Thursday, September 22, 2011

విశ్వఉద్యమాలయం by పొ. జి. లక్ష్మణ్, ప్రొ. బట్టు సత్యనారాయణ,ప్రొ. ఎస్. మల్లేష్, ప్రొ. హరినాథ్ పొలా Namasethe Telangana 22/09/2011


9/22/2011 12:55:08 AM
విశ్వఉద్యమాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 93 వసంతాలు. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమై 93 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సింహావలోకనం ఇది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలు 1873 లోనే పురుడుపోసుకున్నాయి. దీనికి ఆచరణ రూపం 1918 సెప్టెంబర్ 22న జరిగింది. నాటి ప్రముఖ విద్యావేత్తలు రఫత్‌యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్ఘానీలు దీనికోసం కృషి చేశారు. ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీపాషా వద్ద ప్రధాన మంత్రులుగా పనిచేసిన రెండవ సాలార్‌జంగ్, వికార్ ఉల్ ఉమ్రాలు మొదటిసారిగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే అవి ఎందువల్లనో గానీ కార్యరూపం దాల్చలేదు. 1917లో నాటి ప్రధాని సర్ అక్బర్ హైదరీ ఉర్దూ బోధ నా భాషగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఇవ్వగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఫర్మానా 1918 సెప్టెంబర్ 22 నాడు జారీ చేశారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయంలో ఒక దేశీయ భాష ఉన్నత విద్యారంగంలో బోధనా భాష కావడం ఉస్మానియా యూనివర్సిటీతోనే ప్రారంభమైంది. విశ్వవిద్యాలయంలో ఒక దేశీయ భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టాలని నిజాం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వకవి రవీంవూదనాథ్ ఠాగూర్ లాంటి వారు హర్షించారు. గతంలో పాకిస్థాన్ అధ్యక్ష పదవిని అలంకరించిన గులామ్ మహ్మద్‌తోపాటు పీవీ నర్సింహారావు, వీరేంవూదపాటిల్, ఎస్‌బీ చవా న్, మర్రి చెన్నాడ్డి తదితరులు ఉర్దూ మాధ్యమంలోనే తమ చదువులను కొనసాగించారు. విశ్వవిద్యాలయంలో బోధనా భాష ఉర్దూ కావడంతో వేలా ది ఇంగ్లీషు గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించవలసిన అవసరం ఏర్పడింది.

మౌల్వీ అబ్దుల్ హక్ నేతృత్వంలోని కమిటీ వేలాది ఇంగ్లిష్ గ్రంథాలను ఉర్దూలోకి అనువదించింది. ప్రప్రథమ వైస్ చాన్సలర్‌గా ప్రముఖ విద్యావేత్త మౌలానా హబీబుర్ రహ్మన్ ఖాన్ షేర్వా ని నియమితులయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ఇతర కళాశాల భవనాలకు వాస్తుశిల్పులు నవాబ్ జైన్‌యార్ జంగ్, సయద్ అలీ రజీలు రూపకల్పన చేశారు. ఆర్ట్స్ కళాశాల భవనం గొప్ప వాస్తు కళాఖండంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంది.1948లో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఆ తర్వాత కొద్దికాలానికే తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో విలీనం అయి 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిం ది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ చరివూత లో ప్రథమ అధ్యాయం ముగిసింది.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం తన పూర్వ వైభవా న్ని కోల్పోతూ వచ్చింది. దీని ద్వితీయ అధ్యా యం 1956 నుంచే ప్రారంభమైందని చెప్పా లి. ఆంధ్రవూపదేశ్ ఏర్పడగానే స్థానిక తెలంగాణ వారిని కాదని కోస్తాంవూధకు చెందిన దున్నగాని సదాశివడ్డి (డి.ఎస్.డ్డి)ని ఇక్కడ ఉపకులపతిగా నియమించారు. 1956-69 వరకు స్థాని క తెలంగాణ వారిని ఎవ్వరిని కూడా ఉపకులపతులుగా నియమించలేదు. 1969 తెలంగా ణ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ప్రాంతం వాళ్లను ఇక్కడ ఉపకులపతులుగా నియమించడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలుగా ఉన్న గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి బదలాయించారు. అలాగే ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్నటువంటి అగ్రికల్చర్, వెటర్నరి డిపార్టుమెంట్లను రాజేంవూదనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తరలించారు. అలాగే ఫైన్ ఆర్ట్స్‌ను జెఎన్‌టియుకు బదలాయించడంతో విశ్వవిద్యాలయం కుదింపుకు గురైంది. దీనికి తోడుగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొత్త విశ్వవిద్యాలయాలు రావడంతో ఒకప్పుడు తెలంగాణ మొత్తంగా వ్యాపించినా దాని పరిధి కృషించి కేవలం హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలకే పరిమితమైంది. ఒకప్పుడు1223 మంది బోధనా సిబ్బందితోపాటు 2500 మంది బోధనేతర సిబ్బందితో కళకళలాడిన విశ్వవిద్యాలయం ఇప్పుడు కేవలం 642 మంది బోధనా సిబ్బందితో దినసరి వేతన బోధనేతర సిబ్బందితో కళావిహీనమైంది.

1918లో ఉస్మానియా యూనివర్సిటీని నెలకొల్పినప్పుడు నిజాం జమిస్థాన్‌పూర్, బాగ్ అంబర్‌పేట, రామంతాపూర్, హబ్సిగూడ, లాలాగూడాలలోని 2032 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చారు. దీనికి తోడు కోఠి మహిళా కళాశాల, నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, సికింవూదాబాద్ కాలేజీ, బేగంపేట నిజామియా అబ్జర్వేటరిలతో కలిపి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఒక్క ఎకరం కూడా అన్యాక్షికాంతం కాలేదు. యూనివర్సిటీ భూములు అన్యాక్షికాంతం కావడం అనేది ప్రారంభమైంది కేవలం 1956 తర్వాతనే. యూనివర్సిటీ భూములు మూడు విధాలుగా అన్యాక్షికాంతమయ్యాయి. 1) యూనివర్సిటీ భూముల్లో వెలిసిన ప్రభుత్వ సంస్థలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, టెలిఫోన్ ఎక్సేంజి, ఆర్.టి.సి హాస్పిటల్, హుడా, స్టేట్ ఆర్కేవ్స్, దూరదర్శన్ మొదలైనవి. 2) ఓయూ క్యాంపస్‌లో వెలసిన ప్రైవేట్ సంస్థలు-ఆంధ్ర మహిళాసభ కళాశాల, తెలుగు భాషా సమితి, సురభారతి, సత్యసాయి పబ్లిక్ స్కూల్, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ మొదలైనవి. 3) రామయ్య చౌదరి, శేషుబాబు, వల్లూరి కేశవరావు, తుమ్మల కృష్ణారావు, బండి వెంకట రామారావు లాంటి కోస్తాంధ్ర భూబకాసురలచే కబ్జా అయిన యూనివర్సిటీ భూములు.

వీరిచే కబ్జా అయిన ఓయూ భూముల విషయంలో యూనివర్సి టీ అధికారులు జస్టిస్ చెన్నప్పడ్డి ఏకసభ్య కమిషన్‌ను కూడా నియమించా రు. యూనివర్సిటీ భూములు యథేచ్ఛగా కబ్జా అవుతున్నట్టు కమిషన్ నిర్ధారించి, యూనివర్సిటీ అధికారులు ఈ విషయాల్లో సరిగ్గా స్పందించడం లేదని వాపోయింది. విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు దీనికి ప్రభుత్వం కేటాయించిన భూమి 2032 ఎకరాలైతే నేడు సగం భూములు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు భూ బకాసురుల చేతుల్లోకి పోయాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే గాక ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించిం ది. వందేమాతర ఉద్యమం పురుడు పోసుకున్నది ఇక్కడే. ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇక్కడి విద్యార్థులను కళాశాల నుంచి తొలగిస్తే పక్కనే ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వాళ్లకు అడ్మిషన్ ఇవ్వలేదు. బనారస్ యూనివర్సిటీ, మద్రాసు యూనివర్సిటీలు తిరస్కరించినా నాగ్‌పూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కేదార్‌నాథ్ వారిని అక్కున చేర్చుకుని అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. ఈ విధంగా నాగ్‌పూర్ యూనివర్సిటీకి వలసపోయిన ప్రముఖుల్లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఒకరు. తెలుగు ప్రాంతంలో 1951వరకు సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో ఇక్కడి విద్యార్థులు క్రియాశీలక పాత్రే నిర్వహించారు. 1952 ముల్కీ ఉద్యమంతోపాటు 1969 తెలంగాణ రాష్ట్రం కావాలని నినదించింది ఇక్కడి విద్యార్థులే. మలిదఫా తెలంగాణ ఉద్యమానికి అవసరమైన రచనలు చేసింది ఇక్కడి అధ్యాపకులే. ఏ ఉద్యమమైనా, ఏ పోరాట రూపమైనా ఉద్యమ రచనలకు ఉస్మానియానే ఊపిరులూదింది.

ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలం సహజవనరులతో పాటు విద్యావసతులపై ఆధారపడుతుంది. నేడు దేశంలోని చాలా రాష్ట్రా లు ప్రగతి పథంలో పయనించేందుకు ఎన్నారైల పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయి. వ్యక్తు లు ఎన్నారైల స్థాయికి ఎదిగే సామర్థ్యాన్ని విద్యాపరంగా చేకూర్చేవి విశ్వవిద్యాలయాలే. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను కోల్పోయింది. సిబ్బంది తగ్గింది. దానికితోడు ప్రభుత్వం సాలీన యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్ గ్రాంట్ 134 కోట్ల నుంచి 113 కోట్ల కు తగ్గించింది. ఇన్ని అవరోధాలున్నా యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు తగ్గలేదు. ఇటీవలి కాలంలో ఇండియాటుడే వారు నిర్వహించిన సర్వేలో జాతీయస్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ ఏడవ ర్యాంకు సాధించింది. విద్యా ప్రమాణాలు ఆశించినస్థాయిలో ఉన్నాయి కాబట్టే దేశంలో ఏ విశ్వవిద్యాలయంలో కూడా లేనంతమంది విదేశీ విద్యార్థులు ఇక్కడున్నారు. 79 దేశాలకు చెందిన 4000 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.

ప్రభుత్వం వివక్షకు స్వస్తి పలికి సరిపడా నిధులను సకాలంలో విడుదల చేసినట్లయితే, యూనివర్సిటీ మరింత పురోగతి సాధిస్తుంది. దీని కోసం ప్రభుత్వంతో పాటు పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకుల కృషి ఎంతో అవసరం. విద్యావూపమాణాలతోపాటు సామాజిక బాధ్యతలను భుజం మీద వేసుకుని ముందుకు నడుస్తున్న ప్రపంచంలోని గుర్తింపున్న కొన్ని అరుదైన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. నేటితో 93 వసంతాల పూర్తి చేసుకుంటున్న ఈ విశ్వవిద్యాలయానికి అధ్యాపకుల అక్షరమాల.
పొ. జి. లక్ష్మణ్, ప్రొ. బట్టు సత్యనారాయణ,ప్రొ. ఎస్. మల్లేష్, ప్రొ. హరినాథ్ పొలాస, ప్రొ. ఎం. వెంక
(ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభించి నేటికి 93 ఏళ్లు)

No comments:

Post a Comment