దళితుల విముక్తిలో మిషనరీల పాత్ర
ఆధునిక భారత దేశంలో జ్యోతిబా పూలే, అయోతిదాస్, అయ్యంకలి, నారాయణగురు, అంబేద్కర్ లాంటి వారు కుల వివక్షకు, దోపిడీకి గురైన అట్టడుగు వర్గా ల్లో నూతన చైతన్యాన్ని పురికొల్పి కుల వ్యతిరేక సంఘసంస్కరణ ఉద్యమాలను నిర్మించారు. దళిత బహుజన మేధావులు, ఉద్యమకారులు అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించి సమాన హక్కులు, సమాన విలువలు కలిగిన ప్రజాస్వామికభావాలకు, ఆలోచనలకు పునాదులు వేశారు. బ్రిటిష్ వలసవాద కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రావెంకూర్, బరోడా, మైసూర్, హైదరాబాద్ లాంటి సంస్థానాల్లో 19 వ శతాబ్దపు చివర దశకాల్లో పలు సంఘ సంస్కరణ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. వలసవాద ఆధునీకరణలో భాగంగా క్రైస్తవ మిషనరీలు మొదటిసారిగా దళిత బహుజన వర్గాలకు పాశ్చాత్య విద్యను, విజ్ఞానాన్ని అందించి వారిలో నూతన ఉత్తేజాన్ని, చైతన్యాన్ని పెంపొందించాయి.
నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతంలో దాదాపు 1880 నుంచి ఆంగ్లో- అమెరికన్ మిషనరీలు క్రైస్తవ మత వ్యాప్తిని చేపట్టాయి. ఫలితంగా1880-1940 మధ్యకాలంలో తెలంగాణ జిల్లాల్లో దళితులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులుగా మారిపోయారు. క్రైస్తవ మత వ్యాప్తి వల్ల దళిత వర్గాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో గణనీయంగా మార్పు చోటు చేసుకున్నది.
తెలంగాణ దళితుల స్థితిగతులను వివరిస్తూ ఒక క్రైస్తవ మిషనరీ ‘ది మ్యాన్ విత్ ది బ్రౌన్ బ్లాంకెట్’ అట్టడుగు వర్గాల ప్రతినిధి అని పేర్కొన్నాడు. నిజాం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక దోపిడీ, వివక్షకు గురైన వర్గాల జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించిన పాశ్చాత్య మిషనరీలు ‘ముతక గొంగడి, పూరి గుడిసె’ను వారి ప్రతీకలుగా చిత్రీకరించారు. సామాజిక వెలివేత, మత మౌఢ్యం దళితులను అంధకారంలోకి నెట్టివేయబడిన పరిణామ క్రమాన్ని నిశితంగా పరిశీలించి వారికి వెలుగును ప్రసాదించడం తమ తక్షణ కర్తవ్యంగా మిషనరీలు భావించాయి. హైందవ మతం లో దళితులకు సముచిత స్థానం లభించదు కాబట్టి మతాంతీకరణ అనివార్యమని వారు భావించారు.. 1921 సెన్సస్ ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో 65శాతం మాలలు, 83 శాతం మాదిగలు కులవృత్తి దార్లుగా, వ్యవసాయ కూలీలుగా వున్నా రు. కేవలం 8 శాతం మాలలు, 10శాతం మాదిగలు చిన్న వ్యవసాయదారులుగా పనిచేస్తున్నారు. అక్షరాస్యత ఒక శాతానికి మించిలేదు.
పందొమ్మిదవ శతాబ్దపు మొదటి దశకంలో మొదటిసారిగా బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు ఆంధ్రవూపదేశ్ (విశాఖపట్నం)లో మత మార్పిడులకు శ్రీకారం చుట్టాయి. తెలుగు సమాజంలో ప్రధానంగా దళితులు అత్యధికంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 1880 దశకంలో మిషనరీలు తమ దృష్టిని హైదరాబాద్ రాష్ట్రం మీద కేంద్రీకరించి, హైదరాబాద్- సికింవూదాబాద్ జంటనగరాల్లో మత ప్రచారాన్ని ప్రారంభించారు. నిజాం ప్రభువు ముస్లిం మతస్థుడైనప్పటికీ, అన్యమత ప్రచారానికి అవకాశం కల్పించారు. నాటి ఉన్నత అధికారులు కూడా విశాల దృక్పథంతో బ్రిటిష్ మిషనరీలకు సాయపడ్డారు. నిజాం రాష్ట్రంలోని అత్యున్నత అధికారి సయ్య ద్ మహ్మద్ బిల్‌క్షిగామి అందించిన సహకారాన్ని పాశ్చాత్య మిషనరీలు ప్రశంసించారు. అందువల్ల తెలంగాణలో మొట్ట మొదటి వెస్లియన్ మెథాడిస్టు చర్చి 1880, జూలై మాసంలో రాంకోఠిలో స్థాపించబడింది. దానికి తెలుగు వాడైన జోసెఫ్ కోర్నిలియస్ తన పూర్తి సహకారాన్ని అందించాడు. మొదటగా ఇద్దరు యువకులను బాప్టిజం ద్వారా క్రైస్తవ మతంలో చేర్చుకున్నారు. 1880-85 సంవత్సరాల్లో సికింవూదాబాద్ కంటోన్మెంట్‌లో అనేక మంది సైనికులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.
తెలంగాణ జిల్లాలో క్రైస్తవమతం ప్రజా ఉద్యమంగా మారడానికి మిషనరీల విద్య, వైద్య, ఉపాధి పునరావాస కార్యక్షికమాలు కారణమయ్యాయి. 20వ శతాబ్ద పు మొదటి మూడవ దశకాల్లో వేలసంఖ్యలో దళితులు మతమార్పిడి చేసుకున్నా రు. దళితుల్లో అప్పటికే వైష్ణవ మతం ప్రభావం ఉండటం వల్ల మత గురువులు (మాల దాసరులు) నూతన మతాన్ని స్వీకరించి, గ్రామ గ్రామాన పర్యటించి ఏసుకీస్తు బోధనలను ప్రచారం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో క్రైస్తవ మతానికి ఆదరణ లభించింది. 1920లో నిజాం ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు హిందూ మతాన్ని వదలి క్రైస్తవులుగా మారినారని తెలియ చేసింది. క్రైస్తవ మత ప్రభావం వల్ల దళిత వర్గాలకు భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరిల నుంచి కొంత వరకు విముక్తి లభించింది. మొదటి సారిగా విద్యనభ్యసించిన దళితులు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల్లో, రైల్వే, విద్యాశాఖలో ఉద్యోగాలు పొంది సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించారు. అక్షరాస్యతా పరంగా చూసినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో 1920-30 దశకాల్లో బ్రహ్మణుల తర్వాత క్రైస్తవులే విద్యావంతులుగా నమోదయ్యారు. 1931 హైదరాబాద్ రాష్ట్రం సెన్సస్ ప్రకారం క్రిస్టియన్స్ అక్షరాస్యత 14 శాతంగా నమోదైంది. తెలంగాణ క్రిస్టియన్స్‌లో దాదాపు 75 శాతం దళిత వర్గాలకు చెందినవారే కావడం విశేషం. నిజాం రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రభా వం వల్ల పురుషులతోపాటు దళిత స్త్రీలు కూడా విద్యా, వైద్య రంగాల్లో మొదటిసారి ప్రవేశం పొందారు. మిషనరీ స్కూల్స్‌లో విద్యనభ్యసించిన స్త్రీలు టీచర్స్‌గా, నర్సులుగా పనిచేస్తూ స్వయం ఉపాధి రంగాల్లో ముఖ్య పాత్ర నిర్వహించారు. ‘బైబిల్-జనానా’ మిషనరీలుగా పనిచేసిన స్త్రీలు క్రైస్తవ మతవ్యాప్తికితో తోడ్పడి, చేతి వృత్తుల్లో శిక్షణనిచ్చి స్వయంపోషక సంఘాలను ఏర్పరచి స్త్రీల సాధికారతకు ఎంతగానో తోడ్పడినారు.
క్రైస్తవ మత ప్రభావం వల్ల దళిత వర్గాల్లో నూతన ఆలోచనలు పెంపొందడం వల్ల 20వ శతాబ్దపు తొలిదశకాల్లో ప్రారంభమైన ఆది హిందూ, ఆది ఆంధ్ర ఉద్యమాల్లో దళిత యువకులు చురుకైన పాత్రను పోషించారు. వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన దళిత ఉద్యమ పితామహుడు భాగ్యడ్డి వర్మ క్రైస్తవ మతస్థుల సాంగత్యం తో విద్యావంతుడై విముక్తి పోరాటాలకు నాంది పలికారు. ఆయనతోపాటు ఆది హిందూ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది యువకులు మిషనరీ విద్యా సంస్థల్లో చదివి, రైల్వే, తపాలా ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులుగా, స్కూలు టీచర్లుగా పనిచేసినారు. పాశ్చాత్య విజ్ఞానాన్ని పొందిన ఈ తరం దళిత విద్యావంతులు దోపిడీ, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. స్వాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మసై్థర్యాన్ని పెంపొందించడంలో దళిత మేధావులు చేసిన కృషి మరువరానిది. స్వాతంవూత్యానికి పూర్వం దళిత ఆర్గానిక్ మేధావులను సృష్టించడంలో కుల వ్యతిరేక, దళిత విముక్తి పోరాటాల ఆవిర్భావానికి తెలంగాణ ప్రాంతం లో మిషనరీల కృషి పరోక్షంగా దోహదం చేసిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
పొ. అడపా సత్యనారాయణ
ఉస్మానియా యూనివర్శిటీ
No comments:
Post a Comment