Wednesday, March 14, 2012

రాజకీయాలు-మాఫియా---హరగోపాల్వారం రోజులుగా మధ్యవూపదేశ్ మాఫియా దురాగతాలను మీడియా రిపోర్టు చేస్తున్నది.వ్యాపారాలు దారితప్పి చట్టవ్యతిరేక ‘చీకటి లాభాల’ వేట లో పడ్డాయో, అక్కడి నుంచి మాఫియా పెరుగుతూ వచ్చింది. ఇప్పు డు పారిక్షిశామిక రంగంలో మాఫియా, గనుల మాఫియా, ఇసుక మాఫియా, కిరోసిన్ మాఫియా, సినిమా మాఫియా, లిక్కర్ మాఫియా, కేబుల్ ఆపరేటర్ మాఫి యా... ఇలా ఒక్క రంగమని కాదు, ఆర్థిక లావాదేవీలున్న ప్రతి రంగం ఏదో మేరకు మాఫియాను పోషిస్తున్నది. వీళ్లందరికి రాజపోషకులు రాజకీయ నాయకులు. నిజానికి రాజకీయ నాయకులకు, మాఫియాకు మధ్యగీత క్రమక్షికమంగా మారుతూ, వీళ్లే వాళ్లు, వాళ్లే వీరుగా రూపాంతరం చెందుతున్నారు. మన రాష్ట్రం లో కొందరు క్యాబినెట్ మినిస్టర్లు మాట్లాడుతున్న పద్ధతి, వాళ్ల ఆర్థిక సంబురాలు, హైదరాబాద్ నగరంలోని ల్యాండ్ మాఫియాకు హైదరాబాద్‌లోని రాజకీయ నాయకులకున్న సంబంధాలు సులభంగా గుర్తించవచ్చు. దీంట్లో పెద్దగా దాచుకోవడానికి రహస్యమంటూ ఏమీలేదు. బహుశా కొందరు రాజకీయ నాయకులను మనం మాఫియాలో భాగం అని అంటే లోలోపల సంతోషించే వాళ్లుంటారు. జనం భయపడడం వాళ్లకు ఇష్టం. ఇంత విశ్వరూపం దాలుస్తున్న లేదా చూపిస్తు న్న మాఫియా సామాజిక, ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయో కొంత చర్చించవలసిన అవసరం ఏర్పడింది.

మధ్యవూపదేశ్‌లో మాఫియా ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్‌ను దారుణంగా చంపిం ది. దాని తర్వాత వరుసగా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తున్నది. పోలీస్ ఆఫీసర్ హత్యమీద సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, తమ రాష్ట్రంలో మాఫియా లేదు అని ప్రకటించాడు. పత్రికల్లో మాఫియా దురాగతాల గురించి కోడై కూస్తుంటే, మాఫి యా లేదు అని ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆలోచించాలి. మధ్యవూపదేశ్‌లో మాఫి యా ‘కార్యక్షికమాల’ మీద విచారణ జరిపిస్తే వాళ్లకుండే ఆర్థిక మూలాలు, రాజకీయ సంబంధాలు మొత్తం బట్టబయలు అవుతాయన్నది భయం. అయితే ఇంత కాలం రాజకీయ ప్రత్యర్థుల్ని, ట్రేడ్ యూనియన్ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, ఉద్యమకారులను బెదిరిస్తూ, హింసిస్తూ ఉన్న మాఫియా నేరుగా రాజ్య యంత్రాంగం మీదే దాడి చేయడంతో పరిస్థితి చేయిదాటుతున్నట్టు పాలక వర్గాలు, పాలనా యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఉలికి పడింది. నిజానికి మాఫియాకు కొందరు పోలీసు అధికారులకుండే రహస్య సంబంధాలు ఆంధ్రవూపదేశ్‌లో అందరికి తెలుసు. దీనిమీద కొంత చర్చ కూడా జరిగింది. వాళ్ల సంబంధాలు పూర్తిగా బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా కూడా ఈ సంబంధాలను పూర్తిగా బట్టబయలు చేయడానికి కొంత జంకుతున్నది. మీడియాలో నిజాయితీగా రాసే వాళ్లకు ఎప్పుడూ కొన్ని భయపెట్టే ఫోన్లు వస్తూనే ఉంటాయి. రాజకీయాలకు, మాఫియాకు, పోలీసు యంత్రాగానికి, కొంత వరకు మీడియాకు ‘సత్సంబంధాలు’ ఉన్నవన్నది కూడా ఒక వాస్తవమే.

మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమ అణచివేత పేర ఒక భయంకరమైన మాఫియాను పెంచిపోషించారు. ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ఒక పద్ధతి ప్రకారం రాజ్యమే ప్రోత్సహించింది. దీనికి పరాకాష్ట ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం రూపంలో దర్శనమిచ్చింది. ఒక చట్టవ్యతిరేక ముఠా ను రాజ్యం పోషించడాన్ని సుప్రీంకోర్టు తప్పుగా పరిగణించడమేకాక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఈ ముఠాను రద్దుచేయవలసిందిగా ఆజ్ఞాపించింది. దీంతో ఏం చేయాలో తోచక వీళ్లందరిని పోలీసు యంత్రాంగంలోకి రిక్రూట్ చేసుకున్నారు. అంటే సల్వాజుడుంకు, పోలీసులకు తేడా లేదు! ఒక చట్టవ్యతిరేక ముఠాను చట్టబద్ధ పోలీసులోకి తీసుకువచ్చి, అంటే సల్వాజుడుం సంస్కృతి, పోలీసు సంస్కృతి ఒక్కటే అని అంటే ప్రభుత్వం చెప్పే జవాబు ఏమిటి?

ఛత్తీస్‌గఢ్‌లో మాఫియా చాలా కాలంగా పనిచేస్తున్నది. విపరీతమైన ఖనిజ సంపద, కొంత పారిక్షిశామికీకరణ జరిగిన గిరిజన ప్రాంతాలలో, అభివృద్ధితో ప్రయోజనం పొందడం అటుంచి, తమ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినప్పుడు గిరిజనులు, పారిక్షిశామికరంగంలోని కార్మికుల మధ్య ఒక పోరాట సంబంధం ఏర్పడడంతో ఒకవైపు పారిక్షిశామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు మరొకవైపు రాజకీయనాయకులు, పాలనాయంవూతాంగం ఉద్యమాలను అణిచే క్రమంలో మాఫియా చాలా బలపడింది. శంకర్ గుహ నియోగి లాంటి అద్భుతమైన ఒక శ్రామిక నాయకుడిని మాఫియా చేత చంపించారు. నియోగి మరణించినప్పుడే దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ప్రతిఘటించి, మాఫియాను అరికట్టలేకపోయింది. నిజానికి మాఫియా ఎదుగుదల వాటి రాజకీయ పాత్రకు జాతీయస్థాయిలో సంజయ్‌గాంధీ మొట్టమొదట ప్రాతినిధ్యం వహించాడని ఆ కాలంలోనే చర్చ జరిగింది. సంజయ్‌గాంధీ ప్రమాదంలో మరణించినప్పుడు అరుణ్‌శౌరీ సంజయ్‌గాంధీని సమాజం శిక్షించే ఒక అవకాశాన్ని కోల్పోయింది అని ఒక వ్యాసం రాశాడు. 

మాఫియా పాత్ర నూతన ఆర్థిక విధానం ‘అభివృద్ధి’ చెందిన క్రమంలో సమాంతరంగా పెరుగుతూ వచ్చింది. సంపద సృష్టిలో శ్రామికుల పాత్ర గుర్తించకుండా, రాజ్యం తన పాత్ర నుంచి తప్పుకుని మార్కెట్ శక్తులను దేశం మీద వదలడంతో వాళ్ల దురాగతాలకు హద్దులులేని ఒక పరిస్థితి దేశంలో ఉంది. నూతన ఆర్థిక విధా నం ఒక రకంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలోని పారిక్షిశామిక చట్టాలకు, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం. దేశంలోని చాలా చట్టాలు ఈ అభివృద్ధిని అంగీకరించవు. భారత ప్రభుత్వం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు చట్టబద్ధత కాని, కనీసం పార్లమెంటు అనుమతి కాని లేవు. ఈ ఒడంబడికలు పార్లమెంటులో చాలా వరకు చర్చకు రావు. కాని వాటి దుష్ప్రభావం సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాం స్కృతిక రంగాల మీద చూడవచ్చు. ఇది మొత్తం దేశ ‘అభివృద్ధి’ దిశను మార్చేసింది. రాజ్యాంగం దేశ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని విధ్వంసం చేసింది. రాజ్యాంగానికి, దేశ చట్టాలకు అతీతంగా వచ్చిన పెట్టుబడికి చట్టవ్యతిరేక ముఠాల అగత్యం ఏర్పడింది. అందుకే ఎక్కడ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతున్నదని అంటున్నారో, ఎక్కడ దేశ వనరులు ఉన్నాయో ఆ ప్రాంతంలో పెట్టుబడి ఉంది. దానినంటుకొని మాఫియా ఉంది.

మన రాష్ట్రంలో రోశయ్య కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఒక టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నప్పుడు మీరు పాత కాలపు మనుషులు, రాష్ట్రంలో మాఫి యా రాజకీయాలు బాగా పుంజుకున్నాయి, మీరు వాళ్లను ఎలా అదుపు చేస్తారు అని అడిగినపుడు, ఈ మాఫియా రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని, దాన్ని ఒక్కరోజులో నియంవూతించలేమని, తనకు సరైన సమయంలో అవకాశం వస్తే నియంవూతించడానికి ప్రయత్నిస్తానంటూ, అయినా మన రాష్ట్రం బీహార్ కంటే కొంచెం మెరుగుకదా అని అన్నాడు. హైదరాబాద్ చుట్టూ విపరీతమైన ల్యాండ్ మాఫియా ఉంది. ఉప్పల్ నుంచి భువనగిరి దాకా ఏ భూమి అమ్మకం, కొనడం మాఫియా ప్రమేయం లేకుండా జరగడం లేదు. వాళ్లు ప్రైవేట్ సైన్యాలను ఏర్పరుచుకున్నారు. మర్డర్స్ చాలా సునాయసంగా చేయగలరు. దీనికి పోలీసు యంత్రాంగంలో కొందరి పెద్దల మద్దతున్నది.

తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం మీద కేంద్రీకరించడం వల్ల చాలా సమస్యలను వెనక్కి నెట్టింది. ఉద్యమాలకుండే శక్తి అపరిమితమైంది. సమాజంలో వచ్చిన అన్ని వక్రీకరణలను సరిచేయగల శక్తి ఉంటుంది. ఎందుకో ఉద్యమం వీటి ని విస్మరించింది. అంతేకాదు ఉద్యమం లోపల కొన్ని ఈ ధోరణులున్నాయన్న విమర్శ ఉంది. మాఫియాను నియంవూతించే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ల నామరూపాలు లేకుండా చేయడానికి ఉద్యమం నిరంతరంగా శ్రమించవలసి ఉంది.

పొఫెసర్ హరగోపా
Namasete Telangana News Paper Dated : 15/03/2012 

No comments:

Post a Comment