Saturday, March 3, 2012

సామాజిక జడత్వమే ప్రధాన అవరోధం---రిచర్డ్‌ ఎం. స్టాల్మన్‌


సామాజిక జడత్వమే ప్రధాన అవరోధం

                                                                                                            

రిచర్డ్‌ ఎం. స్టాల్మన్‌ గత 29 సంవత్సరాలుగా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ సేవలందించడంలో అలుపెరగని కృషి చేస్తున్నారు. ఆయన 1983లో జిఎన్‌యు ప్రాజెక్టును, 1985లో ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. జిఎన్‌యు- జనరల్‌ పబ్లిక్‌ లైసెన్స్‌ ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి. మేథోసంపత్తి హక్కుల యాజమాన్య సిద్ధాంతంలో నూతన విప్లవం ఆవిష్కరించారు. జిఎన్‌యు అనేక రకాల సాఫ్ట్‌వేర్‌ పథకాలను ముందుకుతెచ్చి ప్రపంచ వ్యాప్తంగా నేడు కోట్లాదిమంది ఉపయోగిస్తున్న టూల్స్‌గల లైనక్స్‌ కెర్నెల్‌ను ఆవిష్కరించారు. వినియోగదారులు తమకిష్టమైన సాఫ్ట్‌వేర్‌ కార్యక్రమాన్ని ఉపయోగించి సోర్స్‌ కోడ్‌ను మార్చుకుని కొత్త వర్షన్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించి పంపిణీ చేయడం ఫ్రీసాఫ్ట్‌వేర్‌ వెనుక ముఖ్యోద్దేశం. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో ప్రసంగించేందుకు స్టాల్మన్‌ ఇటీవల చెన్నరు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఫ్రంట్‌లైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు...

ఫ్రీసాఫ్ట్‌వేర్‌ వ్యవస్థ గురించి కచ్చితమైన అవగాహన లేకపోయినా, అసలు అటువంటి వ్యవస్థ పట్ల సానుకూలత ప్రదర్శించకపోయినా, ఆచరణలో దానిని ఉపయోగిస్తున్న కొంతమంది 1988లో 'ఓపెన్‌ సోర్స్‌' అనే కొత్త పదాన్ని వాడుకలోకి తీసుకువచ్చారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కొత్త వ్యవస్థను ప్రచారంలోకి తీసుకువచ్చారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా చూసేందుకేదీనిని వాడుకలోకి తీసుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు. ప్రజలు ఆచరించే విధానాలను అధ్యయనం చేసేందుకు కొంతమంది ఫ్లాస్‌ అనే పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఓపెన్‌ సోర్స్‌పై మాత్రమే దృష్టి సారించి మిగిలిన విషయాలను విస్మరించేవారు ఫాస్‌ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే, వారు ఉచిత అనే పదాన్ని ఉపయోగించేందుకు నిరాకరించారు.
ఒకే వస్తువును ఉపయోగించేప్పుడు పేరుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటనే ప్రశ్న వస్తుంది. అయితే ఫ్రీసాఫ్ట్‌వేర్‌ ఒక ఉత్పాదక సరుకు కాదు. అమ్మకానికి ఉద్దేశించిన వాటిని ఉత్పాదక సరుకుగా పిలుస్తారు. జిఎన్‌యు వ్యవస్థ అందుకే ఒక వస్తువు కాదు.ఉచిత ఆపరేటింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉండటం, యాజమాన్య సాఫ్ట్‌వేర్‌ను తేలికగా మార్చుకునేందుకు అవకాశం ఉండటం వల్లనే 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన జిఎన్‌యు ప్రాజెక్ట్‌ విజయం సాధించింది. అయితే జిఎన్‌యు ప్రాజెక్ట్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక కంప్యూటర్లు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించలేదు. హార్డ్‌వేర్‌ స్పెక్స్‌ రహస్యంగా ఉండటం లేక కొన్ని కంప్యూటర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దానిని మాత్రమే ఉపయోగించే అవకాశం కలుగజేస్తున్నాయి. ఇది ఫ్రీసాఫ్ట్‌వేర్‌ విస్తృతికి ప్రధాన సవాలుగా ఉంది. సామాజిక అవగాహనా రాహిత్యం కూడా జిఎన్‌యు ప్రాజెక్ట్‌ విస్తృతికి సవాలుగా నిలుస్తోంది. అనేక మంది ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ ఇతరులు కూడా దానినే ఉపయోగించాలని ఒత్తిడి తీసుకొస్తుంటారు. అనేక సామాజిక, ఇతరులపై ప్రభావం చూపగల వ్యక్తులు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంటారు. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఆటోకాడ్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను పాఠశాలల్లో కూడా ప్రవేశపెడుతున్నాయి.
సైబర్‌స్పేస్‌కు స్వేచ్ఛ కల్పించడమే ఫ్రీసాఫ్ట్‌వేర్‌ లక్ష్యం. తాము కోరుకునే వివిధ ఆప్షన్లను ఎంచుకునేందుకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించినందున ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అనేక కొత్త ప్రోగ్రాం రూపొందించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలను కూడా ఉచితంగా పంపిణీ చేయడం ద్వారానే ఈ సాఫ్ట్‌వేర్‌కు సార్థకత లభిస్తుంది.
స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగిం చుకునేందుకు కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ అవకాశం కల్పిస్తుంది. ఇది ఈ వ్యవస్థలోని అత్యంత సానుకూల అంశం. అమెరికాలో ఇటీవల వచ్చిన స్టాప్‌ ఆన్‌లైన్‌ పైరసీ యాక్ట్‌ (సోపా) చట్టంపై, భారతదేశంలో ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి ఇంటర్నెట్‌ సంస్థలపై వివాదం నెలకొంది. ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విధించేందుకు సోపా లేదా పిపా దోహదం చేస్తోంది. ఈ చట్టం వల్ల ప్రజలు తమ ప్రోగ్రామ్స్‌ను ఒకరికొకరు పంచుకోవడానికి వీలులేదు. సమాచారాన్ని సెన్సార్‌ చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలొస్తే ఆ సైట్‌ను షట్‌డౌన్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఈ చట్టం కల్పిస్తుంది. అయితే ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి భారతదేశంలో నెలకొంది. ఇక్కడ సెన్సార్‌షిప్‌ను అమెరికాలో మాదిరిగా కాకుండా పరోక్షంగా ప్రవేశపెడతారు. సెన్సార్‌షిప్‌ నియంతృత్వానికి నిదర్శనం కాగా ఆలోచనలను సెన్సార్‌ చేయడం మరింత దారుణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నియంతృత్వ థృక్పథాన్ని పెంపొందించు కుంటున్నాయి. ఇంటర్నెట్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థలు నియంతృత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకుముందు ఇవే సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాతలను తొలగించే విషయంలో దాంతో చేతులు కలిపి వ్యవహరించాయి. వినియోగదారుల ప్రైవసీని కాపాడడంలో కూడా అంత మంచి రికార్డు కలిగి లేవు. నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో వారికి చిత్తశుద్ధి ఉందా, లేదా అనే విషయం ఇక్కడ అప్రస్తుతం. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పట్ల స్టాల్మన్‌ సుముఖత ప్రదర్శించ లేదు. తమకు ప్రైవసీ ఉందని ప్రజలు భావించడాన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రోత్సహించకూడదు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో ఉంచిన సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. దానిని చదివే లేదా ప్రచురించే అవకాశం ఇతరులకు కల్పించాలి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో అందరూ పాల్గొనడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇతరులు తీసుకుని స్వతంత్రంగా ఉపయోగించుకోవడానికి ఇష్టం లేని అంశాలను చేర్చరాదని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో వినియోగదారులను తరచూ హెచ్చరిస్తుండాలి. నిఘా వేసేందుకు కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకునే హక్కు ఉంది. తాము ఇచ్చిన సమాచారాన్ని కొంతమంది సేకరిస్తున్నారనే అవగాహన కూడా లేకుండా ఆ సమాచారాన్ని ఉపయోగించుకునే హక్కును ఈ వ్యవస్థ కల్పిస్తుంది. ఫేస్‌బుక్‌లోనైతే ఫొటోలకు, వీడియోకు, ఫ్లాష్‌లకు కూడా అవకాశం ఉంటుంది. ఫేస్‌బుక్‌ను దుర్వినియోగపరిచేందుకు కూడా అవకాశం ఉంది. సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థ లేకుండా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. నెట్‌వర్కింగ్‌లో ఉండాల్సింది స్వేచ్ఛ కానీ పారదర్శకం కానే కాదు. అయితే ఇతర అంశాలతో పోలిస్తే పారదర్శకత అత్యంత చిన్న విషయం. మన కళ్లముందే ప్రభుత్వం చిత్రహింసలు పెట్టడం, ఎటువంటి విచారణ లేకుండా నిర్బంధించడం, ఏకపక్షంగా ప్రజలపై దాడులు చేయడం, యుద్థాలు చేస్తుండటం, దురాక్రమణకు పాల్పడటం వంటివి చేస్తుండటం గమనిస్తున్నాం.
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నేరాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు చేసే వారి పట్ల అత్యంత శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో మానవహక్కులను ప్రభుత్వాధికారులు కాలరాస్తున్నా అక్కడ మానవ హక్కుల కమిటీలు ఏమీ చేయలేని అశక్తతతో ఉన్నాయి. చిత్రహింసలు పెట్టేవారిని ఒబామా సమర్థిస్తారు. ఏమి జరుగుతోందో ప్రజలు తెలుసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అక్రమ ఫిర్యాదులు చేసే వ్యక్తులకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించే ఒక చట్టం ఇటీవల అమెరికా చేసింది. అల్‌ఖైదాతో సంబంధాలున్నట్లు ఏ వ్యక్తిపైనైనా ఫిర్యాదు చేస్తే చాలు ఆ వ్యక్తిని కనీసం విచారించకుండా జైలులో పెట్టే పరిస్థితి అమెరికాలో నెలకొంది. అమెరికాలో మానవ హక్కులు మృతప్రాయంగా ఉన్నాయి. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వ వైఖరి పూర్తిగా పక్షపాతంతో కూడి ఉంది. ఇటువంటి పరిస్థితిపై స్పష్టమైన ఉద్యమం తీసుకువచ్చేందుకు వాల్‌స్ట్రీట్‌ ప్రదర్శనలు దోహదం చేసినప్పటికీ ఫలితం ఉండబోదు. ఈ ఉద్యమాలను కూడా ఒబామా ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధాన్ని తీసుకువచ్చింది. ఉద్యమాల తీవ్రతను తగ్గించగలిగితే ప్రభుత్వం విజయం సాధించినట్లే. 
-prajasakt
Prajashakti News Paper Dated 3/3/2012 

No comments:

Post a Comment