Friday, March 9, 2012

ఉద్యమ ఉపాధ్యాయిని---జూపాక సుభద్రకుల వ్యవస్థలో మానవహక్కులు కోల్పోయి శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 14లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి, వారికి చదువు చెప్పిన మొదటి ఉపాధ్యాయిని సావివూతిబాయి పూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం శ్రమించింది. బ్రహ్మణాధిక్య హిందూ సమాజంపై తిరుగుబాటు చేశారు ఆమె. జ్యోతిరావు పూలే తో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి సామాజిక న్యాయంకోసం కృషిచేసిన సంఘ సంస్కర్త సావివూతిబాయి పూలే. ఆమె మంచి టీచరని, గొప్ప సామాజిక సేవకురాల ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. కానీ ఆమె సేవను గుర్తించడానికి బ్రాహ్మణాధిపత్య దేశానికి శతాబ్దంన్నర కాలం బట్టింది. ఆమె పేరుమీద ఒక స్టాంపు వేసి చేతులు దులుపుకున్నది. కులసంఘాల రాజకీయ చైతన్యాల ఒత్తిడి తో ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఇటీవలనే పూలే జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని జరపడానికి నిర్ణయించింది.కాని సావివూతిబాయి పూలే జయంతి, వర్ధంతి ఉత్సవాలను మరిచింది. 

ఆధునిక భారతదేశానికి మొదటి టీచర్, సంఘసంస్కర్త సావివూతిబాయి పూలే ‘మాలి’ అనే బీసీ కులస్తురాలు. ఆమె 1931 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఖండా లా ప్రాంతంలోగల నాయగావ్‌లో పుట్టింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజి. సావివూతిబాయి వంటకో, ఇంటికో పరిమితమైన కులంనుంచి రాలేదు. పనిపాటల శ్రమజీవనంలో బతికే కులం నుంచి వచ్చింది. సావివూతిబాయి జ్యోతి బా పూలే ఇంటికి తొమ్మిదేళ్లకే అతని భార్యగా అడుగుపెట్టింది. అప్పట్నించి జీవితాంతం సామాజిక ఉద్య మ కార్యకర్తగా కొనసాగింది. జోతిబాపూలే మరణానంతరం కూడా సత్యశోధక సమాజాన్ని ముందుకు నడిపిన ఉద్యమకారిణి. జోతిబాపూలే చేసిన అన్ని సామాజిక ఉద్యమాల్లో సావివూతిబాయి ప్రధాన భాగస్వామి.పూలే తాను చదివిన చదువును, చైతన్యాన్ని, చదివిన ప్రతి పుస్తకాన్ని సావివూతిబాయికి పంచేవాడు. అట్లా పంచుకున్న వాటిలో.. థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ అనే పుస్తకం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ పుస్తకమే ఆమెను మనిషి హక్కులు, స్వేచ్ఛా స్వాతంవూత్యాలవైపు నడిపించిం ది. అలుకునీళ్లు మీద పోసినా అవమానాలన్నింటిని భరించి మహిళలకు, నిమ్న జాతులకు చదువు చెప్పింది సావివూతిబాయి. దళిత కులాల మహిళలమీద జరుగుతున్న అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా సావివూతిబాయి పోరాడింది. సతి, వితంతు, వైధవ్యం వంటి అగ్రవర్ణాల మహిళల సమస్యల పట్ల కూడా సావివూతిబాయి వ్యతిరేకం గా పోరాడింది. సావివూతిబాయి పూలే సంస్కరణోద్యమాలు తన జాతి వరకే పరిమితం కాకుండా సమాజంలోని బాధితులందరి పట్ల సేవాదృక్పథం కనబరిచింది. ఆమె ఈ విశాల దృక్పథానికి చరిత్ర ఏ గుర్తింపునివ్వలేదు. బ్రాహ్మణాధిపత్య భారత జాతి కావాలనే సావివూతిబాయి చరివూతను మరుగు పరిచింది. 

శూద్ర, అతిశూద్ర కులాల గురించి పట్టించుకున్న జ్యోతి బా పూలే, సావివూతిబాయి గురించి బ్రాహ్మణాధిక్య సమా జం మరుగున పడేయడమే కాదు, మేధావులు, కమ్యూనిస్టులతో సహా ఫెమినిస్టులుగా చెప్పుకుంటున్న వారు కూడా సావివూతిబాయి చరివూతను వెలుగులోకి తీసుకురాలేదు. నిజానికి ఈ ముసుగులో నాయకత్వం చెలాయిస్తున్న వారం తా బ్రాహ్మణ ఆధిపత్య కులాల వారే. కాబట్టి తమ జాతి వెలుగు దీపాలైన జ్యోతిబాయి పూలే లాంటి వారి చరివూతల ను దళితులే వెలుగులోకి తెచ్చారు.
సావివూతిబాయి సామాజిక ఉద్యమ నాయకురాలే కాదు, ఆమె గొప్ప రచయిత్రి. సావిత్రి బాయి గొప్ప ఆచరణవాది. సమాజ ఆమోదంలేని సంతుని దత్తత తీసుకుని సమాలించింది. 190లో తన భర్త జ్యోతిబా పూలే మరణిస్తే సమాజరీతికి భిన్నంగా, నియమాలన్నింటిని ధిక్కరించి తనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన పేరట్లో బావిని తవ్వించి అంటరాని వాళ్లకు నీటి కొరత తీర్చింది. ఇలా నిరంతరం సమాజ సేవలో మునిగి ఉంటూ.., ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తూ.. తాను కూడా ప్లేగు వ్యాధి బారిన పడి197 మార్చి 10న మరణించారు. దేశంలో సర్వజనుల హక్కుల కోసం, ముఖ్యంగా దళిత స్త్రీల హక్కు ల కోసం పోరాడిన, మొదటి మహిళా టీచర్‌గా ప్రభుత్వం గుర్తించాలి. సావివూతిబాయి పూలే జన్మదినం జనవరి 3ను భారత జాతీయ మహిళాదినంగా ప్రకటించాలి. కొత్తగా ఏర్పాటు చేసే యూనివర్సిటీలకు సావివూతిబాయి పూలే పేరు పెట్టాలి. స్ఫూర్తివూపదమైన ఆమె జీవిత చరివూతను పాఠ్యాంశంగా చేర్చాలి.

-జూపాక సుభద్ర 
(నేడు సావివూతిబాయి పూలే 115వ వర్ధంతి)

Namasete Telangana News Paper Dated : 10/03/2012 

No comments:

Post a Comment