Monday, September 26, 2011

కలిసిరాకుంటే కాలగర్భంలోకే..By - పెద్దింటి అశోక్‌కుమార్ Namasethe Telangana 27/09/2011


9/26/2011 11:03:46 PM
కలిసిరాకుంటే కాలగర్భంలోకే..
సకలజనుల సమ్మె శాంతి భద్రతల సమస్యకాదు. సామాన్యుడికి ఇబ్బంది కలిగించే ప్రశ్నేలేదు. ఎందుకంటే ఇందులో పాల్గొంటున్నది సామాన్యులే. అరవై ఏండ్లు లెక్కలేని ఇబ్బందులుపడి చివరి అస్త్రంగానే సమ్మెకు దిగారు. ఇబ్బంది అంటున్న మేధావులు ఇందుకు కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ ఉద్యోగులను కాదు.సమ్మె ఒక జన్మ హక్కు. నిరసన రూపంలో తమ కోరికలను సాధించుకోవడానికి ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధం. ఆ హక్కుపైన సీమాంవూధ వూపభుత్వం విషం కక్కుతోంది. రాజపోషకులైన కొందరు మేథావు (మేత + ఆవు)లతో సీమాంధ్ర దర్బారులైన టీవీ ఛానళ్లలో సమ్మెతో ‘సామాన్యులకు ఇబ్బంది కదా!’ అని సన్నాయి నొక్కులతో ఉద్యమంలో చీలిక తేవాలని చూస్తోంది. ముందుండి ఉద్యమం నడపాల్సిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రు లు, నాయకులు వెనుక నుంచి పోలీసులను ఎగదోస్తున్నారు.


చరివూతలో చాలా సార్లు సమ్మెలు జరిగాయి. కానీ ఎలాంటి సొంతవూపయోజనాలు లేకుండా.. అందరూ ఒకే కోరికపై సమ్మెకు దిగడం చరివూతలో మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక రాజకీయ ప్రక్రియ. తెలంగాణ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పరిష్కరించాల్సిన సమస్య.కానీ కాంగ్రెస్ నేతలు వారి బాధ్యతలను నిర్వర్తించలేదు. ప్రజల ఆశలను వమ్ముచేసి సొమ్ము చేసుకున్నారు. ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తున్నారు. రాజీనామా చేశామని ప్రజలను నమ్మించి అధిష్ఠానంతో ‘రాజీ’ పడి ప్రజలకు నామాలు పెట్టారు. ఈ కుట్రను గమనించిన తెలంగాణ ఉద్యోగులు, ప్రజల చిరకాల ఆకాంక్ష కోసం రాజకీయ కుట్రలను తోసిరాజని సమ్మె సైరన్ మోగించి బలిపీఠం ఎక్కారు. కనీసం ఇప్పుడైనా కళ్లు తెరిచి, కుళ్లు మరిచి ఉద్యోగులకు అండ గా నిలవాల్సిన కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఉద్యోగులనే బలికోరుతున్నారు. మొన్నటి శాత్రాజ్ పల్లెనుంచి నిన్నటి సింగరేణి దాకా అత్యుత్సాహం చూపి అధిష్ఠానం మెప్పు పొందాలనుకుంటున్న శ్రీధర్‌బాబులాంటి నాయకులు పోలీసుల రూపంలో ఉద్యోగులపై లాఠీ ప్రయోగిస్తున్నారు. అరెస్టులుచేసి, భయపెట్టి, కేసులు పెట్టి, ఎస్మాలు తెచ్చి ఉద్యమం లేకుండా చేయాలని చూస్తున్నారు.


సకల జనుల సమ్మె చిన్న పాయలా మొదలైంది. రేపు ప్రభంజనమై ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బొక్క విసిరింది. దానం, ముఖేశ్, జగ్గాడ్డి, రేణుకాచౌదరి ఎవరైనా కావచ్చు! సామాన్యులకు ఇబ్బందుల పేరిట, రైతుల పేరిట రకరకాల రూపాల్లో కుట్రలు పన్ని సకల జనుల సమ్మెను పలుచన చేయాలని చూస్తున్నారు. విచివూతమేమిటంటే ఒక్క టీఆర్‌ఎస్, బీజే పీ ఎమ్మెల్యేలకు తప్ప ప్రజల్లో తిరిగి, ప్రజలతో కలిసి మాట్లాడే ధైర్యం ఏమంవూతికీ, ఏ ఎమ్మెల్యేకూ లేదు. సొంత ఊరికి సాక్షాత్తూ మంత్రులు కూడా పోని పరిస్థితి. ఇన్ని సంఘటనలు కళ్లముందు జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావడం లేదు.
సకల జనుల సమ్మె ప్రజా ఉద్యమానికి పరాకాష్ట. కార్మికుల నుంచి ధార్మికుల దాకా కండక్టర్‌లనుంచి కలెక్టర్‌ల దాకా సమ్మె సైరన్ మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఒంటరి అభిమన్యులను చేసి హతమార్చాలని పన్నాగం పన్నుతున్నది. సిరిసిల్ల నుంచి సింగరేణి దాకా, సిర్పూర్ నుంచి చిలువకొండదాకా, సీఆర్పీని దించి అణచాలని చూస్తున్నది. సాక్షా త్తూ సిరిసిల్ల న్యాయస్థానంలో న్యాయవాదులపై పోలీసులు, సింగరేణి గనుల్లో కార్మికులపై సీఆర్పీ, కాకతీయలో కాలేజీ విద్యార్థులపై ఖాకీల లాఠీలు విరుగుతుంటే.. తూటాలు మోగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు,నాయకులు ఎక్కడా నోరు విప్పడం లేదు. పైగా పోలీసులను ప్రోత్సహిస్తూ సీమాంవూధులకు సీక్రెట్ ఏజెంట్లుగా మారి తెలంగాణ ఉద్యోగులపై కొత్త అణచివేత చట్టాలు తెస్తున్నారు. రేణుకాచౌదరిలాంటి ఉద్యమ ద్రోహులు అసలు సమ్మె ప్రభావమే లేదని విష ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల అసలు రంగు తెలంగాణ ప్రజలకు ఎప్పుడో తెలుసు.

చర్చ ల పేరిట ఢిల్లీ చుట్టూ తిరిగి సోనియా కాళ్లు కడుపులు పట్టుకొని పదవులు కాపాడాలని బతిమాలిన సంగతి కూడా తెలుసు. వీటన్నింటిని గమనించే సకల జనుల సమ్మెను మోగించారు. ఈ విముక్తి పోరాటంలో తెలంగాణ జనం ఊహించింది ఇద్దరు శత్రువులనే. ఒకటి సీమాం ధ్ర మీడియా అయితే.., రెండు సీమాంధ్ర నాయకత్వం. వీటి నుంచే తీవ్ర వ్యతిరేకత, ఎదురుదాడి వస్తుందనుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఉద్యమంలో లేపోయినా ఎదురుదాడి చేస్తుందని ఊహించలేదు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు సీమాంధ్ర మీడియా కంటే, నాయకులకంటే ఎక్కువగా ఎదురుదాడి మొదలు పెట్టారు.


సకలజనుల సమ్మె శాంతి భద్రతల సమస్యకాదు. సామాన్యుడికి ఇబ్బంది కలిగించే ప్రశ్నేలేదు. ఎందుకంటే ఇందులో పాల్గొంటున్నది సామాన్యులే. అరవై ఏండ్లు లెక్కలేని ఇబ్బందులుపడి చివరి అస్త్రంగానే సమ్మెకు దిగారు. ఇబ్బంది అంటున్న మేధావులు ఇందుకు కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించా లి కానీ ఉద్యోగులను కాదు. ‘కూతురు పురిటినొప్పులు పడుతుంటే సరియైన వైద్యం చేయి స్తాం. వైద్యం చేయకుంటే డాక్టర్‌ను నిలదీస్తాం. అంతే కానీ దీనికి నువ్వే కారణమని అల్లుడిని తప్పు పట్టం’కదా! ఇప్పుడు సకల జనుల సమ్మె సర్వజనుల ఆమోదం పొందుతున్నది. ఒక్కో వర్గం వచ్చి సమ్మెలో చేరుతోంది. రోజు రోజుకూ జనం మద్దతును కూడగట్టుకుంటున్న సమ్మె యుద్ధ శంఖారావం పూరిస్తోంది. అలాంటప్పుడు సమ్మెకు మూలకారణం ఏమిటని పరిశీలించి పరిష్కరించాలి.

కానీ ఇబ్బందుల పేరిట ప్రజాఉద్యమాలను అణచివేయకూడదు. ఇప్పటికీ మించిపోయిందిలేదు. శరణన్న శతృవునైనా క్షమించడం తెలంగాణ ప్రజల గొప్పగుణం. ఊరంతా ఒకదారిలో ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఇంకో దారిలో ఉంది. ఇక తెలుగుదేశం సంగతి తెలిసిందే. పొన్నాల ఇంటిముందు సావు డప్పు మోగింది. ఇప్పుడు నడుంకట్టాల్సింది తెలంగాణ కాంగ్రెస్ మంత్రు లు, ఎమ్మెల్యేలే. సకల జనుల సమ్మెకు వారు కూడా తోడైతే తొందరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని కుట్రలు, కుతంవూతాలు వదిలి పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి. 
- పెద్దింటి అశోక్‌కుమార్

No comments:

Post a Comment