Sunday, September 4, 2011

అన్నా ..అవినీతి..మనం పొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు Namasethe Telangana 23/08/2011


anna-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
పెద్ద పెద్ద త్యాగాలతో పనిలేకుండానే వారం రోజుల్లో విప్లవం తేవచ్చన్న సంగతి అన్నా హజారే చెప్పేదాకా మన దేశంలో ఎవరికీ తెలియలేదు. ఔను! అన్నా హజారే ఇవాళ దేశంలో ఒక కొత్త విప్లవ వీరుడై అవతరించాడు. ఇది కేవలం అతన్ని ఆరాధిస్తోన్న వాళ్లో, అతని పోరాటాన్ని అభిమానిస్తోన్న వాళ్లో చెస్తోన్న పొగడ్త కాదు. స్వయంగా అతనే చెపుతున్నాడు. ఈ దేశంలో తనొక విప్లవ జ్వాల వెలిగించానని ఇక దానిని ఈ దేశపు యువతే కొనసాగించాలనీ కోరాడు. అతనికి కుడి భుజంగా ఉంటోన్న మాజీ పోలీసు అధికారి కిరణ్‌బేడీ మరో అడుగు ముందుకేసి ‘అన్నా నే ఇండియా’ అంటోంది. నేటి భారతదేశపు సకల జనుల ఆశలకు, ఆకాంక్షలకు అన్నా ను ఒక ప్రతిరూపంగా నిలిపే ప్రయత్నం ఆమె చేస్తోంది. అది నిజమే అన్నట్టుగా ఈ దేశపు ప్రధాన నగరా ల నుంచి మన టీవీ ఛానళ్లు నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజాభివూపాయాన్ని ప్రసారం చేస్తున్నాయి. అందులో నిత్యం అవినీతిలో మునిగితేలుతున్న వాళ్లు, అవినీతి సొమ్ముతో నెలనెలా ఆరంకెల జీతం తీసుకుంటున్న వాళ్లు, వాళ్ల పిల్లలు ముందుండి జన్‌లోక్‌పాల్ గనుక ఆమోదం పొందితే తెల్లారేసరికల్లా అవినీతి మటుమాయం అయిపోతుందని వాదిస్తున్నారు. అన్నిటికీ మించి మీడియా అన్నా ను ఆ కారణంగా ఆకాశానికి ఎత్తుతోంది.


అన్నా హజారే గత రెండు నెలల్లో విడతల వారీగా చేస్తోన్న నిరశన కార్యక్షికమాలను రెండో స్వాతంత్య్ర ఉద్యమంతో పోలుస్తున్నారు. నిజానికి ఈ దేశం లో చాలా మందికి ఇంకా ఒకటో స్వాతంవూత్యమే రాలేదని, గడచిన అరవై నాలుగేళ్ల దేశీయ పరిపాలనలో కూడా ఇంకా కోట్లాది మంది కాందిశీకులుగా కాలం గుడుపుతున్నారని భారతీయ మీడియా మేధావులకు తెలియకపోవడం ఆశ్చర్యం. అట్లా నిరంతరం దళితులూ, ఆదివాసీలు, అణగారిన ప్రజలు ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతు న్నా వాటిని గుర్తించని వాళ్లు ఇప్పుడు ఒక వ్యక్తి ఒకే ఒక్క విషయం మీద నిరాహారదీక్షకు దిగితే దాన్ని స్వాతంవూత్యోద్యమంతో పోల్చుతూ కథనాలల్లి ప్రసారం చేయడం స్వాతంవూత్యోద్యమ స్థాయిని దిగజార్చడం తప్ప మరోటి కాదు. పాత సమస్యలనే పదేపదే చర్చించలేక మీడి యా ఇప్పుడు దేశంలో ఇలాంటి కొత్తగాలిని కోరుకుంటోంది. పైగా ఈ దేశాన్ని సగం తామే బాగు చేస్తున్నామని భావించే సగటు మీడియా సంపాదకులకు ఈ ప్రధాని నచ్చడం లేదు. ఆయన విధానాలు బాగున్నాయని కితాబు ఇస్తూ ప్రజలను ఇంతకాలం మభ్యపెట్టిన వీరికి ఇప్పుడు మొహం మొత్తింది.

ఇప్పుడు నరేంవూదమోడీ నయమని సర్వేలలో చాలా మంది అంటున్నారట. అదీ కుదరకపోతే రాహుల్‌ని రాజును చేయాలని ప్రజలు కోరుకుంటున్నార ట. బహుశా అందుకేనేమో అక్కడ రాహుల్‌కు ఇక్కడ జగన్‌కు ప్రజలు నీరాజనం పడుతున్నట్టు కథనాలు కూడా అన్నా హజారే వార్తలతో పోటీపడుతున్నాయి.
ఒక సీదా సాదా పెద్దమనిషి, ఏ చరిస్మా లేని వయోవృద్ధుడు, మరే కొత్త ఎజెండా లేకుండా గడిచిన ఆరు దశాబ్దాలుగా అందరి అనుభవంలో ఉన్న అవినీతిని ఎజెండా చేసుకుంటే ఇంత స్పందన ఎందుకు వస్తున్నట్టు? పైగా ఈ తరం నవ యువకులంతా అతన్ని ఆకాశానికి ఎత్తడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది సామాజిక పండితులు అది అందరి ఎజెండా కాబట్టి ఆ రకమైన స్పందన సహజమే అంటున్నారు. పైగా ఈ యువత రేపటి భవిష్యత్తు పట్ల బెంగతో ఉన్నదని, ఒక అవినీతి రహిత కొత్త సమాజం కావాల ని... అదీ నిజమే కావొచ్చు. కానీ అతన్ని మోస్తున్న వారు కేవలం ఈ నవ యువకులే కాదు, ఎలాంటి అడ్డూ అదుపూ, అడపా దడపా చట్టాలు, అరెస్టులు తమ దాకా రాకుండా కేవలం రాజకీయ వ్యవస్థ చుట్టో, ప్రభుత్వ అధికారులకో పరిమితం కావాలనుకునే సంపన్న పెట్టుబడిదారీ వర్గం అతన్ని ముందుకు తోసింది అనేవాళ్లూ ఉన్నారు.

ఇప్పుడు సాగుతోన్న ప్రచారాన్ని లోతుగా గమనించే ఎవరికైనా ఈ వాదన అసంబద్ధం అనిపించదు. ఈ దేశం లో అవినీతి అంటని వ్యక్తి ఉన్నాడంటే అతిశయోక్తి అవుతుంది. అవినీతి అన్ని రంగాల్లో అనేక రూపాల్లో విస్తరించి ఉన్నదనడంలో ఎవ్వరికీ పేచీ లేదు. అవినీతిని ఆపటానికి బలమైన చట్టాలు రావాల్సిందే. దేశంలో ప్రభుత్వమే ధర్మకర్తగా ఉండాల్సిన రాజకీయాల స్థానంలో పెట్టుబడులు పెట్టే సంపన్నులు, బహుళజాతి కంపెనీలు, గనులను, ఖనిజ సంపదను కొల్లగొట్టే వాళ్లే రాజకీయ నాయకులైపోయిన నేటి రోజుల్లో లోక్‌పాల్ ఏర్పాటు కావాలి. అవినీతి ఆస్కారం ఉన్న అందరూ ఆ చట్టం పరిధిలోకి రావాలి. ఇది కొత్తగా అన్నా హజారే కనిపెట్టిన సంగతేం కాదు. ఇది ఇప్పటికే సిద్ధంగా ఉంది. దాన్ని మరింత పటిష్ఠంగా తేవాలని అందరూ కోరుతున్నారు. అందుకు భిన్నంగా హజారే జన్ లోక్‌పాల్ పేరుతో కొత్త చట్టాన్ని తనకు తోచిన పద్ధతిలో తయా రు చేశాడు. అది జనంలో సమక్షిగంగా చర్చించలేదని, కొందరు ఎన్జీవోలు, మరికొందరి వ్యక్తులు కలిసి దీన్ని తయారు చేశారని, ఇది యథాతథంగా ఆమోదించడం కుదరదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా ఇవాళ దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు, వారు పోషించే సంస్థలు, వాటి ఉద్యోగులు దీన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

మీడియా తప్ప మరో లోకమే లేదనే నమ్మకంతో ఉన్న మధ్యతరగతి దీన్ని గట్టిగా సమర్థిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ గాలిలో పడి కొట్టుకుపోతున్నారు. అన్నాను అభిన వ గాంధీగా కీర్తించినా, అవతార పురుషుడని అనుకున్నా ఎవరికీ అభ్యంత రం లేదు. కానీ అన్నా, అతని చేతిలో ఉన్న జన్ లోక్‌పాల్ ఒక్కటే సర్వరోగ నివారిణి అన్నట్టు భావించడంతోనే సమమస్యంతా. పైగా ఎన్నడూ ప్రజల పక్షంలో లేని చాలా మంది పెద్ద మనుషులు, ప్రజల గురించి ఆలోచించని పెద్దపెద్ద సంస్థలు, యాజమాన్యాలు ఇవాళ అన్నా గురించి, ఆయన సృష్టిస్తో న్న సునామీ గురించి ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సాగుతోన్న ప్రచారాన్నే తీసుకోండి. జగన్‌కు పెట్టుబడులు పెట్టి పట్టుబడిన కంపెనీలలో అదే పద్ధతుల్లో భూములు పొందిన మరికొన్ని కంపెనీలలో ఉద్యోగాలు వెలగబెడుతున్న వాళ్లు ‘ఫేస్ బుక్’ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. సాయంత్రం కాగానే ఏదో ఒక కూడలిలో చేరి స్లోగన్స్ ఇచ్చి ఇంటికెళ్లిపోతున్నారు.

వీకెండ్లలో సమాజ సేవకు దిగే వీళ్లకు సమాజమంటే డబ్బులు, అది దుర్వినియో గం కాకుండా చూసుకోవడం తప్ప ఇంకేమీ తెలియడం లేదు. విచివూతమేమిటంటే ఇవాళ హైదరాబాద్ చుట్టూ వెలిసిన ఈ కంపెనీలన్నీ అవినీతి పునాదుల మీద, దోపిడీ సొమ్ముతో ఏర్పడ్డవే. వీటిల్లో చాలా వరకు నిన్నా, మొన్న అవినీతి వలలో చిక్కుకున్నాయి. అన్నా హజారే ఈ పునాదులను ప్రశ్నించ డం లేదు. అవినీతికరమైన విధానాలను, సెజ్ లాంటి చట్టాలను వద్దనడం లేదు. అన్నా హజారే ప్రతిపాదించిన జన్ లోక్‌పాల్ బిల్లులో కార్పొరేట్ అవినీతి గురించి, ప్రైవేట్ రంగాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారులు సాగించే దోపిడీ గురించి ఒక్క మాట కూడా లేదు. నిజానికి 2జీతో సహా ఇవాళ మన రాష్ట్రంలో వెలుగుచూస్తోన్న రాజకీయ అవినీతి వెనుక పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, కాంట్రాక్టర్లు, మీడియా, మైనింగ్ మాఫియాలు ఉన్నాయి. అధికారంలో లేకున్నా, సెక్ర రాకున్నా వేలకోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల ప్రస్తావనే దీ జన్‌లోక్‌పాల్‌లో లేకపోవడం ఈ అనుమానాలన్నిటికీ కారణం అవుతోం ది. అలాంటి చట్టాలు తెచ్చి, ఆ పద్ధతులను ప్రోత్సహించి అవినీతికి ద్వారాలు తెరిచిన చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు అన్నాకు మద్దతు తెలుపుతున్నారం అర్థం చేసుకోవచ్చు.
నిజమే, తెలంగాణవాదులుగా మనం కూడా అవినీతిని వ్యతిరేకించాలి.

అవినీతి రహిత తెలంగాణ కావాలి. ఈ దేశంలో అవినీతి వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయింది, నష్టపోతున్నది తెలంగాణ ప్రజలే. తెలంగాణ సాధ న కోసం ప్రజలు ఉద్యమించిన ప్రతిసారీ అవినీతి, పెట్టుబడీ అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కొందరికి ఇది వ్యక్తిగత సమస్య కావ చ్చు. కానీ తెలంగాణకు ఇది జాతి సమస్య. కచ్చితంగా మన ఎజెండాలో అవినీతి కూడా ఒక ప్రధాన అంశంగా ఉండాలి. కానీ అన్నా మాత్రమే అంద రి ఎజెండా కాకూడదు. ఎందుకంటే అతను ప్రజల ఎజెండాతో లేడు. తన ఎజెండానే ప్రజలందరిదీ కావాలని వాదించేవాడు ప్రజాస్వామ్యవాది కాలేడు. అన్నా ప్రజలను, ప్రజాస్వామిక ఆకాంక్షలను, ఆ ఆకాంక్షల కోసం పోరాడుతోన్న ప్రజలను పరిగణనలోకి తీసుకున్నవాడు కాదు. అలా తీసుకునేవాడే అయితే ఇన్నేళ్లుగా పోరాడుతున్న శక్తులతో కలిసి తనూ ఉండేవాడు.

వాళ్లందరితో తన ఆలోచనలు పంచుకునేవాడు. క్షేత్రస్థాయి నుంచి అన్ని వర్గాలనూ కూడగడుతున్న శక్తుల ముందు తన ప్రతిపాదన ఏమిటో, అది అందరికీ ఎలా ఉపయోగపడుతుందో చెప్పేవాడు. చర్చకు పెట్టేవాడు. అది జరగలేదు. గడిచిన అరవై ఏళ్లుగా ఈ దేశంలో వివిధ అంశాలపై, వివిధ రీతుల్లో ఉద్యమాలు చేస్తూ, అనేక చట్టపరమైన రక్షణలు సాధించిన ఎవరితోనూ అన్నా హజారే తన ప్రతిపాదనలు పంచుకోలేదు. అయినా అది జన్ లోక్‌పాల్ అంటున్నాడు. మరోవైపు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తద్వారా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తోన్న వ్యక్తి. చట్టాలు చేయాల్సిన వ్యవస్థలను పక్కనబెట్టి అతనే చట్టం రూపొందించాను దాన్ని ఆమోదించమని అడుగుతున్నాడు. అతనో, సామాన్యుడో, నిస్సహాయుడో అయితే పరవాలేదు. మనందరం కూడా అతనితో పాటు నడవొచ్చు. అతను ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడే వ్యక్తి అయితే మనమూ అతని పోరాటంలో పాలు పంచుకోవచ్చు. కానీ అతను మనందరి సమష్టి హక్కులకు గుత్తేదారుగా మాట్లాడుతున్నాడు.

అది ఆక్షేపణీయం. చాలా మంది ఇవాళ తనే మన ఆశాజ్యోతి అంటున్నారు. అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. నేనేదో ఈ దేశంలో ప్రజాస్వాయ్యం వర్ధిల్లుతోందన్న భావనలో లేను, పార్లమెంటరీ వ్యవస్థే మంచిదన్న భ్రమలు కూడా నాకు లేవు. కానీ వ్యక్తులు వ్యవస్థలుగా మారడం మంచి పరిణామం కాదు. పైగా వ్యక్తి రూపంలో ఉండే నియంతృత్వం మరీ ప్రమాదకరం. అన్నాలో ఈ రెండూ కనిపిస్తున్నాయి. అయినా అధికార కాంగ్రెస్‌తో సహా రాజకీయ పార్టీ లు అన్నా హజారేను పల్లెత్తు మాట కూడా అనడానికి సాహసించ అతని వెనక జనమున్నారని అనే వాళ్లూ ఉన్నారు. అదే కొలమానం అనుకుంటే జగన్ వెంట ఇంకా ఎక్కువ మందే కనిస్తున్నారు. అన్నా దీక్ష కంటే జగన్ ఓదార్పుకే ఎక్కువ జనాదరణ కనిపిస్తున్నది. అలాగని అదే నిజమైన జనాదరణ అనుకుందామా? నిజానికి అన్నాను ఇంతమంది అనాలోచితంగా అనుసరించడానికి ప్రధాన కారణం మీడియా సృష్టించిన ఆదర్శవాదం. ఆ భయం ఇవాళ అధికారపార్టీతో సహా అందరినీ వేధిస్తోంది. తెలంగాణ విషయంలో అన్నా పోరాటం కంటే బలమైన ఉద్యమమే నడుస్తోంది. అన్నా ఉద్యమంలో లేని ఆమ్ జనతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టమని కోరుతున్నారు. అన్నా హజారే దేశంలో ఎంతమంది అభివూపాయం తెలుసుకున్నారో తెలియదు గానీ తెలంగాణ ప్రజలు తమ అభివూపాయాన్ని పదే పదే ఈ ప్రభుత్వం ముందు చెప్పారు.

ఆ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కమిటీ కూడా తెలంగాణలో నూటికి నూరు శాతం మంది రాష్ట్రం కావాలంటున్నారని చెప్పింది. అన్నా పద్ధతినే కేసీఆర్ పాటించారు. పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అన్నాకు ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మద్దతు చెప్పలేదు. కానీ తెలంగాణకు సభ నిండా బలం ఉందని ఇప్పటికే రుజువయ్యింది. పైగా తెలంగాణ ప్రజలు పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియను నమ్ముతున్నారు. ఈ దేశంలో అన్ని నిర్ణయాల లాగే తెలంగాణపైన కూడా పార్లమెంటు తన విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలనే వందలాదిమంది తమ నిండు ప్రాణాలు వదులుతున్నారు. అదే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పన్నెండు మంది తమ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలిపారు.

అదే పద్ధతి లో ఇంకా పల్లెపప్లూనా నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అయినా కదలని ప్రభుత్వం అన్నా విషయంలో ఆగమేఘాల మీద పరుగెడుతోంది. సాక్షాత్తూ పార్లమెంటు ముందు, సాయంకాలాలు పాత్రికేయ మిత్రులంతా చేరి చర్చోపచర్చలు జరిపే ప్రెస్‌క్లబ్ ముందే నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా యాదిడ్డి శవమై వేలాడినా ఎవరూ గుర్తించలేదు సరికదా కనీస మానవ మార్యాదలు కూడా పాటించలేదు. కానీ ఇవాళ పాలక వర్గాలు, పత్రికలు, టీవీలు తెల్లవార్లూ అన్నా భజన చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పార్లమెంటుకు ఉన్న విశేష అధికారాల్ని గౌరవిస్తూ ఏళ్ల తరబడి సాగుతోన్న మహోద్యమాన్ని కనీసం పౌర స్పందనగా చూడలేని వాళ్లు ఇవాళ అన్నా హజారే హల్‌చల్‌లో విప్లవాన్ని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ల ప్రయోజనాలు లేవు. ఈ దేశ చరివూతలో సామాన్యులు అనేక విప్లవాలను సృష్టించారు. సృష్టిస్తూనే ఉన్నారు. ఆశ్చర్యమేమిటంటే అవన్నీ విద్రోహకర ఉద్యమాలుగానే చూస్తున్నారు. అదే ధోరణితో అణచివేస్తున్నారు.


ఇవాళ మన పెట్టుబడికి వికసించిన ఈ కొత్త తరానికి ఆకలి, దారిద్య్రం, అంటరానితనం, అసమానతలు అవమానంగా కనిపించవు. రాజ్యాంగం, చట్టాలు, సామాన్యుల హక్కులు, వాటి ఉల్లంఘన అన్యాయమని అనిపించదు. ఒక్క అన్నా హజారేకు తప్ప ఈ దేశంలో ఇంకెవరికీ ఆత్మగౌరవం ఉన్నట్టు వాళ్లు భావించడం లేదు. వాటి కోసం పోరాడే ఓపిక లేదు. ఇప్పుడు వాళ్లకు కావల్సింది ఇన్‌స్టంట్ విప్లవాలు. అన్నా హజారే లాంటి రెవల్యూషనరీస్!!
పొ. ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు

No comments:

Post a Comment