9/15/2011 11:56:14 PM
రక్షణ పేరుతో భక్షణ!యూనియన్ సైన్యాలు 1948 సెప్టెంబర్ 13న తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించే నాటికి తెలంగాణలో అపురూపమైన పోరాటాలు జరిగాయి. కొన్నేళ్లుగా వీరోచిత సాయుధ పోరాటం సాగింది. ఈ మహోన్నత పోరాటం నాటి నైజాం సర్కారుని, దాని ప్రైవేటు సైన్యం రజాకార్లను, వీరికి పునాది వర్గాలైన దేశముఖ్‌ల ను, జాగిర్దార్లను గజగజ వణికించింది. వారి ముష్కర పాలనను తుదముట్టించే లక్ష్యంగా సాగింది. 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య వీర మరణంతో మొదలైన సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటంలో సైన్యం ప్రవేశించే నాటి కి రెండు వేల మంది ప్రాణాలను త్యజించారు. వీరి అస మాన త్యాగాల మూలంగా భూస్వాముల ఆధీనంలో ఉన్న 10లక్ష ల ఎకరాల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నా రు. మూడు వేల గ్రామాల్లో భూస్వాముల పాలనను తుదముట్టిం చారు. దీనికి నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించిం ది.
దీంతో..ఈ విముక్తి పోరాటం అంచెలంచెలుగా నైజాం సంస్థానమంతటికి ఎగ బాకుతుందని వణికిపోయింది. అప్పటికే భారత దేశం వదిలిన బ్రిటిష్ సామ్రాజ్య వాదం, తన ఉపగ్రహ రాజ్యమైన నైజాం పాలనా స్థానం కమ్యూనిస్టులకు కంచు కోటగా మారడం సహించలేకపోయింది. నిజాంకు బ్రిటిష్ ప్రభుత్వం సలహా ఇచ్చిం ది. ‘నిన్ను నీవు రక్షించుకోలేవు. నిన్ను నేను రక్షించ లేను. యూనియన్ ప్రభుత్వం లో చేరిపోమ’ని సలహా ఇచ్చింది. అదే సలహా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులిచ్చారు. ‘తమ రాజ్యంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకొమ్మ న్నారు’.
బ్రిటిష్ ప్రభుత్వం వైదొలిగాక కూడా లార్డ్ మౌంట్ బాటన్‌నే గవర్నర్ జనరల్‌గా గాంధీ నియమించాడు. అతను బ్రిటిష్ ప్రభుత్వ సలహా మేరకు నిజాంని ఒప్పించి యూనియన్‌లో కలిపేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీనిపై మౌంట్ బాటన్, చివ రి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతకాలు చేశారు.
సంస్థానంలో కమ్యూ నిస్టుల ఆధ్వర్యంలో సాగుతున్న సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటపు ప్రమాదం, పరిణామాలనే ప్రామాణికంగా తీసుకొనే ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని తరు వాతనే హోంమంత్రి కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి వల్లభాయి పటేల్ అనుంగు శిష్యుడు కె.ఎం. మున్షిని హైదరాబాద్‌లో, నిజాంకి చెందిన జనరల్ యార్‌జంగ్‌ని ఢిల్లీలో రాయబారులుగా నియమించుకున్నారు. ఖాసింరజ్వీకి ఆప్తమిత్రుడు లాయ క్ అలీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని నిజాం ఏర్పర్చాడు. దీనిలో స్టేట్ కాంగ్రెస్ నాయకుడు జి. రామాచారిని మంత్రిగా చేర్చుకున్నారు. దీని తర్వాతనే జైళ్లలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ నిజాం ప్రభుత్వం విడుదల చేసింది. కె.ఎం మున్షి నాయకత్వాన కాంగ్రెస్, రజాకారులు 1948 ఫిబ్రవరి 7న సచివాలయంలో చర్చిం చారు. దీనికి కాంగ్రెస్ నాయకుడు రామానంద తీర్థ కూడా హాజరయ్యారు. సంస్థా నంలో కమ్యూనిస్టులు ప్రమాదకరంగా పరిణమించారని సమీక్షించారు. కేంద్రం నుంచి వల్లభాయి పటేల్ మారణాయుధాలను, వాహనాలను రజాకా ర్లకు సరఫరా చేశాడు. చేయిదాటి పోతుందని లార్డ్ మౌంట్‌బాటన్‌తో సంస్థా నం మాజీ ప్రధాని ఇస్మాయిల్ సత్వరమే చర్చించాలన్నాడు.
కొత్తగా గవర్నర్ జన రల్‌గా వచ్చిన రాజగోపాలాచారి దీన్నే ప్రస్తావించాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మధ్యవర్తిత్వం లో నైజాం ప్రభుత్వం, జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మూడు కుమ్మకై్క సాగించిందే 1948 సెప్టెంబర్ 13-17 సైనిక దాడి. ఈ దాడిని నిజాం స్వాగతించాడు. నిజాం ప్రభుత్వం దాష్టిక కృత్యాల మూలంగా ప్రజల్లో సంపూర్ణంగా వెలివేయబడింది. అప్పటికే తెలంగాణ ప్రజల వీరోచిత రైతాంగ విప్లవ పోరాటం దాని నడుములు విరిచేసింది. ఈ నేపథ్యంలో నిజాం వ్యతిరేకత పేరిట యూనియన్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి జొరబడింది. నాలుగు రోజుల్లోనే నిజాం లొంగిపోయినట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంని కూల్చడం వరకే సరిపెట్టుకోలేదు. దాని నిజ స్వరూపం బయట పెట్టుకుంది. తన లక్ష్యం ప్రక టించింది. ‘మా గురి నైజాం కాదు, దాన్ని పడగొట్టే కమ్యూనిస్టులే మా దాడికి లక్ష్యం’అని ప్రకటించి, దాని మూడు వేల మినీ సోవియట్ గ్రామాలే మాకు గురి’ అని చెప్పాయి.
సరిగ్గా అదే జరిగింది. 1948 సెప్టెంబర్ 18న మిలిటరీ పాలనను నెహ్రూ ప్రభుత్వం ప్రకటించి నైజాంకు రక్షణ కల్పించింది. రాజ్ ప్రముఖ్ బిరుదు నిచ్చింది. నైజాం నవాబుకు 50 లక్షలు రాజభరణాల కింద నష్ట పరిహారం చెల్లించు కున్నది. ఇది నిజాం పాలనలో తన ఆదాయాన్ని మించింది. నైజాం చేయలేని పని ని చేపట్టింది. అప్పటికే భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం సాగుతున్న పోరాటా న్ని నైజాంకు మించిన ఆగడాలతో అణచడానికి నెహ్రూ సైన్యం పూనుకున్నది. దాని దురాగతాలు వర్ణనాతీతం. లక్షలాది మందిని చిత్రవధకు గురిచేసింది.
దీనిపై నెహ్రూ ప్రభుత్వం తన సహచరుడు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు పండిత్ సుందర్‌లాల్ నాయకత్వంలో కమిటీని నిజాం సంస్థానంలోకి విచారణకు పంపింది. ఏ పాపం తెలియని 40వేల మంది ముస్లిం ప్రజలను ఊచకోత కోసిం దని ఈ కమిటీ ప్రకటించింది. ఈ ఊచకోతలో రెండు లక్షల వరకు ప్రజలు చని పోయారని ఇతర కమిటీలు వెల్లడించాయి.
ఇటీవల తెలంగాణ జేఏసీ సమావేశానికి హాజరైన ముస్లిం సోదరుడు తమ కుటుంబంలోనే 500 మంది బలయ్యారని తెలిపాడు. దీన్ని ఏవిధంగా విమోచన, విలీనం అంటారని ప్రశ్నించాడు. తెలంగాణ వారికి రక్షణ కల్పిస్తున్నారని వేరే రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతంపై కూడా నెహ్రూ సైన్యం దాడి చేసి వేయి మంది ఆంధ్ర సోదరులను కాల్చి చంపింది. కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లోని స్త్రీలందరినీ బట్టలూడదీసి చింతబరిగలతో కొడు తూ గాంధీ విగ్రహం చుట్టూ తిప్పిన ఉదంతం దేశంలోనే మాయని మచ్చగా మిగి లింది. మిలటరీ ప్రభుత్వ స్థానంలో 1949 డిసెంబర్ 1న అధికారంలోకి వచ్చి న వెల్లోడి తన సివిల్ పాలనలో సైతం కర్కోటకంగా ఉద్య మంపై ఉక్కుపాదం మోపాడు. ఒక కేసులో వీరి ప్రభుత్వం 55 మందికి ఉరి శిక్ష విధించింది. శిక్షలో ఒకరైన 14 ఏళ్ల ఎర్రబోతు రాంరెడ్డి అమెరికన్ విలేఖరికి ఇచ్చిన సందేశం ‘బాలుని అమర సందేశం’గా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది. ఈ అక్రమ కేసుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నిరసనోద్యమం వెల్లువెత్తింది. ఫలితంగా ఉరిశిక్షలో కొంత మందిని తప్పించింది.
మిగతా వారికి యావజ్జీవ శిక్షను విధించింది. నిజాం కాలంలోని దేశముఖ్‌లు, జాగిర్దారులు, భూస్వాములు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలాను గుణంగా రూపురేఖ లు మార్చారు. గ్రామాల నుంచి వెలివేయబడిన దొరలకు తిరిగి ప్రవేశం లభించిం ది. ప్రజల స్వాధీనంలోని భూములను, అధికారం తిరిగి స్వాధీ నం చేసు కున్నారు. ఈ సందర్భంగా రామన్నగూడెం కామ్రేడ్ రాసిన ‘రాజీ పడ బోకు రైతా- పిల్లికి ఎలుకకు రాజీలేదు’ అనే పాట ఊరూరా పాడుకున్నారు. మా ఊరు నల్లగొండ జిల్లా వెలిదండలో భూస్వామి రాంచంద్రరెడ్డి భూముల న్నింటినీ కమ్యూనిస్టుల ఆధ్వ ర్యంలో ప్రజలు పంచుకుంటే యూనియన్ ప్రభుత్వం తిరిగి లాక్కొని భూస్వామి కిచ్చింది. కోమటికుంట గ్రామంలో ఒక రైతు పొందిన రెండు ఎకరాల భూమిని తిరిగి భూస్వామికి అప్పగించడానికి పూనుకున్నది. పోరా టంలో సాధించి న విజ యంగా ఆ రైతు భూమిని వదులుకోనందుకు అతడిని కాళ్లు చేతులు కట్టి వంటినిం డా బెల్లం పూసి చీమల పుట్టపై పండబెట్టారు.
కాకులు గద్దలు పొడుస్తున్నా రైతు తన విజయాన్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్నే వదులుకున్నాడు. ఇలాంటి సంఘటనలెన్నో. మరోవైపు తెలంగాణ ప్రజల పీడకుడు నిజాంను రక్షించడం, రాజభరణాలు చెల్లించడం, పువ్వుల్లో పెట్టి సాదడం విమోచనా? విద్రోహమా? రక్షించడం పేరిట భక్షించడాన్ని ఏమంటారు? నిజాం క్రూర పాలనను మరిపించే కాంగ్రెస్ సైన్యం దురాగతాలు తెలంగాణ ప్రజలకు విమోచనా? విద్రోహమా..?

-పి. సూర్యం
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీపీఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ

No comments:
Post a Comment