Monday, February 27, 2012

హైమన్‌డార్ఫ్ అనుబంధం



మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కుమారుడు నికోలస్ తదితరులు ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి రావడం స్థానిక గిరిజనులతో ఆయనకున్న అను బంధానికి నిదర్శనం. నిజాం కాలంలో సతీమణి ఎలిజబెత్‌తో కల్సి హైమన్‌డార్ఫ్ ఆదివాసీ జీవితాలను అధ్యయనం చేసేం దుకు ఆదిలాబాద్ జిల్లా మారుమూల పల్లెలో 1941లో అడుగుపెట్టారు. అక్కడే ఒక గుడిసెలో ఏళ్ళ తరబడి వుండిపోయారు. ఆయన గిరిజన సమస్యలపై తీసుకున్న చొరవ వల్ల, నాటి నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్‌ను రాష్ట్ర గిరిజన, వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ సలహాదారుడిగా ఎంపిక చేసింది. ఆయన ఆదివా సుల జీవితాలను, సమస్యలను అధ్యయనం చేస్తూ వారి ప్రేమా భిమానాలను చూరగొన్నా రు.
గోండుల,చెంచులపై అధ్యయనం హైమన్‌డార్ఫ్‌కు ప్రధాన అంశంగా మారింది. ఆయన ప్రయాణం చేసిన గిరిజన ప్రాంతాలు చాలావరకు అంత కు ముందు ఎవరూ వెళ్లనివే! అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని కూడా కొంతకాలం చేశారు. హైమన్‌డార్ఫ్ చొరవతోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్ర విభాగాన్ని ఏర్పాటయింది. ఆ శాఖలో మొదటి బ్యాచ్ విద్యార్థిగా చదివిన వారు వరంగల్ వాసి పి. కమలా మనోహరరావు.ఆ తరు వాత కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ ప్రథ మ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా షెడ్యూల్డ్ తెగల- వర్గాల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఆరంభించడానికి కూడా హైమన్‌డార్ఫ్ కారకులు. ఆ శాఖలో ట్రయినీ నిర్వాహకుడిగా పనిచేసేందుకు కమలా మనోహర్ రావును హైమన్‌డార్ఫ్ ఎంపిక చేశారు. కమ లా మనోహరరావు ప్రథమ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా (1966లో ఆ శాఖ ఏర్పడినప్పుడు) బాధ్యతలు స్వీకరించి 1975లో పదవీ విరమణ చేసిందాకా ఆ శాఖలోనే పనిచేశారు. 

పాలనా సంస్కరణల కమిషన్ వేసినప్పుడు కమలా మనో హర్ రావు చేసిన సూచనలు విలువైనవి. ఆయన నివేదిక హైమన్‌డార్ఫ్ ప్రశంసలను అందుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షే మ పాలనా విధానాన్ని క్రమబద్ధం చేయడానికి కమలా మనోహరరావు ఏక గవాక్ష పద్ధతిని సూచించారు. హైమన్‌డార్ఫ్ స్వదస్తూరీతో కమలా మనోహరరావుకు ఈ నివేదిక విషయంలో సుదీర్ఘమైన ఉత్తరం రాశారు.ఆ నివేదిక తయారుచేసినందుకు కమలా మనోహరరావును అభినందించారాయన. గిరిజన ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించి మనోహర రావు చేసిన విశ్లేషణలను హైమన్‌డార్ఫ్ పొగిడారు. ఆ నివేదికలో గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్ట్ అధికారి ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా వుంది. కలెక్టర్‌తో సమానమైన అధికారిక హోదాకల ప్రాజెక్ట్ అధికారి నియామకం ఆవశ్యకతను హైమన్‌డార్ఫ్ గట్టిగా సమర్థించారు. గిరిజన సహకార సంస్థ పనితీరుకు సంబంధించి, స్వతంత్ర ప్రతిపత్తిగల గిరిజన సాంస్కృతిక పరిశోధనా శిక్షణా సంస్థ ఏర్పాటు గురించి, సచివాలయ స్థాయిలో షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవహారంలో పాలనాపరమైన మార్పుల గురించి ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ హైమన్‌డార్ఫ్ అభినందనలందుకున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న షెడ్యూల్డ్ తెగల- వర్గాల విభాగాన్ని పటిష్టం చేయడానికి హైమన్‌డార్ఫ్ తన శిష్యుడు, కమలా మనోహరరావును ఎంపిక చేసుకున్నారు. ఆ కలయిక ఫలితంగానే వరంగల్ జిల్లా లో హైదరాబాద్ గిరిజన ప్రాంతాల నియంవూతణ చట్టం 1949 అమలుకు నోచుకుంది. దరిమిలా హైమన్‌డార్ఫ్ సూచనతో, వారిరువురి కృషి ఫలితంగా, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్‌గా కమలా మనోహర రావును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఏ ప్రాంతంలోనైతే హేమెన్‌డార్ఫ్ ఆయన సతీమణి ఎలిజబెత్‌తో కలిసి, గిరిజనుల సంక్షేమం కొరకు ఏళ్ల తరబడి కృషి చేశా రో, అవే పరిసరాలలో, వారిద్దరినీ శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు జ్ఞాపక చిహ్నాలను ఏర్పాటుచేయడం అభినందించాల్సిన విషయం. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లా ఆ ప్రాంతానికి ఆయన కుమారుడు, మనుమడు వచ్చి వారికి నివాళులర్పించడం విశేషం.

-వనం జ్వాలా నరసింహారా
Namasete Telangana News Paper Dated 28/02/2012 

No comments:

Post a Comment