Wednesday, March 7, 2012

మాటల్లోనే మహిళా హక్కులు---డేవిడ్
పత్రికలు తిరగేస్తే ఏదో ఒక రూపంలో స్త్రీల మీద హింస జరగని రోజు కనిపించదు. నేషనల్ కైమ్ రికార్డ్స్ బ్యూరో 2010లో మహిళలకు సంబంధించి 2,0, 61 నేరాలు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే చాలా నేరాలు నమోదు కావడం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే అత్యధిక నేరాలు నాలుగుగోడల మధ్య జరుగుతుంటాయి. స్త్రీలకు ఈ నేరాలను తమలో తాము దిగమింగుకోవడం తప్పా వేరే మార్గం ఉండదు మహిళలపై జరుగుతున్న నేరాలలో అత్యధికం నగరాలలోనే జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సగటున ప్రతి 1 గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతుంది. ఢిల్లీ తర్వాత మహిళల వేధింపులు, అత్యాచారాల్లో ఆంధ్రవూపదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరవూపదేశ్ రాష్ట్రాలు ముందు వరుసల్లో నిలుస్తున్నాయి. 


గత ఏడాది ఆంధ్రవూపదేశ్‌లో మహిళలపై 27 వేల 244 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇటీవల స్త్రీలు, యువతులు ధరించే దుస్తులపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి రాష్ట్ర డీజీపీ పెద్ద దుమారం లేపారు. పల్లెల్లో కూడా యువతులు, స్త్రీలు మోడ్రన్ దుస్తులు ధరిస్తున్నారని, ఈ వస్త్రాలే అత్యాచారాలకు కారణమవుతున్నాయని వ్యాఖ్యానించి డీజీపీ తన దృష్టి లోపా న్ని చాటుకున్నాడు. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి పండు ముసలి మహిళలు సైతం అత్యాచారానికి గురికావడానికి ఎలాంటి వస్త్ర ధారణ కారణమో డీజీపీ సెలవివ్వాలి. నేడు సమాజంలో కులం, మతం, వర్గాల పేరుతోనో అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. మత కలహాలు జరిగినప్పుడై తే మైనారిటీ మతస్తుల స్త్రీల, పిల్లల మీద, కులపోరాటాలు జరిగినప్పుడు తక్కువ కులాల స్త్రీల, పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. బీహార్ లాంటి చోట్ల ఘర్షణలు జరిగినప్పుడలా దళిత, ఆదివాసీ మహిళలు అనేక విధాలుగా అన్యాయాలకు గురవుతున్నారు. 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామం కరద్‌లోని ముల్‌గావ్‌లో ఒక అగ్రకుల కుటుంబానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుల వ్యవస్థతో, భూస్వామ్యభావజాలంతో నిండిపోయిన తమ గ్రామస్తులు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన ఆ యువతి యువకుడు ఊరు విడిచి పారిపోయా రు. తమ కూతురు దళిత యువకునితో లేచిపోవడం అగ్రకుల కుటుంబాలకు అవమానంగా తోచింది. ఆ గ్రామస్థులు, కుటుంబసభ్యులు, బంధువులు దళిత యువకుడి ఇంటికి వెళ్ళి అతని తల్లిని ఇంటినుంచి బైటికి లాగి విపరీతంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు.ఒక దళితులు అగ్రకుల యువతిని ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అసలే తప్పు కాదు. దీనికి యువకుడి తల్లిని వివస్త్రను చేసి ఊరేగించడం చూస్తే అగ్రకుల పురుషాధిపత్య దురంకారం భారత దేశంలో ఎంతగా వేళ్ళూనుకుందో మరోసారి రుజువయ్యింది. అణగారిన వర్గాలలో పెరుగుతున్న చైతన్యం, ఆత్మగౌరవాలను దెబ్బతీయడానికి వారి స్త్రీల మీద జరుగుతున్న దాడులు ఒక ఎత్తయితే, అత్యాచారాలకు సంబంధించి జనంలో ఉన్న సాధారణ అభివూపాయాలు మరింత దారుణంగా ఉంటున్నాయి. రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని భావిస్తారు. కానీ కోర్టులు కూడా ఈ విధంగానే భావించటం చూస్తే స్త్రీకి ఎంత న్యాయం జరుగుతుందో అర్థమవుతున్నది. 
వరకట్న హత్యల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కట్నం కోసం మనసును, శరీరాన్ని కూడా చిత్రవధ చేయడం దేశమంతా కనిపిస్తుంది. గత సంవత్సరం మన రాష్ట్రంలో 1200 గృహహింసలు, 5 వరకట్న మరణాలు నమోదయ్యాయి.2002లో 103 వరకట్న కేసులు రాష్ట్రంలో నమోదు కాగా 2011కు వచ్చేసరికి ఆ సంఖ్య 5 కు పెరిగింది. చండీగఢ్‌కు చెందిన ఒక సంస్థ చేసిన పరిశోధన ప్రకా రం దేశ వ్యాప్తంగా ప్రతి 250 గృహహింసకు సంబంధించిన సంఘటనలలో ఒక్క కేసు మాత్రమే రిపోర్టవుతున్నది. మహిళలను మానసికంగా శారీరకంగా హింసించడం అన్ని నేరాలలోకెల్లా ఎక్కువగా జరుగుతున్నది. 1995లో గృహ సంబంధ హింసా కేసులు 31, 127 నమోదు కాగా, 2011కు వచ్చేసరికి ఆ సంఖ్య 94, 041 కు చేరింది. చాలా సందర్భాలలో మహిళలు ఇంట్లో సర్దుకుపోతుంటారు. నాలుగుగోడల మధ్య జరిగే సంఘటనలను చాలావరకు మహిళలు దిగమింగుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులున్నాయంటున్న మన రాజ్యాం గం, వరకట్న వ్యతిరేక చట్టం, గృహహింస చట్టం, మొదలైన శాసనాలు కానీ మహిళలను పవివూతంగా చూడాలనే హైందవ సంస్కృతి కానీ మహిళలను రక్షించలేక పోతున్నాయి. మహిళ హక్కులను కాపాడి వారికి భద్రతను కల్పించలేకపోతున్నాయి.

-డేవిడ్
రీసెర్చ్ స్కాలర్,ఉస్మానియా యూనివర్సిటి 
నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ dated 08 /03 /2012 

No comments:

Post a Comment