Thursday, September 8, 2011

కాళోజీ (అను) వాదం Namasethe Telangana 09/09/2011

కాళోజీ (అను) వాదం
‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు ప్రచురించిన గ్రంథం. అంతకు పది సంవత్సరాల పూర్వం ఎచ్.ఎన్. బ్రెయిల్స్‌ఫర్డ్ అనే రాజకీయ విశ్లేషకుడు ఒక ఏడాదిపాటు భారతదేశాన్ని పర్యటించి ఇంగ్లిషులో రాసిన పుస్తకమిది.
kaloji-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ పుస్తకానికి వెల్దుర్తి మాణిక్యరావుగారు రాసిన చిన్న ‘పరిచయము’(మొదటి ముద్రణకు ముందుమాట)ను మించి ఇన్నాళ్ల తర్వాతైనా కొత్తగా రాయవలసింది ఏమీలేదు. ఈ సంవత్సరం వెల్దుర్తి మాణిక్యరావుగారి శతజయంతి. హైదరాబాద్‌లో బూర్గుల రంగనాథరావు, నెల్లూరి కేశవస్వామి, భోగి నారాయణమూర్తి తదితరు కలిసి ఆయన 1960ల దాకా ‘సాధన సమితి’ పేరుతో సాహిత్యసంస్థను నిర్వహించారు. తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని చిత్రించిన తొలితరం కథారచయితలు కాళోజీ, వట్టికోట ఆయన సన్నిహిత మిత్రులు. కాళోజీ, ఆళ్వారుస్వామిల రచనలన్నీ కూడా వెలుగు చూస్తున్న సందర్భంగా కాళోజీ అనువదించిన ఈ పుస్తకం కూడా వెలువడడం కాళోజీ అభిరుచిని, (ముఖ్యంగా యువకుడుగా ఉన్న రోజుల్లో) అనువాదశక్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ డ్బై ఏళ్లలో తెలుగుభాష, పదిహేనేళ్లుగా తెలంగాణ భాషలు ఎంత వైవిధ్యంతో వికసించి సుసంపన్నమయ్యాయో పోల్చుకోవడానికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపకరించి, వెల్దుర్తి కాళోజీల వారసత్వాన్ని మనం ఇంకెంత ముందుకు తీసుకపోయామో కదా అని మనమీద మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తెలంగాణ వాక్య రచనలోను, తెలంగాణ భాషలోకి అనువాదం చేయడంలోను మనం కాళోజీ భుజాల మీద నిలబడగలిగామని కూడా మనకు గొప్పనిపిస్తుంది.

అయితే అది ఏ తెలుగు రచయితదయినా కావచ్చు గురజాడ మొదలు సురవరం ప్రతాపడ్డి దాకా అది ఆనాటి శైలి, ఆనాటి వాక్య రచన. మనం కర్త, కర్మ, క్రియలు నిండుగా ఉండే వాక్యాల నుంచి చాలా ముందుకొచ్చాం. మనిషే ఒక శైలి అన్నట్లుగా ఎవరి మౌఖికభాష వాళ్ల పుస్తకభాషగా దూసుకొస్తున్న కాలమిది. కనుక ఈ కాలంలో ఎంతో చిత్తశుద్ధితో, మూల గ్రంథం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు తెలిసిన ఒక తిరుగుబాటుదారు చేసిన గ్రాంథికశైలి అనువాదం మనకాయనపట్ల గౌరవాన్ని పెంచుతుంది. పత్రికలతో సహా ఏ అనువాదకుడూ వెనుకాడకుండా ఉపయోగించే రౌండ్ సమావేశం అనేమాటను గుండ్రబల్ల సమావేశంగా అనువాదం చేయాలన్నంత పట్టింపు చూస్తే ముచ్చపుస్తకం తెరవగానే వెల్దుర్తి మాణిక్యరావుగారి ముందుమాటలోనే ఒక దీర్ఘ చతురస్రం (బాక్స్‌గట్టి)లో ‘చదువరీ! ఈ పుస్తకములోని లోట్లన్నియు నావి అని అనువాదకుడు ప్రకటించుకున్నాడు.

ఈ క్రమశిక్షణ, వినయం ఒక ప్రాపంచిక దృక్పథం ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్యమ జీవితం ఉన్నవాళ్లకే సాధ్యమవుతుంది. జాతీయోద్యమం, నైజాం వ్యతిరేక పోరాటకాలంలో అది మనం అందరిలోనూ చూడవచ్చు. ముఖ్యంగా సత్యాక్షిగహుల్లో సాయుధపోరా టం ఎంచుకున్నవారిలో, గాంధీజీ అనుయాయుల్లో, భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకున్నవాళ్లలో.పుస్తకం అనువాదం చేయడానికి కాళోజీ ఎంచుకున్నదే బ్రెయిల్స్‌ఫర్డ్‌ను. గాంధీజీ పట్ల, ఆయన సత్యాక్షిగహ మార్గం పట్ల ఉన్న అపారమైన గౌరవం వల్ల. ఆయన సబర్మతీ ఆశ్రమం చూడడానికి వచ్చి.. దేశమంతా తిరిగినట్లున్నాడు. ఆయన గాంధీజీ వైపునుంచే దేశాన్నంతా చూశా డు. కాకపోతే పాశ్చాత్య, అందులోను బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి వచ్చినవాడు కాబట్టి, పారిక్షిశామిక విప్లవ నేపథ్యం ఉన్నవాడు కాబట్టి గాంధీజీ గ్రామ స్వరాజ్యం, ఆర్థిక విధానాలు ఆయనకు ఆచరణ సాధ్య మా! అని వింతగా కనిపిస్తాయి. కాని కొట్టిపారేయడు.

కాళోజీ వాటిని నమ్మినవాడు. సత్యాక్షిగహాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని. కాకపోతే సత్యాక్షిగహం చేయడానికి సాయుధపోరాటం చేయడానికన్న ఎక్కువ వైయ్యక్తిక సాహసం కావాలంటాడు. సాయుధ పోరాటం చేయడానికి ఒక గుణాత్మక పరిణామం వచ్చి ఒక సామూహిక సమాజానికే చైతన్యం, తెగింపు వచ్చి, నిన్నటిదాకా నీ బాన్చెన్‌దొరా అన్న వెట్టి మనుషులు, మట్టి మనుషులు, బానిసలు సంకెళ్లు తెంచుకొని ‘ఇగ ఎగబడదామురో’ అని తిరుగబడడం ఒక ఎత్తు. సత్యాక్షిగహానికి సత్యం పట్ల అచంచల విశ్వాసం, దానికి తగిన ధార్మిక ఆగ్రహం కావాలి. కాళోజీ తరచుగా ఉదహరించే గాంధీజీ మాట ‘పిరికితనం కన్నా పతి)హింస ఎంచుకోదగింది’ (I Prefer voilence to cowrdice). కాళోజీ గాంధీకన్నా ఒక అడుగు ముందుకు వేసి సత్యాక్షిగహం విఫలమైనచోట సాయుధపోరాటమే-వూపహ్లాదుడు రాజీలేకుండా నిలబడితే ఉగ్రనరసింహుడే వచ్చి పరిష్కరిస్తాడు.

ఆయన ప్రహ్లాద చరిత్ర మనసుకు పట్టిన కాలం నుంచి ఆఖరి శ్వాస దాక నమ్మిన సిద్ధాంతమదే. (‘సత్యాక్షిగహమో, చారుమజుందారీయమో’) .ఈ పుస్తకమంతా 1930లో దేశవ్యాప్తంగా సత్యాక్షిగహ ఉద్యమం పెల్లుబుకుతున్న కాలం. ఉప్పు సత్యాక్షిగహం, విదేశీ వస్తు బహిష్కరణ ఎంత విస్తృతంగా అమలవుతున్నాయో వెల్దుర్తి అలతి పదమ్ముల అనితర సాధ్యంగా చెప్పాడు. ఎందుకిట్లా దేశమంతా ఈ గాంధీజీ సత్యాక్షిగహ మంత్రోపదేశంతో కదిలారో తాను స్వయంగా చూసి అధ్యయనం చేయడానికి రచయిత ఒక ఏడాదిపాటు దేశమంతా తిరిగాడు. దేశ పరిస్థితులు ఒకవైపు కడుదయనీయంగా ఉన్నాయి. కాని ఒక వెనుకబడిన స్వతంత్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రైతు కేంద్రంగా వృత్తుల మీద ఆధారపడిన జీవితం ఇంగ్లిషువాని జోక్యంతో, రాజకీయార్థిక దాడులతో ఛిన్నాభిన్నమయింది. తకిలీకి, రాట్నానికి, మగ్గానికి, మాంచెస్టర్, ల్యాంక్‌షైర్‌ల మిల్లులు ఎటువంటి ఉపవూదవాన్ని తెచ్చాయో.. గాంధీజీ ఆ రాట్నాన్ని, తకిలీని ప్రచారం చేసి చూపించాడు. విలాసవంతులు కూడా గుట్టలుగా పోసి విదేశీ వస్త్రాలను బహిష్కరించారు. కాసేపు ఈ పుస్తకాన్ని, సంస్థానాలను మినహాయించి 1930ల దేశస్థితితో కాకుండా మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అవసరాల దృష్ట్యా చదువుదాం.

ఇవ్వాళ్టి ప్రజాస్వామిక ఉద్యమానికి ఒక కరదీపికగా ఉందీ పుస్తకం. కనీసం రెండు సంవత్సరాలుగా మనం వలసపాలనకు సహాయ నిరాకరణం చేద్దామని చెప్పుకుంటున్నాం. శాసనోల్లంఘన చేద్దామంటున్నాం. బలవత్తరమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా డ్బై ఏళ్ల క్రితం ఈ దేశ ప్రజలు ఎంతో అపూర్వంగా అవి చేసి చూపారు. ఈ పుస్తకం ముగిసే నాటికి (1931) ఆ పోరాటం ఒక గుండ్రబల్ల సమావేశానికి దారితీసింది. దేశానికి స్వయం పాలన యిచ్చి బ్రిటిష్‌వాడు వెళ్లిపోతాడన్న విశ్వాసం కలిగింది. ఒక్క గాంధీజీ మీదనే కాదు, ఈ పుస్తకం మేరకే చూసినా సుభాష్‌చంవూదబోసు, జవహర్‌లాల్ నెహ్రూ మొదలు బెంగాల్‌లో విప్లవకారుల వరకు ప్రజలకు నాయకత్వం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది.

ఈస్టిండియా కంపెనీతో మొదలైన కంపెనీల పరిపాలన ఇవ్వాళ మనదేశంలో అక్టోపస్ వలె విస్తరించింది. నిన్న రాచపుండు ఇవ్వాళ క్యాన్సరయ్యింది. తెలంగాణ ఉద్యమం తెలియక వలసాంధ్ర పాలన అన్నా, తెలిసి ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ సంపన్న వర్గాల దళారీ పాలన అన్నా మనమంతా మానసికంగా వ్యతిరేకిస్తున్నది వలసపాలనను అంటే కంపెనీల పాలనను.

1996 నుంచే,పదిహేనేళ్లుగా ప్రజాస్వామికంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చంవూదబాబు ప్రపంచబ్యాంకు సిఇవోగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చిన వైనంతో ప్రారంభమై వైఎస్‌ఆర్ కంపెనీల కోసం ‘జలయజ్ఞం’ పేరుతో రక్తయజ్ఞం నిర్వహించిన దుష్పరిణామాలను ప్రతిఘటించడానికే.

ఒక్కసారి ఈ పుస్తకంలోని శీర్షికలు చూడండి-రాట్నం, మద్య నిషేధం, విదేశీవస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాక్షిగహం. రాట్నం-మగ్గం గా, మరమగ్గంగా విస్తరించి సిరిసిల్ల నుంచి పోచంపల్లి దాకా ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ,మైక్రో అప్పుల మాయాజాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలు కావా? మద్యపాన నిషేధం ఇవ్వాళ బెల్టుషాపుల విశ్వరూపం ముందు ఎంత తీవ్రస్థాయిలో చేపట్టవలసిన ఉద్యమమవుతుంది? ఇవ్వాళ్టి పాలనే మైన్ (మైనింగు)లది, వైన్‌లది.
ఇవ్వాళ దేశ వ్యాప్తంగా సమువూదతీర ప్రజలందరూ చేస్తున్నది ఉప్పు సత్యాక్షిగహం.ఇది కేవలం ఉప్పుమీద పన్నువేయడం దగ్గర ఆగింది కాదు. ఇప్పుడు ఉప్పు బహుళజాతి కంపెనీలది. బడా కంపెనీలది.

ఉప్పుమీద పన్ను వేసినపుడు బార్డోలీ (గుజరాత్ సమువూదతీరం) దాకా చరివూతాత్మకమైన సత్యాక్షిగహం చేసి తామే ఉప్పు పండించుకుంటామనడమే కాకుండా గాంధీజీ పన్నుల నిరాకరణకు కూడా పిలుపు ఇచ్చాడు. సత్యాక్షిగహం అనే నాణానికి మరోవైపు శాసనోల్లంఘనం, పన్నుల నిరాకరణ. ముప్ఫైలో రచయి త కళ్లార చూసి చిత్రించిన ఈ పోరాట రూపాలన్నీ ఇవ్వాళ తెలంగాణలో అంటే చిత్తశుద్ధితో ఆచరించడానికి ఈ పుస్త కం ఒక ఉత్తేజాన్నిస్తుంది.

గులాంనబీ ఆజాద్ ఆంవూధవూపదేశ్ వ్యవహారాలు చూసే మంత్రిగానో, కేంద్ర దూతగానో చేస్తున్న చర్చల వంటివే ఇంగ్లాండులో రౌండ్ సమావేశాలు జరిగాయి. ఇప్పటివలె అవి కాంగ్రెస్‌కే పరిమితం కాలేదు. గాంధీ, జిన్నా, అంబేద్కర్‌లయినా పాల్గొన్నారు. ఏమయినా ఆ గుండ్రబల్ల సమావేశ నిర్ణయం ‘నిరోధించదగినంత పాడుగను, అవలంబించదగినంత మంచిగను ఉండనిచో.. భవిష్యత్తు పూర్తిగా భూతకాలము వలెనే ఉండగలదు.. ప్రస్తుతము జరిగినట్లే జరుగును. పదవుల కొరకు, ఆదాయము కొరకు ప్రాకులాడువారే ఆ అవకాశముతో లాభమొందెదరు.. ఇట్లు ప్రభుత్వ వర్గములలో పలుకుబడి సంపాదించుకొనినవారు ఒకరి తరువాతనొకరు మంత్రిత్వమును స్వీకరింతురు.. ఆర్థిక పరిస్థితి బాగుపరుచుటకై పొదుపు చేయుదుమని పురాతనమగు నెపములు చూపబడును.

విద్యావ్యాప్తి, ఆరోగ్యవంతముగా జీవనము గడుపు విధానము, బాధ పారిక్షిశామికులకు ఉండుటకై మంచి గృహవసతి మొదలగు అత్యవసరమైన పనులను డబ్బులేదని తలపెట్టరు. పన్నుల భారమే రైతుల పై నుంచి తగ్గించి ధనికవర్గము పైనను, జమీందారుల పైనను మోపబడదు. భూమి పన్నులలో ఏ మాత్రము మార్పు జరుగదు... ఒక్క మార్పు గలుగును. ధనిక వర్గమునకు చాలా లాభదాయకముగానుండును’. (చూ. పే. 103,104) 
చర్చలకు పోరాటం దారితీస్తే..ఆ చర్చలలో పోరాట ఆకాంక్షలు వ్యక్తమయ్యే నిర్ణయాలు జరుగుతాయి. ఆ చర్చలలో పోరాటశక్తుల ప్రతినిధులు పాల్గొనాలి. అటువంటి సందర్భాల్లో కూడా పోరాట ఆకాంక్షలను అణచివేసే రాజ్య వైఖరినే మనం ఇటీవల రెండు సందర్భాల్లో చూశాం. పోరాటాలు ముప్ఫై ఆదర్శాలను ప్రతిఫలించినప్పుడు చర్చలూ అట్లాగే ఉంటాయి. ఫలితాలూ అట్లాగే ఉంటాయి.

కాళోజీ సత్యాక్షిగహోద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా డ్బై ఏళ్ల రాజ్యవ్యతిరేక ప్రస్థానం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన అనువాదాన్ని మనం పోరాట ఆచరణలోకి అనువదించుకోవడానికే ఈ మలిమువూదణ.
(హెచ్.ఎన్‌బెయిల్స్ ఫర్డ్ రాసిన ‘నా భారతదేశ యాత్ర’ పుస్తకాన్ని కాళోజీ 1941లో అనువాదం చేశారు. దానిని పునర్‌ముద్రిస్తున్న సందర్భంగా దానికి వరవరరావు రాసిన ముందుమాట నుంచి..) 
(నేడు కాళోజీ జయంతి)

No comments:

Post a Comment