Sunday, February 26, 2012

ఆదివాసీల ఆప్తుడు బియ్యాల


ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఆది నుంచీ ఆదర్శ భావాలతో మెలిగిన ఆయన జీవితం, తొలి అనుబంధం ఆదివాసులతోనే. మలి అనుబంధం తెలంగాణ కోసం సాగింది. ఆయన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో బియ్యాల కిషన్‌రావు, అంజనమ్మ దంపతులకు 1955 అక్టోబర్ 12 న జన్మించారు. బాల్యంలోనే జనార్దన్‌రావు కుటుంబం కొత్తగూడెం మండలంలోని ఏజన్సీ ఓటాయి గ్రామానికి వలస వెళ్ళింది. అందుకే ఆయన ఓటాయి వాసిగానే సుపరిచితుడు. పేద కుటుంబం. కష్ట నష్టాలు చదువుకు అడ్డం కాదంటూ తన పొరుగు గ్రామమైన సాధిడ్డిపల్లిలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఏడో తరగతి వర కు చదువుకున్నారు. పదవ తరగతి నర్సంపేటలో చదివారు. అలాగే ఇంటర్ విద్య గోదావరిఖనిలో, డిగ్రీ హన్మకొండ ఎల్బీ కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ)కాకతీయ యూనివర్సిటీలో కొనసాగింది. 

చిన్ననాటి నుంచి తను ఏజెన్సీ గ్రామంలో నివసించడం మూలాన, ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సంప్రదాయ వారసత్వ జీవన విధానమును ఆకళింపు చేసుకున్నారు. మరోపక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు పరాయికరణ చెందడంపై ఆవేదన చెందారు. ఎలాంటి చైతన్యం లేని ఆదివాసీలకు చెందిన భూములు 1960లోపే 4 శాతం వలస గిరిజనేతర గూండాలు, పెత్తందార్లకు అన్యాక్షికాంతమయ్యాయి. ఆ దశలో ఆదివాసీల భూ సమస్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పాలనే సంకల్పంతో ఎంతో కృషి చేశారు. బియ్యాల 193లో కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినివూస్టేషన్ విభాగంలో పార్ట్‌టైం ఆధ్యాపకుడుగా చేరారు. ఆదివాసులపై లోతైన పరిశోధనలకు పూనుకున్నారు. ఆయన ‘గిరిజన భూముల పరాయికరణ’ అనే అంశంపై పరిశోధన చేసి 195లో పీహెచ్‌డీ పట్టా పొందారు. తదనంతరం 1990 నుంచి అసిస్టెంట్ ప్రొఫసర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 1993 నుంచి 1995 వరకు ఆంధ్రవూపదేశ్‌లో ఆదివాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై దృష్టిపెడుతూ.. ఆదివాసులపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తి జనార్దన్ రా వే కావడం విశేషం.

బియ్యాల జనార్దన్‌రావు సామాజిక స్పృహతో 62 జాతీయ సెమినార్‌లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలలో జరిగిన 11 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. 
‘మట్టిపూలు’,‘ఆదివాసీ సమాజం-సమస్యలు’, ‘ఆదివాసులు-స్వ యంపాలన’, ‘భారతదేశంలో ప్రభుత్వం-భూస్వామ్య రైతులు’ అనే పుస్తకాలను, 42 వ్యాసాలను ప్రచురించారు. 1993-95 మధ్యకాలంలో ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’ న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. ఆయన వివిధ జాతీయ స్థాయి పరిశోధనా ఆధ్యయన కమిటీలలో సభ్యులుగా ఉంటూ, జర్మనీ సామాజిక శాస్త్రవేత్తల సహకారంతో ‘మూడవ ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ - అభివృద్ధి’, గ్రామీణ గిరిజన సమాజాల ఆధ్యయనం, దేశీయ వనరుల వినియోగం, వలసవాద సమకాలీన ప్రభుత్వ విధానాల విశ్లేషణ వంటి వాటిపై తన పరిశోధనా దృష్టిని సారించారు. 

2001 కాలంలో కాకతీయ యూనివర్సిటీలోని పబ్లిక్ అడ్మినివూస్టేషన్ విభాగంలో జనార్దన్‌రావు ‘డీన్’ గా నియమితులయ్యారు. బియ్యాల మలిదశ ‘తెలంగాణ’ ఉద్యమానికి తొలి సిద్ధాంతకర్తగా భూమిక పోషించారు. తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణచివేతల గురించి అనేక రచనలు చేశారు. అదేకాలంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి అమెరికాలో జరిగిన ‘తానా’ సభల్లో పాల్గొని ఆంధ్రవూపదేశ్‌లో అభివృద్ధి అసమానతలు, ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి తెలంగాణ ఉద్యమానికి అంత ర్జాతీయంగా సమ్మతిని కూడ గట్టారు. సమైక్య రాష్ట్రంలో ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ పంపిణీల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటిసారిగా లేవనెత్తిన ఘనత జనార్దన్‌రావుకే దక్కుతుంది. సమైక్యపాలనలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు, ఎట్లా ఉల్లంఘించ బడ్డాయో ఎండగడుతూ.. విద్యార్థులు, మేధావుల్లో ప్రచారం చేయడంలో ప్రొఫెసర్ జనార్దన్‌రావు ప్రధాన భూమికను నిర్వహించారు. జనార్ధన్‌రావు ఒకరు తెలంగాణ కోరితే రాష్ట్రం ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలను సైతం సంధించుకుని తన సహచరి ప్రొఫెసర్ రేవతి తోడ్పాటుతో ముందడుగు వేశారు. ఉద్యమాచరణలో ముందున్నారు. మూడు తరాల ప్రతినిధి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్‌లతో సమ ఉజ్జీగా నిలిచి వారితో కలిసి ఉద్యమంలో పనిచేశారు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌తో కలిసి పార్టీ మేనిఫెస్టోను రూపొందించడంలో పాలుపంచుకున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో, ప్రజాపరిపాలన, శాంతిభవూదతల విషయంలోనూ ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు. 1999 లో కన్నాబిరాన్, ఎస్‌ఆర్ శంకరన్ తదితరులతో కలిసి ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండా ముందుకు తెచ్చారు. ఆదివాసీలను చైతన్య వంతులను చేస్తూ ఆదివాసీ ఉద్యమంతోపాటుగా, తెలంగాణ ఉద్యమానికి జనార్దన్‌రావు ఎనలేని సేవలు చేశారు. బియ్యాల జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తపన పడ్డారు. గిరిజనుల స్వయం పాలన కోసం రాజరికపు వ్యవస్థపై వీరోచితంగా పోరాడి నేలకొరిగిన ‘సమ్మక్క- సారలమ్మ’ జాతర జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు 2002 ఫిబ్రవరి 27న ప్రకృతి ఒడిలో చేరిపోయారు. జనార్ధన్‌రావు ఉద్యమ స్ఫూర్తి ఆదివాసీ గిరిజనుల గుండెల్లోనూ,మలిదశ తెలంగాణ ఉద్య మంలోనూ సజీవంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఉద్యమ కార్యకర్తగా, యావత్ తెలంగాణ ప్రజల మదిలో అనుక్షణం మెదులుతూనే ఉంటారు. మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు ఆశయమైన ఆదివాసులకు స్వయం పాలన, తెలంగాణ రాష్ట్రసాధనకోసం ఆయన మిత్రులుగా, అభిమానులుగా పోరాడు దాం.అదే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి! 
- గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం
(నేడు.. ప్రొఫెసర్. జనార్దన్‌రావు పదవ వర్ధంతి.
Namasete Telangana News Paper Dated 27/02/2012 

No comments:

Post a Comment