రెండు భిన్న సమాజాల ఘర్షణ
నా సహచర మంజీర రచయితలకు,
ఈ రోజు సమావేశానికి రాలేనందుకు విచారిస్తున్నాను. మీతో కొంత సమయం గడపాలని ఎంతో ఎదురు చూసినప్పటికి అనేక కారణాల వల్ల రావడం కష్టమైంది.
నిజమైన ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసమున్న ఒక రచయితల సంఘం, ఒక నది పేరున ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా నవల "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్''; రాజకీయ, సామాజిక అంశాలపై రాసిన ఇతర రచనలన్నీ నదుల చుట్టూ తిరుగుతాయి. మన కవిత్వంలో, రాజకీయాల్లో నదుల పాత్ర చాలా విశిష్టమైంది.
మానవ సమాజం తనను తాను ఎలా నిర్వహించుకోవాలో, పరిపాలించుకోవాలో వాడిగా, వేడిగా చర్చ జరుగుతున్న తరుణంలో మనం తీవ్రమైన పర్యావరణ ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నాం. సముద్రాలలో 90 శాతం పెద్ద చేపలు కనమరుగుయ్యాయి. సముద్రాలలో నీటి మొక్కల కంటే ప్లాస్టిక్ సామాగ్రి ఎక్కువగా ఉంది. అణుబాంబులను తయారు చేసుకోగల మనం, తేనె టీగలు కనుమరుగై భూమిపై జీవం అంతమవుతుందని అర్థం చేసుకోలేక పోతున్నాం.
మన మేధాశక్తి గురించి ఎంతగానో గర్వపడుతున్న మనం ఎంత మూర్ఖులమో...
ఇందుకే మధ్య భారత దేశం, ఉత్తర తెలంగాణ, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో జరిగే ఘర్షణ, స్వభావాల, నాగరికతల మధ్యన జరిగే యుద్ధమని భావిస్తున్నాం. ఈ యుద్ధం రెండు విభిన్నమైన సమాజాలది. ఒకటి - మానవుడే భూమి మీద అన్నింటికీ హక్కుదారుడని భావించి, సామాజిక దృక్పథంతో జీవనం సాగించేది; రెండవది - మొదటి సమాజాన్నే కాదు, దాని సంస్కృతిని, ఊహను, ఆలోచనను నిర్మూలించి భూమి వినాశనానికి దారితీసే పెట్టుబడిదారీ వర్గ సమాజం.
మన భారత దేశం, ఆఫ్రికా ఖండంలోని అన్ని పేద దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం. 80 కోట్ల మంది రోజుకు 20 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసే దేశం మనది. అయితే ప్రపంచంలో ఆయుధాల కొనుగోలులో మనమే ప్రథములం. మన రక్షణ బడ్జెట్ 3700 కోట్ల డాలర్లు. అంటే విద్యా, వైద్యంపై ఖర్చు పెట్టే దాని కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ. కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌ల పోరాటాలు భారత దేశమంతటికీ విస్తరిస్తున్నాయి. ఇక్కడ కూడా సైన్యాన్ని పంపించే యోచనలో ప్రభుత్వాలున్నాయి. ఇది జరగడానికి అనుమతిద్దామా?!
అయితే మీరు చేస్తున్న పోరాటాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటివి ముఖ్యమైనవే. ప్రతి సమాజానికి స్వయం నిర్ణయాధికారం ఉంటుందని, తెలంగాణ ఒక న్యాయమైన, ప్రజాస్వామిక డిమాండ్ అని భావిస్తున్నాను. అయితే ఇటువంటి డిమాండ్లు కొన్ని గురుతర బాధ్యతల్ని కూడా తెస్తాయి. ప్రత్యేక తెలంగాణ స్వప్నం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ల లాగా సామాజిక, ఆర్థిక, పాశవిక, అసమానతల చిన్న రాష్ట్రం కారాదు. కొత్తదారి చూపాల్సిందిపోయి, ఈ రాష్ట్రాలు నదుల్ని, అడవుల్ని, కొండల్ని, ఒక్కమాటలో చెప్పాలంటే మన సమాజ వనరులన్నింటినీ, ప్రైవేటు కంపెనీల పాదాక్రాంతం చేయడంలో పెద్దరాష్ట్రాలతో పోటీ పడుతున్నాయి.
ప్రాజెక్టులు, అభివృద్ది పేరిట దోపిడీని అడ్డుకునే వారిని వేటాడటం జరుగుతున్నది. ఉద్యమాల చరిత్ర, తిరుగుబాటుకు వెనుకంజ వేయని చరిత్ర గల తెలంగాణలో అలా జరగదని ఆశిస్తున్నాను. అనేక బాధలకు, త్యాగాలకు ఓర్చి ఎన్నో విజయాలు సాధించి అభినందనీయులైనటువంటి తెలంగాణ స్త్రీ పురుషుల, విద్యార్థి యువజనుల స్ఫూర్తితో నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ అవతరిస్తుందని ఆశిస్తున్నాను.
రచయితలుగా అధికారంలో ఉన్న వారిని అదుపులో ఉంచడం మన బాధ్యత. మన ఊహా స్వప్నాలు పీడకలలు కారాదు. మన నాయకులుగా చెలామణి అవుతూ మన మీద మనం సిగ్గుపడే విధంగా ప్రవర్తించనిస్తే అది మన తప్పే. వారిష్టం వచ్చిన విధంగా వారిని చేసుకోనిస్తే, ప్రతిఘటించకుంటే మనం నిర్మించదలచుకున్న సమాజపు పునాదుల్ని మనమే పూడ్చివేసినట్లు అవుతుంది. రాలేనందుకు క్షమించండి. నదుల కవిత్వం మీతో ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ.....
ప్రేమతో...
అరుంధతీరాయ్
(మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం ప్రారంభమైన మంజీరా రచయితల సంఘం రజతోత్సవాల సందర్భంగా ప్రముఖ రచయిత్రి, సామాజిక, పర్యావరణ ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ పంపిన సందేశమిది)

No comments:
Post a Comment