Monday, September 5, 2011

తెలంగాణ రాష్ట్రం-ఐక్య ఉద్యమం---లంకా పాపిడ్డి Namasethe Telangana


9/6/2011 12:09:15 AM
తెలంగాణ రాష్ట్రం-ఐక్య ఉద్యమం
ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలనే ప్రధాన సమస్యను తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎదుర్కొంటున్నది. ఉద్యమం ఒడిదుడికులు లేకుండా ఉధృతంగా సాగుతున్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలు కూడా అణిగిపోయి ఉంటాయి. కానీ ఉద్య మం ఆగుతూ తూలూతూ సాగుతుంటే మాత్రం చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్క రూ తాము చెప్పిన మార్గంలోనే ఉద్యమం ప్రయాణించాలని డిమాండ్ చేస్తారు. కొందరు అతివాదంవైపు మొగ్గు చూపిస్తారు. ఇంకొందరు మితవాదంవైపు మొగ్గు చూపుతారు. కొందరు తమ అసలు ఉద్దేశాలు మరుగునపెట్టి, పైకి మాత్రం సుందరమైన నినాదాలతో ముందుకు వచ్చి తమ అసలు లక్ష్యాలు నెరవేర్చుకోవాలనే కోవర్టులుగా కూడా బయలుదేరుతారు.

అటువంటి ఒక సుందరమైన నినాదం తీసుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు బయలుదేరారు. దాని పేరే ‘ఐక్య త’, పదాలన్నింటిలోకి రాజాపదం ‘అధికారం’ అయితే పదాలన్నిటికిలోకి అందమైన పదం ‘ఐక్యత’. దీని పేరుమీద ఉద్యమాలను విచ్ఛిన్నం చేయవచ్చు. అలా చేస్తూనే ఐక్యతా రాగం ఆలపించవచ్చు. నిజంగానే ఐక్యం కావల్సి న వారందరిని ఐక్యం చేసి ఉద్యమాలను విజయవంతం చేయనూవచ్చు. ఐక్యత అనే ప్రచారంతో ఏదైనా చేయవచ్చు. తెలంగాణ టీడీపీ నాయకులు ప్రస్తుతం అదే (కోవర్టు ఆపరేషన్) చేస్తున్నారు. ముందు తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గా బాబ్లీ మొదలు ఎన్నో ఉద్యమాలను నిలబెట్టడానికి ప్రయత్నించారు.

(ఇప్పటికీ ‘అన్నా’ పేరుమీద ఆ పని చేస్తున్నారు) అవన్నీ తెలంగాణ ప్రజల్లో టీడీపీ మరింత అభాసుపాలు కావడానికే దారితీశాయి. దాంతో చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి కొత్త పన్నాగాలు-ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. తమ వ్యతిరేకిని పోరాడి ఓడించలేకపో తే, ఆ శక్తులతోనే ఐక్యం అయ్యి వెనుకగోతులు తవ్వి ఓడించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే ఐక్యతారాగం అంటూ గొంతు చించుకొని ప్రచారం చేస్తున్నారు. 2009 డిసెంబర్ తర్వాత తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీ అసలు స్వభావాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు. 2010లో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ప్రజల ముందుకు వెళ్లడానికి ముఖం చెల్లని పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ నాయకులు రాజీనామాలు ఇచ్చి మరోసారి తెలంగాణ పోరాటకారులుగా అవతారం ఎత్తారు. ఛాంపియన్లు గా ఫోజులు పెడుతున్నారు.

ఏదో విజయం సాధించినట్లుగా బస్సు యాత్రలు చేశారు. తెలంగాణ జేఏసీతో కలిసి పనిచేయం అన్నారు. ‘మేమే అందరినీ ఐక్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహిస్తా’మని గంభీర ప్రకటనలు చేశారు. కానీ పాపం వారి బస్సు యాత్రకు జెండాలు ఊపిన వారు కూడా కలిసి పనిచేయడానికి తలలు ఊపలేదు. పొలిటికల్ జేఏసీ మమ్ములను కలుపుకోవడంలేదు అంటూ తమ పాత అరిగిపోయిన రికార్డునే మళ్లీ వేయడం మొదలుపెట్టారు. ఐక్యతా పేరు మీద ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ప్రజలు గుర్తించలేరు అనుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకుల అమాయకత్వం. చంద్రబాబు ఒకవైపు సీమాంవూధలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తూ, ప్రోత్సహిస్తూ మరోవైపు తెలంగాణ లో తెలంగాణ ఉద్యమాన్ని తనకనుసైగలతో నియంవూతిస్తూ, సర్కస్ ఫీట్లు చేయించడం ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఐక్యతా అనగానే ధృతరాష్ట్ర కౌగిలిలోకి పోవడానికి తెలంగాణా ప్రజలు గుడ్డివాళ్లు కాదు.

మోసాలు చేయడానికి అలవాటుపడిన తెలుగుదేశం పార్టీ తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ వాళ్లు రాజీనామా ఇస్తేనే మేమూ రాజీనామా లు ఇస్తామని ప్రకటనలు చేసిన టీడీపీ నాయకులు, కాంగ్రెస్ వాళ్లకంటే కొద్దిగా ముందు రాజీనామాలు ఇచ్చి మేము రాజీనామాలు ఇచ్చినందుకే కాంగ్రెస్ వాళ్లు కూడా రాజీనామాలు ఇచ్చారంటూ కోతలు కోశారు. ప్రజలు ఏమనుకుంటారో అనే బెరుకు కూడా లేకుండా మా రాజీనామాల వల్లనే రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని బొంకారు. టీఆర్‌ఎస్ రాజీనామాలతో ఉప ఎన్నికలు మాత్రమే వచ్చా యి అంటూ వాళ్లకు వాళ్లే సొంతడబ్బా కొట్టుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడంతో మరోసారి పాట మార్చేసి మళ్లీ మొదటికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్లు రాజీనామాలు ఇస్తేనే మేమూ రాజీనామాలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు దర్శకత్వంలో నడుస్తున్న టీడీపీ నాయకుల తెలంగాణ ఉద్యమ లక్ష్యం, రాష్ట్రం కాదు.

అందువల్లనే వీరి ఉద్యమంలో ఇన్ని వైరుధ్యాలు ఉత్పన్నం అయ్యాయి. ఈ వైరుధ్యాలను, మోసాలను అందమైన ఐక్యతా ముసుగు కింద దాచేయాలని తెలంగాణ టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఇప్పుడు వీరు ఒక కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. రాజీనామాలు చేసిన వారందరూ జేఏసీ జెండా కింద ఒకే ఉమ్మడి గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు. పసుపు పచ్చ జెండా పట్టుకొని సైకిల్ గుర్తుపైన ఎక్కి తెలంగాణ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అసాధ్యమని తేలిపోయింది. 2010 తెలంగా ణ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థులను నిలబెట్టినప్పు డు, టీడీపీ నాయకులు గొప్ప ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని చెప్పారు. ‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, అయినా మాది ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ కాబట్టి ఎన్నికలు జరుగుతున్నపుడు ప్రజాస్వామ్యం కోసం పాల్గొనక తప్పదు’ అన్నారు.

(పి.వి.నర్సింహరావు కర్నూలు నుండి పోటీ చేసినప్పుడు మాత్రం తెలుగుబిడ్డ సిద్ధాంతం చెప్పారు) ఇప్పుడు టీడీపీ వాళ్లు రాజీనామాలు చేసి తిరిగి పోటీచేస్తే మాత్రం ఎవరినీ పోటీకి నిలబెట్టవద్దట. ఇప్పుడు ఆ సిద్ధాంతం పనిచేయదా..? వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీ లు ఐక్యంగా ఉద్యమించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు ఇచ్చిన వారికి వ్యతిరేకంగా ఎవరూ పోటీకి దిగినా వారిని ప్రజలు ఓడిస్తారు. చిత్తశుద్ధితో తెలంగాణ కోసం రాజీనామాలు చేసేవారు ఎవరూ భయపడరు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ చిత్తశుద్ధి లేదు.

చంద్రబాబు దర్శకత్వంలోనే రాజీనామాలు చేస్తున్నారు. అందుకే కుట్రపూరితంగా ఉద్యమానికే షరతులు పెడుతున్నారు. టీడీపీకి చెందిన సీమాం ధ్ర నాయకులు గానీ, తెలంగాణ నాయకులు గానీ ఏమి చెప్పినా అధికారికం కాదు. నేను చెప్పిందే అధికారికం అవుతుందని చంద్రబాబు అంటా డు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ టీడీపీ నాయకులను వారి మాటలను ప్రజలు ఎలా నమ్మాలి? చంద్రబాబు విధించిన హద్దులను దాటి తెలంగాణకు అనుకూలంగా ఒక్క మాట ఎక్కువ పలికినా తెల్లవారే బాబు కాళ్లు మొక్కే నాయకులను ప్రజలు ఎందుకు నమ్మాలి? చంద్రబాబు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర డిమాండ్‌ను సమర్థించినప్పుడే నమ్ముతారు. లేదా తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయకత్వంతో తెగతెంపులు చేసుకొని ఉద్యమంలో పాల్గొంటేనే నమ్ముతారు.

తెలంగాణ టీడీపీ నాయకుల ముందు ఈ రెండే దారు లు ఉన్నాయి. (మూడో దారి ఏదైనా అది సమైక్యాంధ్ర దారి, గోదారే) ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకుండా ఐక్యత...అంటూ ఎంత గొంతు చించుకున్నా ప్రజ లు పట్టించుకోరు. తెలంగాణను కోరుకునే పార్టీల ఐక్యకార్యచరణను ప్రజలు కోరుకుంటున్నారు. కానీ సమైక్యాంవూధను కోరుకునే పార్టీల ఐక్య కార్యచరణను ప్రజలు కోరుకోరని తెలంగాణ టీడీపీ నేతలు తెలుసుకుంటే మంచిది.
-లంకా పాపిడ్డి

No comments:

Post a Comment