Friday, September 9, 2011

బలిదానాలకు సర్కారుదే బాధ్యత by పొ. శ్రీధరస్వామి Andhra Jyothi 10/09/2011

బలిదానాలకు సర్కారుదే బాధ్యత
సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నిరోధక దినం. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్యల నిరోధానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ విస్తృత ప్రచారం చేస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న ఆత్మహత్యలను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను, అవగాహనను కల్పిస్తున్నారు. ఏ చర్యలు తీసుకుంటే.. ఆత్మహత్యలను అడ్డుకోవచ్చో.. ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. 2011ను ఆత్మహత్యల నిరోధక సంవత్సరంగా పాటిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్యా వివరాలపై సరై న లెక్కలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వూపకారం ప్రతి సంవత్సరం పదిలక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా దేశాలలో విభిన్న జాతు లు, మైనారిటీ తెగల్లో జరుగుతున్న ఆత్మహత్యల పట్ల ఏ విధమైన లెక్కలు లేవు. ఈ ఆధునిక అభివృద్ధి చెం దిన ప్రపంచంలో.. ప్రతిరో జూ మూడువేల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
world-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇంకా భయం గొల్పే విషయం ఏమంటే.. ఆత్మహత్యాయత్నం చేస్తు న్న ప్రతి 20 మందిలో ఒక రు చనిపోతేనే ఇంత మంది చనిపోతున్నారు. ఇటీవలి ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా.. ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితిని నివారించడానికి అంతర్జాతీయ ఆత్మహత్యల నిరోధక సంఘం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా ఆత్మహత్యల నివారణకు నడుం బిగించా యి. ప్రపంచవ్యాప్తంగా.. ఆత్మహత్యలను అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కార్యక్షికమాలను రూపొందించాయి. ఆత్మహత్యలకు మానసిక రుగ్మతలు, డిప్రెషన్ ప్రధాన కారణాలుగా ఉన్నాయని గుర్తించాయి. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో సామాజిక పరిస్థితులు కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. సకాలంలో.. సరియైన తోడ్పాటు, కౌన్సిలింగ్ అందించిటె్లైతే.. అధిక శాతం ఆత్మహత్యలను ఆపగలమని అభివూపాయపడుతున్నారు.

భారతదేశం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆత్మహత్యలకు సామాజిక పరిస్థితులే ప్రధానకారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభమేనని అనే క అధ్యయనాలు తెలిపాయి. రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం, రుణసౌక ర్యం అందక ప్రైవేటు రుణాలు తీసుకుని అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఒత్తిడి, మైక్రో ఫైనాన్స్‌ల వేధింపుల కారణంగా రైతులు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2010 క్రైమ్ రిపోర్టు ప్రకారం ఆంధ్రవూపదేశ్‌లో ప్రతిరోజు 43 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో ప్రతిరోజు మూడు హైదరాబాదులోనే చోటుచేసుకుంటున్నాయి. 2010లో ఏప్రిల్ -జూన్ నెల మధ్యకాలంలో.. 52 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా.. తాము చదువుతున్న కార్పొరేట్ కాళాశాలల ఒత్తిడి మూలంగానే చనిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో 90 శాతం ఆత్మహత్యలను సరియైన తోడ్పాటు, కౌన్సిలింగ్ ఇచ్చినటె్లైతే నివారించవచ్చని తెల్పిం ది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ప్రత్యేక రాష్టం కోసం జరుగుతున్న ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష నేపథ్యంలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి.ఆత్మహత్యల నివారణకు మేధావు లు, తెలంగాణ వాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. విద్యార్థుల్లో ఉన్న తీవ్రమై న ఆకాంక్ష, సమైక్య రాష్ట్రం లో భవిష్యత్తుపై అభవూదతతో విద్యార్థు లు తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నా రు. వీటికి తోడు సీమాంధ్ర మీడియా, సీమాంవూధనేతల తీరు కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మరోవైపు దశాబ్ద కాలంగా విద్యార్థులు పోరాటం చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు విద్యార్థుల తీవ్ర నిరాశా నిస్పృహలకు దారితీస్తోంది. ఈ కారణంగా తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ విద్యార్థుల చావుకు పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మేధావులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటిదాకా 700 పైగా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే..ఇక్కడి సీమాంధ్ర మీడియాతో పాటు, అంతర్జాతీయ మీడియా కూడా వివక్ష పాటిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇప్పటి దాకా రెండు ఆత్మహత్యలనే గుర్తించింది. ఒకటి డిగ్రీ విద్యార్థి సవేరా కాగా, మరొకరు వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న సునీల్‌కుమార్ అనే జర్నలిస్టుది. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే మీడియా తీరు మారాలి. నేతలు తెలంగాణ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. విద్యార్థులకు తమ భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాలి. అలాగే బలవన్మరణాలు ఆగాలంటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో మార్గంలేదు. 
పొ. శ్రీధరస్వామి
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు
(నేడు ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం)

No comments:

Post a Comment