Saturday, September 10, 2011

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా? by -చుక్కా రామయ్య Namasethe Telangana 11/09/2011

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా?
Chukka-Ramaiah-telangana-Ne talangana patrika telangana culture telangana politics telangana cinemaఈనాటి చదువు స్వరూప స్వభావమే రాబోయే 30 ఏళ్ల కాలాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణలో చాలా కాలం వరకు పాఠశాలలు లేవు. స్కూళ్లు పెట్టే స్థోమ త లేదు. ఆనాడు చదువుకు సంబంధించిన సోయి ఉన్న వర్గం భూస్వామ్య వర్గమయ్యింది. అందువల్లనే చదువు ప్రభావం తెలంగాణ ప్రజలపై చాలా తక్కువగా పడింది. మారిన కాలం, అంతరించిపోయిన దొరల పాలన, అనేక రకాల సామాజిక పరిణామాల వల్ల ఈ మధ్య తెలంగాణలో ఎక్కువగా స్కూళ్లు తెరిచిన మాట వాస్తవమే. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఆ స్కూళ్లకు పంపించే స్థోమత, చైతన్యం ఎంతమందికి ఉంటుంది. ఒక వేళ తమ పిల్లల్ని చదివించుకోవాలన్న తహ తహ తల్లిదంవూడు ల్లో పెరిగినప్పటికినీ, ఎంత కాలం పిల్లల్ని చదివించగలుగుతారు. కుటుంబ ఆర్థిక స్థోమత కూడా కీలకమైన అంశం. తెలంగాణలో స్కూళ్లు తెరిచారు. ఎలాంటి నాణ్యమైన చదువును అందించగలుగుతున్నారన్నది అత్యంత కీలకమైన అంశం. తెలంగాణలో తల్లిదంవూడు లు తమ పిల్లలను 10వ తరగతి కంటే ఎక్కువగా చదివించలేక పోతున్నారు.

చదివించినా, అప్పు లు చేసి కాలేజీకి పంపించినా నాసిరకమైన, చదువుల్తో..కాలేజీలో తట్టుకోలేకపోతున్నారు. చదివితే ఇంటర్మీడియట్,లేదా ఏ కార్పొరేట్ కాలేజీలో ఇంజనీరో, ఏ సర్కారీ డిగ్రీ కాలేజీ చదువో చదువుకుని బయటకు వస్తున్నారు. చివరకు వారి యోగ్యతను బట్టి ఈ పోటీ ప్రపంచంలో వారికి దొరికేది ఏ కానిస్టేబుల్ పనో, ఏ టీచర్ పోస్టో, ఏ తహసీలాఫీసులో క్లర్కు పనో.. ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రం దొరుకుతున్నాయి. ఈ మాదిరిగా అనామకమైన ఉద్యోగాలతో సంతృప్తి పడవలసి వస్తుంది. ఈనాడు పాలసీ మేకింగ్‌లో భాగస్వామి అవుతేనే అతని సామాజిక స్పృహ ప్రజలకు అందే అవకాశం ఉంటుం ది. ఏ కొద్ది మంది మాత్రమే బుర్రా వెంక కాగలుగుతారు. ఆ స్థాయికి రావాలంటే చదువులో ఎన్నో..స్థాయిలను అధిగమించాల్సి ఉంటుంది. ఎన్ని కఠినమైన అవరోధాలు దాటాల్నో అనుభవించిన వారికే తెలుస్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలతో పొట్టపోసుకోవటం తప్పించి చదువు ప్రభావం ఈ ప్రాంతపు సమాజంపై అంతగా పడటం లేదు. చివరకు ప్రమోషన్ల కోసం పడరాని పాట్లు పడవలసి వస్తున్నది. తెలంగాణలో ఉద్యోగం సంపాదించి ప్రమోషన్లు పొందటం ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకే ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. విద్యార్థులు ఆందోళనా పథంగా మారారు.

మంత్రులు రాజీనామా చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయ పిల్లలుఆందోళన చేస్తున్నారు. ఆ సందర్భంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటి ముందు ఆందోళన చేశారు. ఆ ఇంటి ముందు పోలీసు కాపలా లేదు. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ లేరు. కాపలాదారు మాత్రమే ఉన్నాడు. విద్యార్థులు ఇంటి లోపలికిపోయారు. ఇంటిలోకి పోవటం తప్పే. కానీ భద్రతాలోపం ఎంత మేరకు జరిగిందన్న దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఇంటిలోకి పోయారు కాబట్టి పోలీసులు అరెస్టు చేయటం తప్పేమీకాదు. దానికి లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ కింది ఉద్యోగులు, అధికారుల ప్రాపకం సంపాదించుకోవటానికి అడ్డతోవలు తొక్కారన్న దే బాధాకరమైన విషయం. నేను వరంగల్ వెళ్లి విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంతో కలత చెందాను. ఆ విద్యార్థులను అరెస్టు చేసి పది పోలీస్ స్టేషన్‌లకు తిప్పి మరీ కొట్టారు. తిప్పటమే కాదు, కాళ్ల కింద రోకళ్లు పెట్టి వారిపైన ఇనుప బూట్లతో నిలబడి బాదుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఇది ఏ పోలీసు మాన్యువల్‌లో ఉంది? నియంతలు పాలన కొనసాగించే దేశాలలో కూడా విద్యార్థులకు ఈ రకమైన శిక్షలు వేయరు. మనది ప్రజాస్వామిక దేశం.

ఎమ్మెస్సీ, పిహెచ్‌డీ పిల్లలు వయస్సు 23 సంవత్సరాలు. ఒకతను యాకూబ్‌డ్డిని, మరికొందరిని రెండు కాళ్ల ను లాగి బట్టలూడదీసి బాదుతుంటే.. ఆ పిల్లలు ప్రాధేయపడుతూ నాకు ఇటీవలే వివాహం అయ్యిందని ఒక విద్యార్థి ఆ పోలీసులకు చెప్పాడు. అయినా కనికరించకుండా చావబాదారు. మూత్రకోశం నుంచి మూత్రం రావటం లేదు. ఒక వైపున కాళ్లు విరగ్గొట్టారు. మాత్రనాళం దెబ్బతిన్నది. ఈ చిత్రహింసకు గురైనటువంటి విద్యార్థి జీవితం ఆందోళనకరంగా ఉంది. ఈ విధంగా పిల్లల జీవితాలను ఛిద్రం చేయటం ఏమిటి? ఇంత దుర్మార్గం చేయమని ఏ పోలీసు మాన్యువల్ చెబుతున్నది? సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకుచిత్రహింసలకు గురిచేస్తే వరంగల్‌లో ఉన్నటువంటి న్యాయవాదులు కోర్టును ప్రాధేయపడితే కోర్టు ఆర్డర్ ప్రకారం వారిని ఉదయం 5 గంటలకు సుబేదారి కోర్టు మెజివూస్టేట్ ముందు ప్రవేశపెడితే జరిగిన సంఘటననంతా ఆ పిల్లలు న్యాయమూర్తికి చెప్పారు.

ఆ పిల్లల్ని బెయిల్‌పై వదిలారు. ఆ పిల్లల్ని ఆసుపవూతిలో చూస్తుంటే ఆ పిల్ల లు పెట్టిన కేకలు నన్నెంత కలవరపెట్టాయో ఆలోచించండి! 23 సంవత్సరాల వయస్సు నాది. మొన్ననే పెళ్లయిందని ఆ విద్యార్థి అంటుంటే 85 ఏళ్ల వృద్ధుడు ఎంత తల్లడిల్లుతాడో ఆలోచించండి. డాక్టర్‌ను అడిగితే పోలీసు ఆజ్ఞలేనిదే వైద్యసహాయం చేయలేనంటారు. రాత్రి ఒంటి గంటకు మఫ్టీలో పోలీసులు వచ్చి వాస్తవాలు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామని భయపెడతారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ నాజీలు కూడా చేశారా? అన్న అనుమానం కలుగుతుంది. ఇరాక్‌లో జరిగినట్లు పేపర్‌లో చదివాను. దేశ అంతర్గత సమస్యపైన, తన నేలకు సంబంధించిన అంశంపైన, నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో తమకు స్వయం వూపతిపత్తి కావాలని అడిగితే ఆ విద్యార్థులపై పోలీసులు ఇలా ప్రవర్తించవచ్చా? అని అనిపిస్తుంది. ఈ విధంగా ఎందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారని అడిగాను. ‘ప్రమోషన్ల కోసం’ అని చెప్పారు.

ఆ పోలీసులు తడిసింది బ్యూరోక్షికసీ కల్చర్‌లో.., వాళ్ల మైండ్ సెట్ అలా తయారైపోయింది. ఎన్‌కౌంటర్లను ఆధారం చేసుకొని ప్రమోషన్లనివ్వటం, లేదా ఆ పోలీ సు పెట్టిన హింసను ఆధారం చేసుకొని అంతస్థుపూక్కిస్తున్నారని అక్కడ గుమికూడిన వాళ్లు నాకు చెబుతుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ ఏమైపోతుందోనన్న ఆందోళన కలిగిం ది. తప్పులు చేసిన వారిని శిక్షించటానికి వేరే మార్గాలున్నాయి. అందు కు కోర్టులున్నాయి.ఆ తీర్పుకు బద్దులై సమాజముంటుంది. పోలీసుల విచక్షణా రహిత ప్రవర్తనకు ఈ ప్రాంతం ఎప్పటికీ గురికావల్సిందేనా? ఈ నేలపై నెత్తురు ఎప్పుడూ గడ్డకట్టవలసిందేనా? తెలంగాణ పల్లెలు వెన్నెల్లో కూడా చీకటిని అనుభవించవలసిందేనా? నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేస్తుం నోరుండి ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడు నేరస్థుడేనని ఈ తెలంగాణ మట్టి మాట్లాడుతూనే ఉంటుంది. ఆనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది, ఆతర్వాత పలు నక్సలైట్ ఉద్యమాలలో 5000 మంది నేలకొరిగారు. నేటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో 700 మంది పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ మొత్తం నెత్తురు ముద్దగా మారింది. నోరు మెదిపితే కాలు కదిపితే న్యాయం కోసం ప్రశ్నలు సంధిస్తే వారిపై చిత్రహింసలు ప్రయోగించ టం ఎంతవరకు న్యాయం?

వరంగల్‌లో గాయపడ్డ ఆ విద్యార్థులను చూసి కల్లోలానికి గురయ్యాను. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత ప్రమాదంలో పడబోతుందో ఆందోళన కలిగింది. ఈనేల యిచ్చిన చైతన్యంతో ఆనాడు తెలంగాణ పోరులో ప్రశ్నిస్తే నన్ను రెండేళ్లు జైలుకుపంపారు. ఈ నాడు 60 ఏళ్ల తర్వాత తమకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ప్రశ్నలను చిత్రహింసలకు గురిచేశారు. ఈ నేలకు 60 ఏళ్లలో ఏం జరిగిందో తలుచుకుంటూ.. ఏ మార్పులకు గురైందో మనసులో గొణుక్కుంటూ కారెక్కాను.
-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

No comments:

Post a Comment