Wednesday, September 14, 2011

హకుల పరిరక్షణ కోర్టుల బాద్యత by -మంగారి రాజేందర్ Namasethe Telangna 15/09/2011


9/14/2011 11:16:30 PM
హకుల పరిరక్షణ కోర్టుల బాద్యత
కోర్టుల్లో పనిభారం ఎక్కువ. విచారణ జాప్యం. కేసుల్లో శిక్షలు పడకపోవడం. ముద్దాయిలు శిక్షల నుంచి తప్పించుకుపోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది న్యాయవ్యవస్థను నిందించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఆ విమర్శలో ఎలాంటి సహేతుకతలేదు. కోర్టుల్లో కేసులు రుజువు కాకపోవడానికి, తక్కువ కేసుల్లో శిక్షలు పడటానికి, కేసుల విచారణల్లో జాప్యం జరగడానికి కారణాలు ఎన్నో. కేసుల దర్యాప్తులోని లోపాలు, ప్రాసిక్యూషన్ కేసుని సరిగ్గా నిర్వహించకపోవడం, సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం లాంటి కారణాలు ఎన్నో కోర్టుల్లో కేసులు విఫ లం కావడానికి కారణమతున్నాయి.
court-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతమ పరిధిలో ఉన్న అంశాల మీద న్యాయమూర్తుల నిర్వహణని బేరీజు వేసుకొని విమర్శలు చేస్తే దాన్ని సద్విమర్శ అనుకోవచ్చు. ఆ విధంగా గాకుండా కోర్టు నియంవూతణలోలేని అంశాలను ఆధారం చేసుకొని న్యాయమూర్తులని, న్యాయవ్యవస్థని విమర్శించడం సరైంది కాదు. దేశ న్యాయవ్యవస్థలో భాగస్వాములైన యంత్రాంగాల సమష్టి నిర్వహణే కేసుల్లో వచ్చే చిక్కులు. అవి శిక్షలు పడ డం కావచ్చు. శిక్షలు పడకపోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే ఉన్న విధులు ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కొన్ని విధులను న్యాయమూర్తులు మాత్రమే నిర్వహిస్తారు. అవి న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే వుంటాయి. అందులో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని ఇతర భాగస్వాముల ప్రమే యం ఉండదు. అందులో ముఖ్యమైనది హక్కుల పరిరక్షణ. అవి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులు కావ చ్చు. ఇతర శాసనాల ద్వారా నిర్వహించిన హక్కులు కావచ్చు.

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు, నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. అప్పు డు ఎలాంటి అవరోధాలు లేవు. వాళ్లకు తోచింది చేసే అవకాశం ఉండేది. అనుమానం మీద నేరారోపణల మీద శిక్షలు విధించే అవకాశం ఏర్పడింది. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండాపోయింది. నిరంకుశత్వం పెరిగింది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215 సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ‘ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా తన వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్షులు లేకుండా ఏ అధికారి కూడా ఏ వ్యక్తిని భవిష్యత్తులో విచారణకు నిలబెట్టకూడదు. ఎవరి స్వేచ్ఛనైనా హరించాలంటే దానికి న్యాయబద్ధమైన తీర్పు ఉండాలి.’
మాగ్నాకార్టాలో పొందుపరిచిన విషయాలకు మన రాజ్యాంగ కర్తలు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయాలను పొందుపరుస్తూ అధికరణలను ఏర్పాటు చేశారు.

అవి అధికరణం 20, 21, 22. అధికర ణం 20 ప్రకారం అమలులో ఉన్న శాసనాల ప్రకారం ఏదైనా చర్య నేరమైనప్పుడు మాత్రమే ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. అంతే అది నేరం కానప్పుడు శిక్షించడానికి వీల్లేదు. ఆ నేరం చేసినప్పుడు, ఆ వ్యక్తికి అమల్లో ఉన్న శాసనాల ప్రకారం ఎంత శిక్ష అయితే విధించడానికి అవకా శం ఉందో అంతే శిక్షను విధించాలి. అంతకన్నా ఎక్కువ శిక్షను విధించడానికి వీల్లేదు. ఎవరైనా వ్యక్తిపై అభియోగం మోపబడి శిక్ష పడిన తర్వాత మళ్లీ అదే నేరానికి రెండవసారి అభియోగం దాఖలు చేయడానికి వీళ్లేదు. ఆర్టికల్ 21 శాసనం ప్రకారం నిర్ణయించిన పద్ధతుల్లో తప్ప, ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 22 ప్రకారం-ఎవరైనా వ్యక్తి ఈ భూభాగంలోని సాధారణ శాసనాల ప్రకారం అరెస్టు అయినప్పుడు అరెస్టు చేసిన వెంటనే ఏ కారణాల ప్రకారం అరెస్టు చేశారో ఆ విషయం అతనికి తెలియజెయ్యాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం కల్పించాలి.

అరెస్టు చేసిన 24 గంటల్లో దగ్గర్లో ఉన్న మెజివూస్టేట్ ముందు హాజరు పరచాలి. అరెస్టు అయిన స్థలం నుంచి మేజివూస్టే ట్ కోర్టు వరకు తీసుకురావడానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటలని అర్థం చేసుకోవాలి. మేజివూస్టేట్ ఉత్తర్వులు లేకుండా అరెసై్టన వ్యక్తి 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు.
దేశంలో ఆమాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వతంవూతమైన న్యాయవ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధం లేకుండా న్యాయవ్యవస్థ వుంది. ఈ వ్యవస్థ దేశ పౌరులకు, ముద్దాయిలకు, అనుమానితులకు, బాధితుల కు, సాక్షులకు రాజ్యాంగం ద్వారా వివిధ శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల హక్కులకు సంరక్షకునిగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అందుకే ఈ వ్యవస్థ మీద అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉంది. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. హక్కులను కాపాడటం కోర్టుల మీద ఉన్న ప్రాథమిక బాధ్యత. హక్కులను, బాధ్యతలను కోర్టులు భారతీయ సాక్ష్యాధారాలు చట్టం ప్రకారం నిర్ధారించాలి. రాజ్యాంగం ద్వారా, శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేసిన శాసనం ద్వారానే నియంవూతించాల్సి ఉంటుంది. తొలగించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తుల మౌలికమైన హక్కు. స్వతంవూతమైన న్యాయవ్యవస్థ నిర్వహించాల్సిన విధి ఇదే.

వ్యక్తుల హక్కులను కాపాడటం, శాసనం నిర్దేశించిన పద్ధతిలో శిక్షలు విధించడం ద్వారా ప్రజల హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ చేయాల్సిన ప్రాథమికమైన విధి. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాత పూర్వకమైన రాజ్యాంగం ఉన్న మన దేశంలో నేరస్తులను శిక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. నేరం చేసిన వ్యక్తులని శిక్షించడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత కాదు. పోలీసులది అంత కంటే కాదు. రాజ్యాంగం రాక ముందు కొన్ని శతాబ్దాలుగా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ పని చేసింది. ఇప్పుడు చేయకూడదు. చేసే అవకాశం లేదు. చేయకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తిపై ఉంది. ముద్దాయిలను అరెస్టు చేసి మేజివూస్టేట్ మందు హాజరు పరుస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్ష న్ 57 ప్రకారం 24 గంటలు పూర య్యే వరకు ముద్దాయిలను తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవకా శం లేదు. కేసు దర్యాప్తుకు ఎంత కాలం అవసరం ఉందో అంత కాలం మాత్రమే తమ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది. అది కనిష్ఠ కాలపరిమితి.

24 గంటలు అనేది గరిష్ఠ కాలపరిమితి. అదే చట్టంలోని సెక్షన్ 50 ఎ ప్రకారం అరెస్టు చేసిన సమయాన్ని అరెసై్టయిన వ్యక్తి స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలి. ఏడేళ్లకు తక్కువ శిక్ష విధించే అవకాశం కేసుల్లో, అదే విధంగా ఏడేళ్లవరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో సెక్షన్ 41లో చేర్చిన కొత్త నిబంధనల ప్రకారం అరెస్టు చేయకూడదు. అరె స్టు చేస్తే వాటి చట్టంలో చెప్పిన కారణాలు వున్నాయో లేదో చూడా లి. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే, అదృశ్యం అయితే దానికి గురించి సెక్షన్ 176 ప్రకారం మేజివూస్టేట్ విచారణ జరగా లి. అక్రమ నిర్బంధం ఉన్నప్పుడు సెక్షన్ 97 ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రథమ సమాచార నివేదిక నుంచి చార్జిషీట్ దాఖలు అయ్యే వరకు మేజివూస్టేట్ పర్యవేక్షణ ఉంటుంది. జోక్యం ఉండదు.

హక్కుల పరిరక్షణ బాధ్యత ఆ తరువాత మిగతా కోర్టుల మీద ఉంటుంది. హక్కులు వ్యాఖ్యానించేటప్పుడు కూడా క్రియాశీలంగా వ్యవహరించి వ్యాఖ్యానించాలి. అంతే కానీ సాంకేతికంగా కాదు. క్రిమినల్ న్యాయ పరిపాలనలో రాజ్యాంగం విలువల్ని పరిరక్షిస్తూ వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. ఈ బాధ్యతను నిర్వహించనప్పుడు కోర్టులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ హక్కులు ముద్దాయిలవి కావొచ్చు, అనుమానితులవి కావొచ్చు, సాక్షులవి కావొచ్చు, బాధితులవి కావొచ్చు. 
-మంగారి రాజేందర్

No comments:

Post a Comment