Thursday, September 22, 2011

బందూకులతో బొగ్గు తవ్వగలరా! by - ఎండీ మునీర్ Namasethe Telangana 23/09/2011


9/23/2011 12:27:14 AM
బందూకులతో బొగ్గు తవ్వగలరా!
TG2F-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaబందూకులతో బొగ్గు తవ్వే ప్రయత్నం చేస్తున్నది రాజ్యం. 60 ఏండ్లు గా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షతో, మొక్కవోని పట్టుదలతో సింగరేణి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను అణచివేయడం కోసం ప్రభుత్వం వేస్తు న్న ఎత్తులు ఎప్పటికప్పుడు కార్మిక వర్గం ఐక్యంగా ఉండి చిత్తు చేస్తున్నది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా బొగ్గు గనుల నుంచి బొగ్గును తీయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ర్టంలో సకల జనుల సమ్మె ప్రారంభమయిన మొదటి రోజు నుంచే కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఎలాంటి పోస్టరు, కరపత్రం లేకుండా జరుగుతున్న మొట్ట మొదటి సమ్మె ఇది... ప్రచారం కూడా అంతంత మాత్రమే... అయితే సింగరేణిలోని 12 కార్మిక సంఘాలు ఐక్యం కావడం ఈ సమ్మెకు సగం బలంగా పేర్కొనవచ్చు...

మరోవైపు తెలంగాణ జర్నలిస్టు ఫోరం, అఖిల పక్షం, మహిళా టీచర్ల జేఏసీ, న్యాయ వాదుల జేఏసీ, ఇలా స్థానిక టీచర్ల జేఏసీలు ఈ సమ్మె కు సంఘీభావం తెలపడం, వెన్నుదన్నుగా నిలబడటం కూడా సమ్మె చేస్తున్న కార్మికు లకు కొంత ఆత్మ సై్థర్యం, మనో ధైర్యం కల్పించింది... కార్మికుల న్యాయమైన డిమాండ్ల మీద నక్సలైట్లు సింగరేణిలో సమ్మెలు చేయించిన సందర్భంలో కూడా ఇలా ఒత్తిళ్లు చేసి ఉత్పత్తి చేయించే ప్రయత్నం చేసేవారు. చివరికి అది భగ్నమయ్యేది. ఇలా సమ్మెల సందర్భంగా కార్మికులకు సికాస ముద్రలు వేసి ఎన్‌కౌంటర్ల పేరిట కాల్చిచంపిన సంఘటనలు ఉన్నా యి. మందమర్రి ప్రాంతంలో పల్గుణ, బెల్లంపల్లిలో కలువల సారయ్య, ఇలా చాలా మంది కార్మికులను తీసుకెళ్లి మాయం చేసి కాల్చిచంపిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రభుత్వ చర్యలను నిరసి స్తూనే సమ్మె కొనసాగించిన ఉదంతాలున్నాయి.

అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఇది నక్సలైట్లు చేయిస్తున్న సమ్మె కాదు. తమ ఆర్థిక, ఇతర సౌకర్యాల మెరు గు కోసం చేస్తున్న సమ్మె కాదు, ఇది దశాబ్దాలుగా తమలో ఉన్న ఆకాంక్షకు సంబంధించిన సమ్మె. ఈ సమ్మెలో కార్మికులకు వారి కుటుంబ సభ్యుల నైతి క మద్దతు ఉన్నది. అయినా రాజ్యం నల్ల సూర్యులను ఉద్వేగానికి గురి చేస్తు న్నది. బందూకుల నీడలో బొగ్గును తవ్వించే ప్రయత్నం చేస్తున్నది. దీనికి కొంత మంది సీమాంధ్ర అధికారులతో పాటు తెలంగాణలోని ఉన్నతాధికార గణంలో ఉన్న ద్రోహులు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. కానీ కార్మికులు మొక్కవోని పట్టుదలతో తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టేంత వరకు రాజీపడేది లేదని గిరిగీసి పోరాడుతున్నారు. వారి ఆకాంక్షను గుర్తించకుండా సీమాంధ్ర ప్రభుత్వం సమ్మె ప్రారంభరోజు నుంచే కుట్రలు చేయడం మొదలు పెట్టింది..

ఒక్కో బాయిపై వంద నుంచి నాలుగు వందల మంది సాయుధ పోలీసులను పెట్టి కార్మికులను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి అదిరించి, బెదిరించి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నది. అయినా తమ పాచిక పారనందున ఇప్పుడు బొగ్గు స్టాకుగా ఉన్న సీఎస్పీల నుంచి, సీహెచ్‌పీల నుంచి ఓసీల ప్రాంగణాల నుంచి తరలించ డానికి పూనుకుంటున్నది. ఈ తరలింపును కూడా నిలిపివేయడం కోసం కార్మిక సంఘాలు, జేఏసీ పోరాటం చేస్తున్నది. బొగ్గు బావుల ముందు పడు కున్నారు. వారిపై పోలీసులు అరాచకంగా దౌర్జన్యం చేసికొట్టి మరి తీసుకువెళ్లి పోలీసు స్టేషన్‌లలో పెడుతున్నది. పోలీసు స్టేషన్లను కూడా కార్మికులు ముట్ట డించి నాయకులను, తోటి సహచరులను విడిపించుకోవడం జరుగుతున్నది. సింగరేణి ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీ వివేకానంద్ లాంటివారు, ఎమ్మె ల్సీలు అందరూ ఒక్కటయ్యారు. కార్మికులకు అండగా నిలబడ్డారు. సింగ రేణిలోని 12 కార్మిక సంఘాలు ఒక్కటయ్యాయి. ఎట్టి పరిస్థితులలో బావులు నడిపేది లేదన్నాయి.

అయినా రాత్రి పూట దొంగల్లాగా యాజమాన్యం ప్రయ త్నాలు చేస్తూనే వచ్చింది. తాము ఇంత చేస్తున్నా మనల్ని అడ్డు కోవడానికి మన ఆకాంక్షను దెబ్బతీయడానికి ప్రభుత్వం ఇంత కుట్ర పన్నుతోంది. దీనికి కొంత మంది తోటి ఉద్యోగులు కూడా కక్కుర్తి పడి విషయాన్ని అర్థం చేసుకోకుండా సీమాంధ్ర అధికారుల ప్రలోభాలకు లోనవుతున్నారని ఆందో ళన చెంది కార్మికులు ఉద్వేగానికి లోనవుతు న్నారనడానికి బుధవారం ఖమ్మం జిల్లా మణుగూరు ఏరియాలో పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసు కోవడానికి సిద్ధమయిన కార్మికుడి ఉదంతం ఒక ఉదాహారణగా పేర్కొన వచ్చు. కత్తి రాము(రాంచందర్) అనే ఫిట్టర్ కార్మికుడు ఓసీ నాలుగు గనిలో పని చేస్తున్నాడు. ఇతను ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నా డు. ఒక కార్మిక నాయకుడిగా ఉండి సమ్మె బాధ్యత మోస్తున్న వ్యక్తి ఇలా ఆత్మహత్య యత్నానికి సిద్ధపడటం ఎంత తీవ్ర మయిన విషయమో.! ఎంత విషాదకరమయిన విషయమో స్పష్టమవుతుంది. పాలకులారా! సింగరేణి అధికారులారా! పోలీసులారా! ఇప్పటికయినా మా బొగ్గు బావుల నుంచి బందూకులను వెనక్కి పంపాలి.

తట్టా, చెమ్మస్‌లు పట్టే మా చేతులు ఈ దేశానికి వెలుగునిచ్చే నల్ల బంగారాన్ని తీస్తున్నాయి... వాటికి పని చెప్పకం డి... చట్ట పరిధిలో ఉండి మా ఆకాంక్ష కోసం, మా జన్మ హక్కు అయిన సమ్మెకు పూనుకున్న కార్మికులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపు తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టవద్దని కార్మిక వర్గం ఈ సంఘటన అనంతరం ఆక్రోశంతో, ఆవేదనతో, ఉద్వేగంతో పేర్కొంటున్నది. నాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కూత వేటు దూరంలో ఉన్న గోదావరి ఖని గనులకు అతి దగ్గరలో పోలీసు స్టేషన్‌లో పోలీసులు ఉద్యమం చేస్తున్న తన మిత్రుడిని అరెస్టు చేశారని ఆవేదనతో మామిడాల సత్యనారా యణ అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా ఈ కోవకే వస్తుంది. రాజ్యం ఇంత జులుం ఎందుకు చేస్తున్నది..! ఇంత ఉద్వేగానికి బాధ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కారణం కాదా..! దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని కార్మిక వర్గం ప్రశ్నిస్తున్నది...

మా బొగ్గు, మా నీరు మాకు కావాలని, మా తెలంగాణ మాకు కావా లని మేం చేస్తున్న సమ్మెకు అడ్డు పడవద్దని కార్మికులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు బలగాలను వెనక్కి పంపాలని మణుగూరులో కూలి పని చేసుకునే రాజేందర్ అనే తెలంగాణ వాది టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశా డు. దీనికంతా కారణం ఎవరు..! ఇప్పుడు సింగరేణి అధి కారులు 48 గంటలు సమ్మెలో పాల్గొనడానికి సిద్ధమ యి సమ్మె ప్రారంభించారు. ఒకవైపు సమ్మె వల్ల నష్టం లేదని అంటూనే మరో వైపు బొగ్గు అవసరం ఎందుకు పడిందో ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి బొగ్గును తరలించు కోవడం కోసం ఎందుకు తంటాలు పడుతున్నా రో ముఖ్య మంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంది... మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అసలు సకల జనుల సమ్మే లేదని చేస్తున్న తప్పుడు ప్రచారానికి, ఏఐసీసీ అధికార ప్రతినిధి సింఘ్వీ కూడా వంత పాడి నట్టు మాట్లాడడం ఎందుకోసం..! మేకపోతు గాంభీర్యంతో వాస్తవాలను అంగీకరించకుండా తమ చేతిలో అధికారం ఉందని అవాకులు, చెవాకులు పేలడం ఇప్పటికైనా మానితే మంచిది. ఆక్రోశంతో ఉన్న బొగ్గు గని కార్మికుల ను చూస్తూ కూడా వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు సమాచారాలు అందించడం తగదు... వెంటనే బొగ్గు బావుల నుంచి పోలీసు సాయుధ బలగాలను ఎత్తివేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేస్తే మంచిదని ముఖ్యమంత్రిని సకల సింగరేణి కార్మికులు కోరుతున్నారు. 
- ఎండీ మునీర్

No comments:

Post a Comment