Thursday, September 22, 2011

అణచివేస్తే తిప్పికొడదాం! by -శ్రీరాముల శ్రీనివాస్ Namasethe Telangana 22/09/2011


9/22/2011 12:52:35 AM
అణచివేస్తే తిప్పికొడదాం!
సకల జనుల సమ్మెలో భాగంగా ముందువరుసలో నిలబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఉద్యుక్తులైన సింగరేణి కార్మికులకు, లాయర్లకు, ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, డాక్టర్లకు, ఉపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు, యువజనులకు విప్లవాభివందనాలు.
1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులు కాగా, 2009 నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల అవకాశవాద, సాచివేత, అణచివేత విధానాలతో, సీమాంధ్ర పెట్టుబడీదారుల పాచికలకు గురై వాయిదాలు వేయడం మూలంగా దాదాపు 700 మంది నిరాశా, నిస్పృహలతో ప్రాణాలు విడిచారు. వారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నిజం చేయాలి. అందుకోసం సకల జనుల సమ్మెను సార్వవూతిక సమ్మెగా మార్చి ప్రభుత్వ కార్యక్షికమాలను పూర్తిగా స్తంభింపచేయాలి. ఆర్థిక లావాదేవీలు, రోడ్లు, రైలు మార్గాలు ఏమీ పనిచేయకుండా చేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక అడుగు ముందుకేసినవారమవుతాం.

తెలంగాణ సబ్బండవర్గాలు ఏకమై పోరాడుతున్నారు. దీంతో బెంబేపూత్తిన రక్తమాంసాలులేని సీమాంధ్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తనను, తన సీమాంధ్ర దళారీ పెట్టుబడీదారులను రక్షించుకోవడానికి సమ్మెను నిరుత్సాపరిచి, నీరుగార్చే కుతంవూతాలకు పాల్పడుతున్నారు. దీనికి తెలంగాణ ద్రోహి దానం నాగేందర్ వంత పాడుతున్నాడు. నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేయానికి దాడి చేసి యుద్ధ గంట లు మోగించి విద్రోహానికి పాల్పడినట్టుగానే నేటికీ అదే తంతు కొనసాగిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తలను వరంగల్ పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు. దాన్ని పునరావృతం చేసేలా పోలీసు అధికారి తెలంగాణ కోసం పోరాడుతున్న విద్యార్థులను అమానవీయంగా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ, చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా ఎన్‌కౌంటర్ పేర కాల్చి చంపుతానని మాట్లాడడం అంతా శ్రీకృష్ణ కమిటీలోని ఎనిమిదవ చాప్టర్‌లో భాగమే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు అభివృద్ధి పేరుతో అటవీ భూము ను, వనరులను, గనులను, పీడిత ప్రజల భూములను సెజ్‌లకు, దేశీయ, విదేశీ పెట్టుబడీదారులకు బలవంతంగా అప్పజెప్పడం ద్వారానే ప్రజాపోరాటాలు ఉధృతమవుతున్నాయి. సింగూరు, నందిక్షిగాంల నుంచి సోంపే ట, పోస్కోల వరకు కొనసాగుతున్న పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు అమలవుతున్నాయి. దండకారణ్యంలో అడవి, భూమి, నీరును ఆదివాసులకు చెందకుండా, ఆదివాసుల మధ్య చీలికలు తెస్తూ ఒక తెగపై మరొక తెగ దాడి చేసేలా చేసి న వైనమే సల్వాజుడుం. మావోయిస్టుల అణచివేత పేరుతో సహజ సంపదను దళారీ పెట్టుబడీదారులకు అప్పజెప్పడానికే ఆపరేషన్ గ్రీన్‌హంట్-2 కొనసాగింపు మధ్య భారతంలోని అడవులు, వనరులను దోపిడీ వర్గాలకు అప్పనంగా అప్పజెప్పడంలో భాగంగానే జరుగుతున్నది. ఈ విధంగా అడవుల తరుగుదల, వనరుల తవ్వకాలు, భూమి కోతలు, పర్యావరణ సమస్యే గాక జీవన్మరణ సమస్యగా మారుతున్నది.

సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించడమే ప్రజాపోరాటాలకు ప్రాణం పోస్తున్నది. ఈ విషయం గుర్తించకుండా చిదంబరం మావోయిస్టులే అత్యంత ప్రమాదకరమని తమ తప్పులను వెనకేసుకొస్తున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ నుంచి సీమాంధ్ర దళారీ పెట్టుబడీదారులైన లగడపాటి, రాయపాటి, కావూరిల గుంపు వరకు అంతా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో మావోయిస్టులు ఉండి తెలంగాణ ఉద్యమా న్ని నడిపిస్తున్నారని విష ప్రచారానికి పూనుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల ప్రజాస్వామిక డిమాండ్. 1969 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం సాగుతున్నది. నేడు చట్టబద్ధంగా జరుగుతున్న తెలంగాణ సాధన పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఇస్తున్నది. స్వావలంబన, శాంతి, అభివృద్ధికి అనుగుణంగా ప్రజాస్వామిక డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నది. అంతేతప్ప దండకారణ్యం, బీహార్-జార్ఖండ్‌లను విముక్తి చేయడానికి, ప్రాంతాల వారీగా విముక్తి చేయడానికి సాయుధ పోరాటం మార్గం ఎంచుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాయుధ పోరాటం చేయాలనడం లేదు. సమరశీల ప్రజా పోరాటాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం. నేడు జరుగుతున్న సకల జనుల సమ్మె పల్లె నుంచి పట్టణాల వరకు సమరశీల పోరాటాలను చేస్తూ సార్వవూతిక సమ్మెగా మార్చాలని సకల జనులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇప్పుడు జరుగుతున్న సకల జనుల సమ్మెను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా పరిష్కరించాలి. అంతే తప్ప అణచివేతకు పూనుకుంటే తెలంగాణ ప్రజలు తగు రీతిలో బుద్ధిచెబుతారు. అణచివేత తిరుగుబాటుకు దారితీస్తుంది. తెలంగాణ ద్రోహులను వెలివేయాలి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా, ఊగిసలాటతో ఉండి అంతిమంగా సీమాంధ్ర పెట్టుబడీదారుల ప్రయోజనాలు నెరవేరుస్తున్న తెలంగాణ కాంగ్రెస్, టీడీపీల నేతలను ద్రోహులుగా చాటి చెప్పాలి.
-శ్రీరాముల శ్రీనివాస్
మావోయిస్టు రాజకీయ ఖై

No comments:

Post a Comment