Monday, September 12, 2011

ఖైదీలకూ హక్కులుంటాయి..by -బల్ల రవీంవూధనాథ్ Nmasethe Telangana 13/09/2011


9/13/2011 12:04:52 AM
ఖైదీలకూ హక్కులుంటాయి..
black-men-jailఉద్యమకారులను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనే డిమాండ్ దేశంలో తొమ్మిది దశాబ్దాలుగా మారుమోగుతూనే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర సంగ్రామంలో పొల్గొన్న వారిని అక్రమంగా అరెస్టు చేసి, అనేక తప్పుడు కేసులతో వేలాదిగా జైళ్లలో నిర్బంధించారు. ఉద్యమకారులు జైలు లోపల పోరాటం కొనసాగిస్తూ తమను రాజకీయ ఖైదీలు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. 1920లో ‘రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి’ అనే డిమాండ్ పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది.

లాహోర్ సెంట్రల్ జైలులో నిర్బంధించబడిన భగత్‌సింగ్, అతని సహచరులు తమలాంటి పోరాటకారులను ‘రాజకీయ ఖైదీలుగా’ గుర్తించాలని, యురోపియన్ జైళ్లలో రాజకీయ ఖైదీలకు కల్పించే సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ, గొప్ప రాజకీయ పోరాటం చేశారు. ఆ పోరాటంలో 63 రోజులు ఆమరణ నిరహారదీక్ష చేస్తూ 1929 సెప్టెంబర్ 13న జతిన్‌దాస్ అమరుడైయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న రాజకీయ కార్యకర్తలకు రాజకీయ హక్కులు కల్పించాలని ఆయ న చేసిన పోరాటానికి అనూహ్య స్పందన వచ్చిం ది. లాహోర్‌లో జతిన్‌దాస్ అంతిమయావూతలో రెండు లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. లాహోర్ నుంచి కలకత్తా వరకు ‘సావూమాజ్యవా దం నశించాలి’, ‘విప్లవం వర్ధిల్లాలి’ నినాదాలతో పాటు ‘రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి’ అనే డిమాండ్ యుద ్ధనినాదమైంది. నాటి నుంచి నేటి వరకు దాదాపు తొమ్మి ది దశాబ్దాలు గడిచినా నేటికీ అదే నినాదం ప్రధాన డిమాండ్‌గానే కొనసాగుతోంది. జతిన్‌దాస్ స్మతిలో సెప్టెంబర్ 13ను ‘రాజకీయఖైదీల హక్కుల దినం’గా జరుపుకుంటున్నాం.

బ్రిటిష్ వలసపాలకులైనా, స్వతంత్ర భారత పాలకులైనా ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న రాజకీయ ఉద్యమాలను తమ పాలవర్గ యంత్రాంగం ద్వారా అణచివేస్తుంటారు. స్వాతం త్య్రం వచ్చి 64 సంవత్సరాలైనా నేటికీ కూడా తమ సొంత భూముల నుంచి, అడవుల నుంచి, నివాసాల నుంచి తొలగింపునకు వ్యతిరేకం గా, నిరుద్యోగం, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేవలం బతికి ఉండే హక్కు కోసం ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ ప్రజలు పోరాటాలు చేస్తూ నే ఉన్నారు. తీవ్రమైన రాజ్య అణచివేతకు గురవుతూనే ఉన్నారు. దేశంలో జమ్మూ-కాశ్మీర్, మిజోరాం, మణిపూర్, అస్సాంలో జాతుల పోరాటాలు, ఆంధ్రవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిషా, బెంగాల్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో విప్లవోద్యమాలు అణచివేతకు గురవుతున్నాయి. ఎక్కడ ఉద్యమం పాలకవర్గాల వ్యతిరేకంగా పోరాడుతారో..అక్కడ ప్రజలు, ఉద్యమకారులు రాజ్యహింసకు అక్రమంగా బలవుతారు.

నిర్బంధించబడతారు. వేలాది మంది ఎన్‌కౌంటర్ల పేర హత్యగావించబడతారు. వందలాది మంది మిస్సింగ్‌లు అయ్యారు. ఎన్‌కౌంటర్లు, మిస్సింగ్‌లు తప్పించుకున్న వారు వేల సంఖ్యలో అరెస్టు అయి ఏళ్ల తరబడి విచారణలు లేకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు. ‘మేము సాధారణ ఖైదీలము కాదు, మేము మా వ్యక్తిగత స్వార్థం కోసం ఏ నేరం చేయలేదు. విశాల ప్రజానీ కం కోసం ముఖ్యంగా పీడిత వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం.

మమ్మల్ని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి. సత్వర విచారణ జరిపి విడుదల చేయండి’ అంటూ జైళ్లలో ఎన్నో మహత్తరమైన పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పైగా నక్సల్ ఖైదీలు, ఐఎస్‌ఐ తీవ్రవాదులు అంటూ ప్రత్యేక బ్యారక్‌లలో మరింత కట్టుదిట్టంగా నిర్బంధిస్తున్నారు. రాజకీయ ఖైదీలు ఎవరు? ఎవరైనా వ్యక్తిగాని, సమూహం గాని తమ వ్యక్తిగత స్వార్థంతో, స్వలాభాపేక్షతో కాకుం డా తమ జాతి కోసం, ఆత్మగౌరవం కోసం, సాంఘిక అసమానతలు రూపుమాపడం కోసం, హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం స్పష్టమైన సైద్ధాంతిక రాజకీయ విధానాలతో పోరాడేవారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి.

బ్రిటిష్ వలసపాలకులు రూపొందించిన మెఖాలే ఫార్ములానే నేటికీ కొనసాగిస్తున్నారు. 1870లో భారత శిక్షాస్మతిలో ‘దేశ ద్రోహులు’ అనే చాప్టర్ కింద స్పెష ల్ యాక్టు (XXVII of 1870) కింద సెక్షన్ 123ఎ దేశవూదోహంను చేర్చా రు. అప్పటి నుంచి రకరకాల రెగ్యులేషన్ చట్టాలు, ప్రివెన్‌టివ్ డిటెన్షన్ చట్టాలు, నాసా, మీసా, టాడా, పోటా లాంటి అనేక క్రూర నిర్బంధ చట్టాలను తెచ్చారు. టాడా, పోటా చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లు నిరసన పోరాటాలు, ప్రజా ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు ఆ చట్టాలను రద్దు చేయక తప్పలేదు. టాడా, పోటా లాంటి నల్ల చట్టాలకు తోడు కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుల బూచి తో. UAPA (ఉపా )లాంటి క్రూరమైన చట్టాలను తెచ్చి దేశాన్ని జైలుగా మార్చా రు. ‘ఉపా’ చట్టం ప్రకారం టెర్రరిస్టు సంఘాలకు, నిషేధిత సంఘాలకు సానుభూతి పరులకు కూడా జీవిత ఖైదు విధిస్తున్నారు. దేశంలో సాగుతున్న ప్రజాఉద్యమాలను కూడా నిషేధిత సంస్థలుగా జమకట్టి ఆదివాసీ పోరాటాలపై ఉక్కుపాదం మోపుతోందీ ప్రభుత్వం.

మరోవైపు దేశంలోని ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలనే డిమాండుతో ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం నల్లచట్టాలను అడ్డం పెట్టుకొని రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నందుకు ఉద్యమకారులకు శిక్షలు వేస్తోంది. కేవలం అనుమానంతోనే.. జీతన్ మరాండీ లాంటి ప్రజాకళాకారులకు ఉరిశిక్షలు వేసి రాజ్యం తన నిజస్వరూపాన్ని చాటుకుంది. అలాగే.. రాజకీయ విశ్వాసాలున్నందుకు మావోయిస్టు నేత 70 ఏళ్ల నారాయణ సన్యాల్‌కు 10 ఏళ్ల శిక్ష విధించింది. అలాగే ఒడిషా సర్కారు ఒక్క మల్కాన్‌గిరి జైలులోనే 700 మంది ఆదివాసులను నిర్బంధించింది. ముస్లిం తీవ్రవాదుల పేరుతో దేశవ్యాప్తంగా ముస్లిం యువతీ యువకులను ‘ఉపా’ చట్టం కింద జైలుపాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పాలక వర్గాలు తమ ముఠా తగాదాలు,కక్షలు, ఫ్యాక్షన్ హత్యలను ఓ కళగా అభివృద్ధిచేసి, ప్రత్యర్థులను అంతం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఫాక్షన్ హంతకులకు మాత్రం చట్టాలన్నింటిని చుట్టాలుగా మార్చి తమ వారిని ఆగష్టు 15, 26 జనవరి సాకుగా తీసుకొని విడిచిపెడుతున్నారు.

అదే రాజకీ య, సాధారణ ఖైదీలను మాత్రం 14 ఏళ్లు దాటినా పెరోల్ ఇవ్వకుండా జైళ్లలోనే బందిస్తున్నారు. గౌరు వెంకటడ్డి, మద్దెలచెరువు సూరి లాంటి ఫ్యాక్షన్ హంతకులను విడుదల చేసి అదే చర్లపల్లి జైలులో 16 ఏళ్లుగా ఉన్న పిబివి గణేష్‌ను విడుదల చేయడంలేదు. స్పెషల్ రెమిషన్ జీఓ ప్రకారం ఏడేళ్లు నిజజీవిత కాలం, రెమిషన్‌తో కలిపి పదేళ్లునిండిన జీవిత ఖైదీ లు విడుదలకు అర్హులు. కానీ.. నియమ నిబంధనలు, చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి రాజకీయ ఖైదీలు విడుదల కాకుండా మోకాలొడ్డుతున్నారు. గణేష్ విడుదల కాకుండా ఉండటం కోసం పబ్లిక్ సర్వెంటును చంపినందుకు రెమిషన్‌కు అనర్హుడంటూ.. ప్రత్యేక జీవోను తెచ్చారు. ఈ విధంగా రాజకీయ విశ్వాసాలున్నవారినీ, సాధారణ ఖైదీలు విడుదల కాకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ పోరాడాలి.

కామ్రేడ్ జతిన్‌దాస్ స్మృతిలో రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం. స్వాతంవూత్యోద్యమ కాలంనాడు విప్లవ వీరులను ఏవిధంగా ప్రజలు కాపాడుకున్నారో.. , నేడూ.. బహుళజాతి కంపెనీలు, సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనల నుంచి విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమకారులను కాపాడుకోవాలి. రక్షించుకోవాలి. రెమిషన్, స్పెషల్ రెమిషన్ అనేవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదు, ఖైదీల హక్కుఅని పోరాడుదాం. ఏడేళ్లు ్ల పూర్తి చేసుకున్న ఖైదీలందరినీ విడుదల చేయాలి. 
-బల్ల రవీంవూధనాథ్
ప్రధాన కార్యదర్శి రాజకీయ ఖైదీల విడుదల కమిటీ
(నేడు రాజకీయ ఖైదీల హక్కుల దినం)

No comments:

Post a Comment