Thursday, September 22, 2011

ఎర్రకోటపై అస్తిత్వ పతాకం by - జూలూరు గౌరీశంకర్ Namasethe Telangana 22/09/2011


9/22/2011 12:51:35 AM
ఎర్రకోటపై అస్తిత్వ పతాకం
కెసిఆర్ పుట్టింది సిద్దిపేటలో కావచ్చు. కానీ ఇప్పుడతనిని పట్టుకొని నీదేఊరంటే విస్తారమైన తెలంగాణ నేలను చూపుతారు. ఇది అందరికీ అందని అదృష్టం. ఆ అదృష్టం కెసిఆర్ కొట్టేశారు. కెసిఆర్‌పైన అందరికీ కొన్ని విషయాలల్లో అభ్యంతరాలు ఉన్నట్లుగానే నాకు ఉన్నాయి. ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు, అసెంబ్లీ సాక్షిగానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీనిమీద ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎవరినుంచి ఎన్ని బలాలను అందించినా కెసిఆర్ మాత్రం తెలంగాణ విషయంలో అసాధారణశక్తి. ఎందుకంటే వందరకాల రాజకీయాల మధ్య, వేయిరకాల ఎత్తుగడల మధ్య పలురకాల జెండాల, పలురకాల ఊహాగానాల మధ్య తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉక్కపోతకు గురవుతున్నది. కెసిఆర్, తెలంగాణ జేఏసీ సారథి కోదండరాం నేతృత్వం మీద మొత్తం తెలంగాణ సమాజానికి నమ్మకం ఉన్నది. అదేవిధంగా వారి మీద కావల్సినన్ని విమర్శలూ ఉన్నాయి. పోరాట జెండా పట్టుకున్న వారికి, ఎన్నికలతో అస్తి త్వ పోరాటం కొనసాగించే వారికి మధ్య వందరకాల తేడాలు, చర్చలు, భేదాలు, విభేదాలు ఉంటాయి. దాన్నెవ్వరూ కాదనలేరు. ఈ రెండు రైలు పట్టాలు ఒక్కటి కావటం అసాధ్యం. ఈ రెండు రైలు పట్టాల మీంచి నడుచుకుం టూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ఇంజ ను ముందుకు సాగటంఅద్భుత చారివూతక ఆవిష్కరణ. ఆ కోణంలోనే పలు రకాల విభేదాలు, సైద్ధాంతిక రాపిడీల మధ్యనే విప్లవ సంస్థలు, తెరాస కలిసి ఒక ప్రజాస్వామిక ఉమ్మడి ఆకాంక్ష కోసం పనిచేస్తునాయనుకుంటా! అందులో భాగంగానే ఖమ్మంలో ‘పోరు గర్జన’ సభ జరుగబోతున్నది.

విప్లవోద్యమ భావజాల గ్రూపుల మధ్య కూడా బోలెడన్ని విభేదాలున్నా యి. సంఘర్షణలున్నాయి. ఆయా పార్టీలు ఎత్తుగడల విషయంలో విప్లవోద్యమ గ్రూపులు సంఘర్షించుకునేంతగా మరే గ్రూపులు సంఘర్షించుకోవనుకుంటా! ఇది ఈ ఐదు దశాబ్దాల విప్లవోద్యమం స్పష్టంగా ఆచరణాత్మకంగా తెలియజేస్తున్నది.ఈ చర్చంతా ఇప్పుడెందుకు? న్యూడెమోక్షికసీకి, టిఆర్‌ఎస్ కు ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. కానీతెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో మాత్రం ఈ రెండు ఏకమై పోరాడుతూ పిడికిలి బిగించాయి. ఇది ఒక అపురూపమైన చారివూతక సందర్భం. ఇది ఎవరూ ఊహించని అద్భుత అవిష్కరణ.
సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్షికసీ రాష్ట్రనేత పోటు రంగారావు నా కాలేజీమేట్. ఇద్దరం కలిసి కోదాడలోని కెఆర్‌ఆర్ కళాశాలలో కలిసి చదువుకున్నాం. ఇద్దరం పిడిఎస్‌యు భావజాలంతో మునిగి తేలినోళ్లం. ఆయన విప్లవోద్యమంలో సీరియస్ కార్యకర్తగా మారాడు. నేనేమో జర్నలిస్టుగా, కవిగా తయారయ్యాను. ఈ తెలంగాణ సందర్భంలో ఐదేళ్ల క్రితం నా మిత్రుడు పోటు రంగారావు పై ఒక వ్యాసం రాశాను. ‘రంగారావు జాజు డబ్బా తీసుకొని రా, ఖమ్మం ఖిల్లాపై జై తెలంగాణ’ రాద్దామని ఓ దిన పత్రికలో వ్యాసం రాశాను. నా మిత్రుడు రంగారావు కూడా ఘాటుగా స్పందించాడు. మా ఇద్ద రి మధ్య చర్చ జరిగిన కొన్ని నెలలకు సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్షికసీ పార్టీ ‘జై తెలంగాణ’ అన్నది. అప్పుడు నాకు పట్టరాని సంతోషమేసింది. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయంతో, తెలంగాణ కొత్త కదలిక వస్తుందని నమ్మిన అనేక మందిలో నేనొకణ్ణి.

ఖమ్మం జిల్లా అంటే ‘ఆకాశం ఆంధ్ర, నేల తెలంగాణ’ అని పదేళ్ల క్రితమే నా మిత్రులు ప్రసేన్, సీతారం, వంశీకృష్ణ రాసిన వ్యాసం ఎప్పటికీ మరువలేనిది. ఈ సందర్భంలో ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? అది ఇప్పుడు ఖమ్మంలో జరిగే పనేనా? ఖమ్మంలో తెలంగాణ ఉద్యమ సెగలు ఎప్పుడు లేవాలి? అని గొణుక్కుంటున్న సందర్భంలో 2009లో కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష ఖమ్మం జిల్లాకు ఒక పరీక్షా సమయమైంది. ఆ సమయంలో మా రంగారావు, న్యూడెమోక్షికసీ, పిడిఎస్‌యు, పివైఎల్, యువకు లు చేసిన కృషి మరువలేనిది. కెసిఆర్‌ను ఖమ్మం జైల్లో వ్యూహాత్మకంగా బంధించారు. ఖమ్మంలో టిఆర్‌ఎస్ బలహీనంగా ఉందని, అక్కడ నిరసన జ్వాలలు అంతగా ఎగియవని ప్రభుత్వం భావించి ఉంటుంది. కానీ పాలకు ల, పోలీసుల వ్యూహం తలకిందులయింది. ఖమ్మంలో టిఆర్‌ఎస్ కంటే న్యూడెమోక్షికసీ ఆ సమయంలో స్పందించిన తీరు ఊహించని విధంగా తెలంగాణ ఉద్యమానికి పెద్ద కదలిక తెచ్చింది. ఇది టిఆర్‌ఎస్ కూడా ఊహించి ఉండదనుకుంటాను. మొత్తం మీద ఖమ్మం గడ్డ మీద చేసిన ఆ గర్జనతో కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష కూడా గట్టిపడ్డది. రాష్ట్రసాధన ఉద్య మం ఎరుపెక్కటానికి న్యూడెమోక్షికసీ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించింది.

ఒక పక్క విద్యార్థుల ఆత్మబలిదానాలు, ఆర్ట్స్ కళాశాలలో రగిలిన అగ్గి, కాకతీయలో అంటుకున్న సెగలు, తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో మంటలు మండే విధంగా చేసింది. తెలంగాణ గుండె మండింది. అసెంబ్లీ ముట్టడి పిలుపు, మరోపక్క కెసిఆర్ నిరాహారదీక్ష మొత్తంగా రగులుతున్న నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు కేంద్రం తలవొగ్గిన తర్వాతనే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పారంభమౌతున్నట్లు చిదంబరం ప్రకటన వెలువడింది. ఖమ్మంలో విద్యార్థుల ‘పోరుకేక ను’ పిడిఎస్‌యు వేలాది మందితో నిర్వహించింది. ఇంకో పక్క టీఎన్జీవోలు, తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులకు స్పందిస్తూ వాళ్లకు అండదండగా న్యూడెమోక్షికసీ అడుగులు వేసింది. అరుణోదయ కళారూపాలకు, తెలంగాణ పాటలు తొడిగి ఆటపాటలతో ధూం ధాంలతో గొంతెత్తారు. వేయి డప్పులతో ఇందిరాపార్క్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దాకా అరుణోదయ మోగించిన డప్పుల శబ్దం తెలంగాణ ఆకాంక్షలను ప్రతిధ్వనించింది.
నేడు ఖమ్మంలో జరుగబోతున్న భారీ బహిరంగసభతో తెలంగాణ ఉద్యమంలో న్యూడెమోక్షికసీ తనదైన ప్రత్యేక ముద్రను వేయనుంది. ఎర్రజెండా ల రెపపల వెలుగుల్లో త్యాగాల దారిలో ముందుకు సాగుతున్న విప్లవోద్యమ రథానికి తెలంగాణ జెండాకట్టి నినదిస్తూ న్యూడెమోక్షికసీ ముందుకు సాగుతున్నది. ఈ ఉద్యమంలో జరుగుతున్న లోపాలను ఎప్పటికప్పుడు సవరించటానికి ఈ న్యూడెమోక్షికసీలు అవసరమవుతాయి. ప్రజలంతా ముక్తకం ముందుకు సాగుతున్న సమయంలో ఆ ప్రజాసమూహం వెంట సేవకుడిగా రావడమే న్యూడెమోక్షికసీలో ఉన్న పరిణతిగా చూడవచ్చును. అన్ని రాజకీ య పార్టీలు ఇలా ప్రజల వెంట, తెలంగాణ ఉద్యమం వెంట న్యూడెమోక్షికసీ లాగా అడుగులు వేస్తూ ముందుకు నడిస్తే ఎంతో బాగుండు.

ప్రజల పక్షాన నిలబడ్డ కార్యకర్తలే కొత్త చరివూతకు ద్వారాలు తెరువగలరు.తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ అలుపెరగని పోరాటం చేసేవాళ్లే హీరోలు.న్యూడెమోక్షికసీ తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో వీరోచిత పాత్రను పోషించాలి. తెలంగాణ ఉద్యమరథ చక్రాలను కదిలించుకుంటూ ముందుకు సాగుతున్న ఆ పోరుగర్జనకు రెడ్ సెల్యూట్. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమ జైత్రయాత్ర మొదలైంది. మిలియన్ మార్చ్ మార్గంలో జనం మార్చ్ చేస్తుండ్రు. నూతన తెలంగాణ ఆవిష్కరణకు న్యూడెమోక్షికసీ ఎర్రజెండాను ఎగురవేసింది. ఉద్యమ రణస్థలిగా ఖమ్మం జిలా ఎరుపెక్కుతుంది. కొమరారం నుంచి, బయ్యారం నుంచి అడవిపొత్తిళ్లను తొలుచుకొని పిడికిలి బిగిస్తున్న పోరుబిడ్డలు, సింగరేణి సైరన్ మోతతో కుతకుతా ఉడుకుతున్న కొత్తగూడెం, మణుగూరులు మళ్లొక్కసారి పోరుదారికి ముగ్గులు వేస్తున్నాయి. ఓపెన్ కాస్టు మైన్ల పేరుతో ఊర్లను ఖాళీచేయిస్తుంటే భగ్గుమన్న ఇల్లెందు మళ్లొక్కసారి జనపాతరై తెలంగాణ పోరులో పేలనుంది. గార్ల రైలు స్టేషనుకాడ తీసుకొచ్చిన బలురైఫిల్ నీకిస్తా తమ్ముడా.... నీకిస్తా చెల్లెలా... అని పోరుపాటను పాడిన గార్ల ఇప్పుడు తెలంగాణ పోరుపాట పాడుతుంది. డోర్నకల్లు తెలంగాణ ఉద్యమ జంక్షన్‌గా మారింది. భద్రాచలంలో గోదావరి తెలంగాణ పోరై పొంగుతుంది. పోరు చరిత్ర గల ఖమ్మం జిల్లా మళ్లొక్కసారి కొత్త చరిత్ర రచనకు పూనుకుంది. నాడు 1969లో రావెళ్ళ వెంకటరామారావు రాసిన తెలంగాణ గీతం నేడు వేల తెలంగాణ జాతి గీతమై మారుమోగుతున్నది. 
- జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment