Sunday, September 4, 2011

కారంచేడు అధికార ప్రతినిధి--Katta Shekar Reddy Namase Telangana 23/07/2011

కారంచేడు అధికార ప్రతినిధి

mataku-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత దళితుల తొలి సజీవ దహనం జరిగింది రాజగోపాల్ నియోజకవర్గంలోనే. ఇదంతా పౌరహక్కుల నివేదికలో భద్రంగా పొందుపరచి ఉంది.అటువంటి గడ్డపై నిలబడి రాజగోపాల్ దళితులకు ఏదో అయిపోయిందని తెగ బాధపడిపోతున్నాడు.రాజగోపాల్‌ది దళితులపై ప్రేమ కాదు, తెలంగాణపై విద్వేషం.

బాంచెన్ దొరా...నీ కాల్మొక్త సంస్కృతిని హరీష్ ప్రదర్శించారు. వయసులో పెద్దోడని కూడా చూడకుండా దొరలాగా చెంపలు వాయించడం దారుణం. అణగారిన వర్గాల్ని కాళ్లకింద తొక్కేసే దొరల సంస్కృతిని దేశ రాజధానిలోనే బాహాటంగా ప్రదర్శించారంటే ఇక తెలంగాణ మారు మూల పల్లెల్లో ఉన్నవారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
-విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్


నరమాంసం తిని నెమరువేసే పులి
జింకపిల్ల ఆవేశాన్ని వెక్కిరిస్తోంది
ఆరువందల మంది ఉసురుతీసిన మూక
చెంపదెబ్బల గురించి యాగీ చేస్తోంది
దళితుల తలలతో బంతులాడుకున్న జాతి
దొరల సంస్కృతిని గురించి మాట్లాడుతోంది
కారంచేడు, పదిరికుప్పం, చుండూరు
మారణకాండల అధికార ప్రతినిధి
బాంచెన్ కాల్మొక్కడం గురించి బాధపడిపోతున్నాడు
ప్రజాస్వామ్యాన్ని ఉరితీసినవాడు
హక్కులను గురించి బోధిస్తున్నాడు

దళితులపై మూడు దశాబ్దాల్లో ముప్ఫై మారణ హోమాలు జరిగాయి. ఇందులో 28 మారణహోమాలు సీమాంధ్రలో జరిగినవే. దళితుల రక్తం ఏరు లై పారింది సీమాంధ్ర నేలపైనే. దళితుల తలలు నరికి పోలి ఆడుకున్న ముష్క ర సంస్కృతికి అధికార ప్రతినిధి రాజగోపాల్. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత దళితుల తొలి సజీవ దహనం జరిగింది రాజగోపాల్ నియోజకవర్గంలోనే. ఇదంతా పౌరహక్కుల నివేదికలో భద్రంగా పొందుపరచి ఉంది.అటువంటి గడ్డపై నిలబడి రాజగోపాల్ దళితులకు ఏదో అయిపోయిందని తెగ బాధపడిపోతున్నాడు.రాజగోపాల్‌ది దళితులపై ప్రేమ కాదు, తెలంగాణపై విద్వే షం. తెలంగాణవాదాన్ని అప్రతిష్టపాలు జేసే కుట్ర. దళితులపై ఆయన కపట ప్రేమను, నయవంచనలను, నయగారాలను ఎవరు నమ్ముతారు? కనీసం వయసును గౌరవించలేదట! నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! మీ మామ వయసును నువ్వు ఎంతగా గౌరవించావో, ఎంతగా అవమానించావో విజయవాడ ప్రజలకు బాగా తెలుసు. వావి వరు స, వయసు, ఉచ్ఛం, నీచం నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? తెలంగాణ పోరాడింది, సాధించిందీ బాంచెన్ కాల్మొక్కే సంస్కృతి నుంచి విముక్తికోసమే. అక్కడక్కడా ఇంకా వివక్ష కొనసాగుతు న్నా సీమాంధ్ర పల్లెల కంటే తెలంగాణ పల్లెల్లోనే దళితులు స్వేచ్ఛ ను అనుభవిస్తున్నారు. తెలంగాణ సమాజానికి రాజగోపాల్ వం టి అజ్ఞానులు, అవగాహనాహీనుల సర్టిఫికెట్లు అవసరం లేదు.

ప్రజలు, విద్యార్థులు, మేధావులు అసలు కోరాల్సింది ప్రజల హక్కులను రక్షించే ప్రభుత్వ వ్యవస్థని. ఉద్యమించాల్సింది, విప్లవించాల్సింది రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలకు వేసిన సంకెళ్లను తెంచుకోవడానికి...
-ఒక దినపత్రికలో జాహ్నవి


lagadapati-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఉపరితలం నుంచి చూస్తే ఆయనలో ఒక మార్క్స్, ఒక మార్టిన్ లూథర్ కింగ్,ఒక మహాత్మాగాంధీ, ఒక జెఎస్ మిల్ కనిపిస్తున్నారు కదూ.కానీ ఆయ న ఈ మహానుభావులు సృష్టించిన పదాల మాటున దాగి పోలీసు తత్వాన్ని, సీమాంధ్ర ఆధిపత్య భావజాలాన్ని బోధిస్తున్న కపట మేధావి.అక్కడక్కడా కొన్ని తత్వశాస్త్ర పదాలను పోగేసి తానొక కొత్త తత్వం చెబుతున్నానని నమ్మి, అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అపర తాత్వికుడు.ఈయన చేసేది కొత్త వాదమో,తత్వమో కాదు, కుతర్కం. వితర్కం.ఒక ఎండమావిని సృష్టించి, అందులో నీళ్లున్నాయని నమ్మించి, లోకాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం.ఆయన స్వేచ్ఛా తత్వం బోధిస్తున్నట్టుగా మనలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన బోధించేది సీమాంధ్ర ఆధిపత్య తత్వం. తెలంగాణకు బానిసతత్వమేనని పూర్తిగా చదివాక అర్థమవుతుంది.ఆయన ప్రాంతీయ భావాలకు అతీతునిగా కనిపించే ప్రయత్నం చేస్తారు,కానీ చదవ డం పూర్తయ్యేసరికి ఆయన ఏ ప్రాంతం గురించి తపిస్తున్నారో తెలిసిపోతుం ది. ఆయన ప్రజల విముక్తి గురించి మాట్లాడతారు, కానీ ఆయన ప్రజలు సామాన్యులు కాదు. అవకాశం ఉన్నమేరకు, చేతనైన మేరకు దోచుకునే అవకాశం ఉన్న పిడికెడు మంది! ఆయన ప్రభుత్వం వద్దని సిద్ధాంతీకరిస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ ఆయన వద్దనేది ప్రజా ప్రభుత్వాన్ని! ఆయన కోరుకునేది కార్పొరేట్ ప్రభుత్వాన్ని! మారుపేరుతో చెప్పేది తత్వమూ కాదు. తత్వం చెప్పేవాడు మారువేషంలో ఉండాల్సిన పనిలేదు.

తత్వాన్ని శీర్షాసనం వేయించడంలో మారువేషంలో ఉన్న ఈ పోలీసు అధికారిది అందెవేసిన చేయి. ‘సమసమాజ సమతావాదం ప్రకారం చైతన్యం ప్రాథమికం. సృష్టిని మనిషి నిజం అనుకుంటే నిజం,మాయ అనుకుంటే మాయ’ అట.ఈ ఒక్క వాక్యం చాలు- ఈ తత్వవేత్తగారి అజ్ఞానం బట్టబయలు చేయడానికి.సమ సమాజవాదం అన్నా, సమతావాదం అన్నా ఒకటే అన్న అతి చిన్న విషయం కూడా ఈ విపరీత తత్వవేత్తకు అర్థం కాలేదు. ఇక చైతన్యం, భౌతిక ప్రపంచం గురించి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయనకు తత్వం గురించి ఇసుమంత కూడా అవగాహన లేదని ఆయన చేసిన వాదనలే చెబుతాయి. ‘చైత న్యం ప్రాథమికం.

భౌతిక ప్రపంచం ద్వితీయం’ అని జార్జి బర్కిలీ నుంచి శంకరాచార్య వరకు భావవాద తాత్వికులంతా చెప్పిన మాట. ‘నేననుకున్నదే ఉంది. నేను అనుకోనిది లేదు’-అని బర్కిలీ చెబుతారు. ‘జగం మిథ్య-ఈ ఐహిక ప్రపంచమంతా మిథ్య, ఆత్మ సత్యం’ అని శంకరాచార్యులు సెలవిచ్చారు. ఈ అభినవ తత్వవేత్త మోకాలికి బోడిగుండుకు లంకె వేసే ప్రయత్నంలో అసలు తత్వాన్ని తలకిందులు చేసి చెప్పారు. సమ సమా జ తత్వం చైతన్యాన్ని ప్రాథమికమైనదిగా గుర్తిస్తుందని, ఈ భౌతిక ప్రపంచం మనిషి మెదడులో మాత్రమే ఉంటుందని, వాస్తవికంగా లేదని చెబుతుందని ఈయనగారు ఒక పెద్ద అబద్ధాన్ని ఆలవోకగా రాశారు. సమసమాజ తత్వం ‘పదార్థాన్ని ప్రాథమికమైనదిగా, చైతన్యం దాని నుంచి ఉత్పన్నమై, దానినే ప్రభావితం చేసేదిగా’ చెప్పింది.

భౌతిక ప్రపంచం వాస్తవికమైనదని గుర్తించింది సమసమాజ సిద్ధాంతమే.అసమాన వ్యక్తులను అసాధారణ శక్తులుగా మలచవచ్చని సమసమాజ సిద్ధాంతం నమ్మడం నిజం. మానవుడు మహాశక్తి సంపన్నుడని, ఆ శక్తిని గుర్తింపజేయడం ద్వారా వారిని అజేయులు,అపార శక్తి సంపన్నులుగా మల్చవచ్చని కూడా ఈ సిద్ధాంతం భావిస్తుంది.‘మనుషులు అందరూ సమానులు’ కాదని చెప్పడంలోనే సమాజంలో కొందరిని తిరస్కృతులుగా, బహిష్కృతులుగా,చేతగానివారుగా, చైతన్యహీనులుగా మార్చే కుట్ర ఉందని ఈ తత్వవేత్తకు ఎప్పుడు తెలుస్తుంది?

అవును నిజం- తప్పుడు తాత్వికత మనిషిని గందరగోళంలో పడేస్తుంది. తమరు ఎంత గందరగోళంలో ఉన్నారో మీ తలకిందుల తత్వం,తలతిరుగుడు తత్వం వెల్లడి చేస్తున్నది.ఇరువూపాంతాల మేధావులు వాస్తవాలు విస్మరించారని ఈ తత్వవేత్త బాధపడిపోయారు. వాస్తవాలను వాళ్లు విస్మరించారో లేదో కానీ తమరు మాత్రం విస్మరించారు.తెలంగాణ భౌగోళిక స్థితి గతులను గురించి జాహ్నవి దుర్భేద్యమైన అజ్ఞానాంధకారంలో ఉన్నారని చెప్పడానికి కృష్ణా, గోదావరి నీళ్లపై ఆయన రాసిన వాక్యాలే సాక్ష్యం. గోదావరికి కాలడ్డంపెట్టి సాగునీరందిస్తామని డాంబికాలు చెప్పడం కాదు పోలీసాఫీసర్-నీ బుద్ధికి అందకపోతే ప్రపంచమే లేదనుకుంటే ఎలా? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అర్హత, హక్కులేకుండా వందలాది టీఎమ్సీల నీరు తరలించుకుపోవడానికి పోతిడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచి న ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంట్, గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కాకతీయ కాలువను 22వేల క్యూసెక్కులకయినా పెంచలేదెందుకు తత్వవేత్తా! కాకతీయ కాలువ సామర్థ్యాన్ని 22వేల క్యూసెక్కులకు పెంచితే మరో 100 టీఎమ్సీల నీరు, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆ నీటితో మరో పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవి కాదా? ఇచ్చంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నో కోనసీమలు అవతరించేవి కాదా? ఈ ప్రాజెక్టులన్నీ గోదావరికి కాలడ్డం పెట్టి పారించేవేనని తమరికి తెలుసా? ‘తెలంగాణ పీఠభూమి అని, నీళ్లు మళ్లించడం సాధ్యం కాదు’అని ఒక మోసపూరితమయిన, వంచనాత్మకమైన వాదాన్ని ప్రచారం చేసింది నీలాంటి అవాస్తవిక ఆంధ్రా మేధో ప్రపంచమే కాదా?


ఉద్యోగాలు ఏమన్నా బంగారమా దోచుకోవడానికి? అని ఈ తత్వవేత్త ఓ తలతిక్క వాదం చేశారు. ఇది నంగనాచితనం.జాణతనం.అభివృద్ధి సోపానంలో ఒక ఉద్యోగం ఒక కుటుంబాన్ని పాతజీవితం నుంచి విముక్తి చేస్తుంది. వారి పిల్లలు మంచి విద్యను పొందుతారు.ఆ కుటుంబం నాణ్యమైన జీవితా న్ని పొందుతుంది. ఒక ఊళ్లో పది మందికి ఉద్యోగాలు వస్తే, ఆ ఊరి జీవన ప్రమాణాలు మారిపోతాయి. ఆ పది కుటుంబాలు సంపాదించే డబ్బు ఆ ఊరికి గొప్ప ఆదాయం అవుతుంది. మా తెలంగాణ ఈ ఐదున్నర దశాబ్దాల్లో కనీసం లక్ష ఉద్యోగాలను కోల్పోయింది. ఆ లక్ష ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే వచ్చి ఉంటే లక్ష కోట్లకు పైగా తెలంగాణ ప్రజలకే దక్కి ఉండేవి. లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు వచ్చి ఉంటే ఇక్కడి జీవన ప్రమాణాలు ఎంతగానో మారిపోయేవి. ఉద్యోగం అంటే బంగారమే పోలీసాఫీసర్! బంగారం కొల్లగొట్టడం కంటే దారుణమైన నేరం ఉద్యోగం కొల్లగొట్టడం!

తత్వవేత్త ముసుగులో ఆంధ్ర ఆధిపత్యవాదాన్ని అందిపుచ్చుకున్న ఈ పెద్ద మనిషి ఇంకా ఎన్నో ఎన్నో అబద్ధాలను పోతపోసి కుమ్మరించారు. ఈ వాస్తవికవాది-ఒకసారి వెనుకటి ఘటనలను వదిలేసి మధ్యలోఅందుకుని మాట్లాడతారు.మరోసారి మధ్యలో జరిగిన ఘటనలను మాత్రం ప్రస్తావించి, గతం లో ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు దొంగనిద్ర నటిస్తారు. 1995లో మావోయిస్టులు మొదట తెలంగాణ వాదాన్ని ముందుకు తెచ్చారట. అంతకు ముందు తెలంగాణవాదంలేదా? 1952లో, 1956లో, 1969లో, 1988 లో తెలంగాణవాదం వినిపించలేదా తమరికి? మావోయిస్టు బూచి గురించి మాట్లాడే మీరూ తత్వం గురించి మాట్లాడడమా? మావోయిజం పుట్టి, పెరిగి, వర్ధిల్లింది తమరి సమైక్యాంవూధలోనే కాదా? మావోయిజం గురించి తెలంగాణ తమరి ద్వారా నేర్చుకోవలసింది ఏమయినా ఉందా? 2009 డిసెంబరు 9కి ముందు తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకరించిన విషయం ఈ తత్వవేత్తకు అస్సలుకు గుర్తు లేదు. మెజారిటీ మందబలంతో డిసెంబరు 9 నాటి తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంటు దురహంకారమూ ఈయనగారికి జ్ఞాపకం లేదు.ఆ తర్వాత జరిగినవి, అంతకు ముం దు జరిగినవి మాత్రమే ఈ ప్రజాస్వామికవాదికి గుర్తున్నాయి. ఎంత విడ్డూరం?

ఉద్యమం పేరుతో ఏం చేసినా పర్వాలేదని తెలంగాణవాదులు అనుకుంటున్నారట. తెలంగాణవాదులు మాత్రం అలా అనుకోవడం లేదు సార్. ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంటు, తమరిలాంటి తైనాతీ మేధావులు మాత్రం ఉద్యమాన్ని ఏం చేసినా పర్వాలేదని అనుకున్నారు.ఉద్యమాన్ని ఎంత గా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొట్టారు.అయినా తెలంగాణ వాదులే రెచ్చిపోలేదు.తమ లాంటి పోలీసు ఆఫీసర్లు దగ్గరుండి విద్యార్థులపైకి ‘బాష్పవాయు గోళాలు విసరమని ఆదేశించినా’ తెలంగాణవాదులే ఎప్పటికప్పుడు శాంతిని కాపాడుతూ వచ్చారు. భాషావూపయుక్త రాష్ట్రాలు ఏర్పడిన రోజే, ఒకే భాష-హిందీ మాట్లాడే రాష్ట్రాలు 8 ఏర్పడ్డాయి. ఒకే భాష మాట్లాడేవారు ఎన్ని రాష్ట్రాలలోనయినా ఉండవచ్చునని అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు అంగీకరించారు. బహు భాషా రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఒకే భాషా రాష్ట్రం అనేవాదం వచ్చింది తప్ప, ఒకే భాష మాట్లాడేవారు రెండు రాష్ట్రాలలో ఉండకూడదని కాదు.ఈ వాదాన్ని కూడా ఆంధ్రులు తమ దోపిడీని సమర్థించుకోవడం కోసం, వ్యాప్తి చేసుకోవడం కోసం వాడుకున్నారు.

తెలంగాణ నినాదం వెనుకబాటుతనంతో మొదలై ఇప్పుడు ఆత్మగౌరవ నినాదంగా మారిందని మరో అబద్ధాన్ని జాహ్నవి తేలికగా రాసేశారు. తెలంగాణ ప్రజలు మొదటి నుంచీ ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నారు. ఆ డిమాండు నుంచి ఎప్పుడూ వెనుకకుపోయింది లేదు. ప్రత్యేక రాష్ట్ర డిమాండు అంటేనే వెనుకబాటుతనం నుంచి విముక్తి, స్వయం పాలన,ఆత్మగౌరవ పునరుద్ధరణ. ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేనివి. పరస్పరం అంతఃసంబంధం కలిగినవి. కానీ ఇసుకలో తలదూర్చి ఇదే తత్వమని ఆసనం వేసుకున్నవారికి ఇటువంటి లోతైన విషయాలు అర్థం కావు. ఇది తెలంగాణ వాదానికి వక్రభాష్యం చెప్పే కుట్రలో భాగం.

అధికార వికేంవూదీకరణ దోపిడీని తగ్గిస్తుందని, పాలనా సౌలభ్యాన్ని పెంచుతుందని, పాలకులు ఇష్టారాజ్యంగా చెలరేగడానికి అవకాశాలు తగ్గిపోతాయని ఈ నియో లిబరల్‌కు తెలియదా? దోపిడీ దారులే మారతారట.దోపిడీ మారదట. దీనికోసం ఇంత సెంటిమెంట్ ఎందుకని నిలదీస్తున్నారు. ఇది తాత్విక శూన్యత నుంచి వచ్చిందట.ఇదంతా అహేతుక ఆత్మాక్షిశయవాదమట.ఆత్మాక్షిశయవాదంలో బందీ అయి అహేతుకవాదన చేస్తున్న ఈ మేథావి ముందుగా తాత్విక శూన్యత ఎక్కడ ఉందో గుర్తించాలి, దానినుంచి బయటపడాలి. ఖాళీ బుర్రతో ఉన్నవాడికి ఏమయి నా చెప్పవచ్చు. ఇంత గందరగోళాన్ని తలకెక్కించుకున్నవాడికి, ఆ గందరగోళాన్ని తత్వశాస్త్రంగా నమ్ముతున్నవాడికి ఎవరయినా ఏం చెప్పగలరు? కపట తత్వానికి నిలు రూపం జాహ్నవి.

No comments:

Post a Comment