి. కొందరి ఆగ్రహానికి ఈప్రతీకలు గురైతే ఆ భావాలు ఏవిధంగా ఛిద్రమౌతాయో ఆలోచించాలి. ఆ త్యాగాలను లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజల కోసం త్యాగం చేసిన వారి చరివూతను భావితరాలకు పాఠ్యాంశం చేసి పుస్తకాలలో పెట్టాలి. అప్పుడే ఆ త్యాగధనులకు జాతి సరైన నివాళులు అర్పించినట్లవుతుంది.
మేడారంలో శాశ్వతంగా చారివూతాత్మకంగా ఉండేట్లు ‘మ్యూజియం’ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఒప్పుకుని రెండు కోట్ల రూపాయాలు మంజూ రు చేసినందుకు అభినందనలు. రెండు సంవత్సరాల కొకసారి జరిగే ‘మేడారం జాతర’గా మాత్రమే కాకుండా మ్యూజియంను నెలకొల్పటం వలన అదొక విజ్ఞాన కేంద్రంగా మారుతుంది. అ ప్పుడు ప్రజలు గిరిజనుల సంస్కృతిని అవగాహన చేసుకుంటా రు.

మన సంస్కృతిలో సమన్వయం చేసుకుంటారు. అది సమా జ చరివూతలో భాగమైపోతుంది. కాలం ఇలాంటి వీరుల్ని సమాజానికి ప్రసాదిస్తున్నది. మనం ఆ స్ఫూర్తిని కాపాడుకుంటే సభ్యతగల సమాజం అవుతుంది. వారు వచ్చే తరానికి వెలుగునిచ్చే శిఖరాలవుతారు. 

మేడారంలో ప్రభుత్వం నిర్మించబోయే మ్యూజియంతో సమ్మక్క, సారలమ్మలతో పాటు మొత్తం అదొక గిరిజన ప్రదర్శనశాలగా రూపొందించబడుతుంది. ఆదివాసీల తెగలకు సం బంధించిన వస్తువులు, ఆయుధాలు, వారి శ్రమకు సంబంధించిన పరికరాలు, వేష భాషలు, వస్త్రధారణలు, ఆహారం,అలవాట్లు, వారి సాహితీ సాంస్కృతిక కళలు, వారి విభిన్న అభిరుచులు, అడవిని కాపాడిన బిడ్డలుగా ప్రకృతి ఒడిలో వారి ప్రతిరూపాలన్నింటినీ ఆ మ్యూజియంలో నెలకొల్పాలి. మొత్తం గిరిజన తెగలకు చెందిన వివిధ దశలను, రూపాలను తయారు చేయాలి. సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించిన సంకేతాలు, దృశ్యాలు ఇందులో ఉండాలి. ఆధిపత్య సంస్కృతిపై, ప్యూడల్ వ్యవస్థపై ఎగిసిన కత్తులుగా సమక్క, సారలమ్మల రూపాలను ఆ మ్యూజియంలో రూపొందించాలి. గిరిజన భాషలకు సంబంధించిన విషయాలన్నింటిని అక్కడ భద్రపరచాలి. ఆదివాసీల సంస్కృతికి నిలువుటద్దంగా మేడారం మ్యూజియం తయారు కావాలి. అది ఒక విజ్ఞాన భాండాగారం గా నిలవాలి. తెలుగుజాతి శౌర్యానికి ప్రతీకగా ఆ మ్యూజియం తీర్చిదిద్దబడాలి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యు
Namasete Telangana News Paper Dated 03/2/2012 

No comments:

Post a Comment