Wednesday, February 8, 2012

విద్య: విలువల చట్రమేమిటి?


IndiaC talangana patrika telangana culture telangana politics telangana cinemaవిద్యాహక్కు చట్టం పాఠ్యవూపణాళికను పరిశీలించి తగిన మార్పులు చేయాలని ఆశిస్తున్నది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను తమ తమ పాఠ్యవూపణాళికను నిపుణుల సహాయంతో పునఃపరిశీలించి రూపొందించవలసిందిగా కోరింది. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా 1 కమిటీలను వేసి, ఆ కమిటీల నివేదిక ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించారు. ఆంధ్రవూపదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యులు తమ ప్రతిస్పందన పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. దీంట్లో ప్రధానంగా పాఠశాల విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయకుండా ఏ మార్పులు ప్రవేశపెట్టినా అవి పైపై మెరుగులై అవుతాయి తప్ప కొత్త చూపును ఇవ్వలేవు అనేది ఒక అంశం

. అలాగే కామన్ స్కూల్ విధానం లేకుండా, కామన్ కరికులం ప్రవేశపెట్టలేము. అలాగే విద్య లక్ష్యాలను పునర్ నిర్వచించకుండా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించలేము. ఇది చాలా స్పష్టమైన అంశం. దీనికి తోడు ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వైపు కొట్టుకుపోతున్న విద్యావిధానాన్ని కాపాడడం చాలా కష్టం. మార్కెట్లు చాలా బలీయమైన శక్తి. ఎంత పటిష్టమైన వాదనలైనా అది డబ్బుల ఎర చూపిం చి నిర్వీర్యం చేయగలదు. కొన్నివేల ఉద్యోగులకు కొన్ని లక్షల రూపాయల నెలసరి ఆదాయం ఎర చూపిస్తే, ఆ పరిమిత ఉద్యోగులకు లక్షలాది మంది పోటీపడుతున్నప్పుడు, మనిషి గురించి, మానవ సంబంధాల గురించి, జీవితాన్ని గురించి, జీవితపు అర్థాన్ని గురించి మాట్లాడే వాళ్లు వేదాంతులుగా, సర్వసంగ పరిత్యాగులుగా కనిపిస్తారే కాని జీవితపు సత్యాలను గురించి మాట్లాడుతున్న వాళ్లుగా కనిపించరు. డబ్బులు సృష్టించే మాయా ప్రపంచం వాస్తవమైందిగా, వాస్తవ ప్రపంచం మాయా ప్రపంచంగా మార్చబడతాయి. ఇప్పుడు విద్యా విధానం ఒక మాయా ప్రపంచంలోకి నెట్టబడింది.

విద్యా విజ్ఞానం అంతిమంగా రెండు అంశాలకు సంబంధించి ఉంటుంది. ఒకటి మనిషికి ప్రకృతికి ఉండే సంబంధం. రెండు మనుషుల మధ్య ఉండే సంబంధాలు. ప్రకృతితో సంబం ధం మనుషుల సంబంధాల మీద మనుషుల సంబంధాలు ప్రకృతి మీద ప్రభావం కలిగి ఉంటాయి.

మానవ ప్రస్థానం ప్రకృతిని ఎదుర్కొనడంలో, ప్రకృతి శక్తులను తన మనుగడ కోసం ఉపయోగించడంలో ప్రారంభమై ప్రకృతిని విధ్వంసం చేసే దశకు చేరుకున్నది. ప్రకృతిని పూజించే మనిషిని అమాయకుడని, అనాగరికుడని అంటే ప్రకృతిని విధ్వంసం చేసే మనుషులను ఏం అనాలి? అలాగే గణాలలో నివసించే సమష్టి తత్వం, ఆస్తి ఇంకా సంబంధంగా మారని దగ్గర ప్రారంభమై కేవలం ఎవ రి కోసం వారు బతకాలి అనే దాకా చేరుకు న్నాం. ఈ సంబధాల పునాదులలోకి వెళ్లి విద్యావ్యవస్థ చూడగలదా అన్నది మౌలికమైన ప్రశ్న. ఈ తాత్విక పునాది లేకుండా విద్య మనిషిని మనిషిగా ఎదగనివ్వదు. అందుకే ఏ ప్రణాళిక తయారు చేసినా అంతిమంగా మని షి స్వప్రయోజనపరుడు అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాఠ్యాంశాలలో అనివార్యంగా ఉంటుంది.
అందుకే విద్యకుండే ‘విలువల చట్రం’ ఏమిటి అనేది ప్రధానమైన ప్రశ్న. సార్వజనీన విలువలుంటాయా, లేక విలువలు సాపేక్షికమా అన్నపుడు అందరూ అంగీకరించే విలువలు లేకపోవచ్చు. 

కానీ ఏ విద్యా విధానమైనా తన విలువల చట్రమేమిటో స్పష్టంగా రూపొందించుకోవలసి ఉంటుంది. విలువల చట్రాల మధ్య వాదవివాదాలు ఉండవచ్చు. కానీ ప్రతి మనిషి లేదా ప్రతి విద్యావ్యవస్థ స్థూలంగా తన విలువల చట్రం మీద ఒక స్పష్టత కలిగి ఉన్నప్పుడు, జీవితాన్ని ప్రపంచాన్ని చూసే పద్ధతి తెలుస్తుంది. జీవిత అనుభవం మనిషిని దెబ్బకొట్టినప్పుడు తన విలువలను అనుభవపు వెలుగులో మెరుగుపరుచుకోవడమో, మార్చుకోవడమో జరుగుతుంది. అందుకే గురజాడ ఒక సందర్భంలో పుస్తకాలు చదవడం వల్ల వచ్చే విజ్ఞానం కంటే జీవితపు అనుభవాల సారాంశమే విజ్ఞానము అని అంటారు. అయితే అనుభవమున్నం త మాత్రాన విజ్ఞాని కాడు. అనుభవాన్ని వడపోసే శక్తి మనిషికుండాలి. నిజానికి విద్యావ్యవస్థ మనిషికి అలాంటి శక్తిని ఇవ్వగలగాలి. చాలా మంది చాలా యాంత్రికంగా జీవిస్తుంటారు. అలా యాంత్రికంగా మార్చడం పాఠ్యవూపణాళిక లక్ష్యం కూడా. 

చెప్పిన పాఠాన్ని కంఠస్థం చేసి దాన్ని మళ్లీ చెప్పగలిగితే దాన్ని ప్రతిభ అని భ్రమపడుతున్నారు. చెప్పిన అంశం మీద పిల్లలు స్పందించి, ప్రశ్నిం చి దాని లోతులకు వెళ్లే మార్గాన్ని చెప్పగలగాలి. విజ్ఞానమంతా లాజిక్, సీక్వెన్స్ అని ఒక తత్వవేత్త అంటాడు. మూలాలకు వెళ్లే మార్గాలు తెలిసిన వాళ్లు దేన్నైనా సులభంగా అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్లే ఏది మాట్లాడినా, ఏ పని చేసి నా చాలా సృజనాత్మకంగా చేస్తారు. అలాంటి మన కాలం మనుషులలో బాలగోపాల్ ఒక చక్కటి ఉదాహరణ. గణిత శాస్త్రమైనా, చరిత్ర అయినా, సాహిత్య విమర్శ అయినా, సామాజిక విశ్లేషణ అయినా, న్యాయవాదవృత్తి అయినా అన్నింటిని సమర్థమంతంగా చేయగలిగాడు. అది చేయడానికి ఆయన ఆలోచనా పద్ధతిలో మూలాలకు వెళ్లే ఒక బలమైన కోణం ఉంది. ఆ పద్ధతిని, ఆ కోణా న్ని విద్య ఇవ్వగలిగితే మనిషి చాలా క్లిష్టమైన అంశాలను కూడా చాలా సునాయసంగా అర్థం చేసుకోగలడు. దాన్ని ఆచరించి సత్యాన్ని పరిశోధించగలడు.

విద్య ప్రకృతి గురించి పాఠ్యాంశాలలో చేర్చినప్పుడు ప్రకృతి శాస్త్రాలను విడగొట్టి చెబుతుంది. విడగొట్టడం ఒక అవసరమైనా ప్రకృతి సూత్రాల మీద, ఆ సూత్రాల మధ్య ఉండే పరస్పర సంబంధాల మీద సమగ్ర అవగాహన లేకుండా చదవడం వల్ల విజ్ఞానం మానవ మేధస్సు వికాసం చేసే బదులు కళ్లకు గంతలు కట్టినట్టుగా మారుతుంది.

అందుకే విశ్వవిద్యాలయాలలో పనిచేసే చాలా మంది సైంటిస్టులు సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు అనవసరం అనే ఒక బలమైన అభివూపాయాన్ని కలిగిఉన్నారు. అలాగే సామాజిక శాస్త్రాలను విడగొట్టి ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల ఆర్థిక శాస్త్రవేత్తకు రాజకీయాల పట్ల, రాజ్యం పట్ల అవగాహన లేకపోవడం, సాహిత్యం అంటే అసలే గిట్టకపోవడం చూస్తు న్నాం. సమాజాన్ని సమక్షిగంగా చూడని వారు సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదగడం సాధ్యం కాదు. మార్క్సు చరిత్ర, రాజకీయాలు, సామాజిక సంబంధాలు, తత్వశాస్త్రం, మానవ పరిణామశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ మౌలిక సూత్రాలు అన్నింటిని కలిపి చూడగలిగాడు. మనసు బాగాలేనప్పుడు కఠినమైన గణిత సమస్యలను చేసేవాడు. అంటే మానవ మేధస్సు అంత అపరిమితమైందా అని అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుం ది. పాఠ్యవూపణాళిక మౌలిక భూమికలో సమక్షిగంగా చూడడం అనేది భాగం కావాలి.

అలాగే సామాజిక మార్పు అనేది. మంచి సమాజం అంటే ఏమిటి? ఎంత సుందరమై న ప్రపంచాన్ని మనిషి కలగనగలడు అనేది కూడా పాఠశాల విద్య నుంచే ప్రారంభం కావాలి. దీనికి ఒక మౌలికమైన ప్రశ్న క్లాస్‌రూంలో చర్చకు రావాలి. అది ఒక మనిషి మరొక మనిషి మీద ఎందుకు ఆధిపత్యం చేస్తున్నాడు. ఆధిపత్యానికి మూలాలు ఎక్కడున్నాయి? సమాజంలోని అన్ని ఆధిపత్యాల మీద పాఠ్యాంశాలుండాలి. అవి మతం కావ చ్చు, కులం కావచ్చు, ఆస్తి కావచ్చు, రాజ్యం కావచ్చు, పురుషాధిక్యత కావచ్చు, ప్రాంతాల ఆధిపత్యం కావచ్చు, సామ్రాజ్యవాదం కావ చ్చు. ఈ అన్ని సంబంధాలు కూడా ఆధిప త్యం చెలాయిస్తున్న మనిషిని మనిషిగా మసలనివ్వదు. ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న మనిషిని స్వేచ్ఛగా ఎదగనివ్వదు. నిజానికి అన్ని సమాజాల్లో ఉండే సంక్షోభాలకు ఇది ఒక మూలకారణం.

పాఠ్య వూపణాళికకు ఈ తాత్విక, నైతిక భూమిక కావాలి. ఇప్పుడున్న సామ్రాజ్యవా ద ఆక్రమణలో, ప్రపంచీకరణ తుపానులో ఈ మౌలికమైన అంశాలను పాఠ్యవూపణాళికలో చేర్చడానికి ఎవరికి సాహసం లేదు. అందుకే ఏ మార్పులు తెచ్చినా అవి విద్యావ్యవస్థ పునాదులను స్పృశించడానికి సిద్ధంగా లేవు. అయితే మార్పులు ఆ దిశలో సాగాలి అన్న అవగాహన ఉపాధ్యాయ లోకానికి ఉండాలి. పిల్లల్ని గత తర్క పద్ధతిలో ఆలోచింప చేయగలిగితే తాము నేర్చుకుంటున్న పాఠాల పరిమితులు తెలుసుకుంటారు. పాఠాలను తమ అనుభవంతో బేరీజు వేసుకుంటారు. విజ్ఞానికికుండే అంతర్గత చలన సూత్రాలను చూసే శక్తినిస్తే, తర్వాత పని పిల్లలే చేస్తారు. విద్యా పరిరక్షణ కమిటీ వ్యాసంలోని కొన్ని అంశాలను పేర్కొంటూ ప్రభుత్వానికి తమ అభివూపాయాలను తెలిపారు. అక్కడితో ఆగక ఈ మొత్తం విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు పెడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
-పొఫెసర్ హరగోపా
Namasete Telangana News Paper Dated 09/02/2012 

No comments:

Post a Comment