Sunday, September 4, 2011

అణగారిన వర్గాలపై అక్కసు ‘ఆరక్షణ్’-సుదర్శన్ బాలబోయిన వేణుగోపాల్‌డ్డి బండారి Namasethe Telangana 21/08/2011


అణగారిన వర్గాలపై అక్కసు ‘ఆరక్షణ్’
‘ఆరక్షణ్ ఇండియా వర్సెస్ ఇండియా’ సినిమా ఈ మధ్యకాలంలో సంచలనాత్మక చర్చను లేవదీసింది. సినిమా చిత్రీకరణలో పెద్దగా దమ్ము లేకపోయినా దానిలోని చిత్ర సారాంశం వివాదాస్పదం అవుతోంది. దర్శకుడు ప్రకాష్ ఝా గత చిత్రాల నేపథ్యం, ప్రధాన పాత్రధారుడు అమితాబ్ బచ్చన్(డాపభాకర్)కున్న ఇమేజ్, సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ దిగ్గజాలు ఈ చిత్రంలో నటించినందువల్ల దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సినిమా కథ (సారాంశం) కొన్ని సామాజిక వర్గాల జీవితాలను అవమానపర్చే విధంగా ఉంద ని పంజాబ్, ఉత్తరవూపదేశ్, ఆంధ్రవూపదేశ్(వూపస్తుతం ప్రదర్శించబడుతున్నది) రాష్ట్రా లు చిత్ర ప్రదర్శనను నిలిపివేశాయి. చిత్ర ప్రదర్శన నిలిపివేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని చిత్ర దర్శకుడు, పాత్రధారుడు పెద్ద ఎత్తున ఆరోపణల కు దిగారు. ఆరక్షణ్ చిత్రంలోని సారాంశాన్ని సరైన పద్ధతుల్లో అవగాహన చేసుకోవాలంటే సామాజిక పరిణామా ల్ని, నేపథ్యాలను తప్పకుండా మాట్లాడుకోవాలి.
1975లో ఇందిరాగాంధీ దేశంలో అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న ప్రజాస్వామిక రాజకీయ సామాజిక ఉద్యమాలను అణచివేసే ఉద్దేశ్యంతో ఎమ్జన్సీని ప్రకటించింది. సరిగ్గా ఈ కాలంలోనే దేశంలోని నిరుద్యోగ పరిస్థితులను తెరకెక్కించిన ఆకలి రాజ్యం సినిమా చిత్ర ప్రదర్శనను సుదీర్ఘ కాలంపాటు నిలిపి వేసింది. ఇందిరాగాంధీ రాజకీయాలకు భిన్నంగా సమాజంలోని అంతరాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రముఖ సోషలిస్టు నాయకు లు రామ్ మనోహర్ లోహియా, జయవూపకాశ్ నారాయణ్‌ల సోషలిస్టు సైద్ధాంతిక భావనలతో ఇందిరాను చిత్తు చిత్తుగా ఓడిస్తూ జనతా ప్రభుత్వం 1977లో అధికారంలోకి వచ్చింది.
సామాజిక అంతరాలను సాధ్యమైనంత వరకు కుదించడానికి ఒక తక్షణ ప్రణాళిక అవసరమనే ఉద్దేశ్యంతో మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో 1978లో నాటి పార్లమెం బి.పి మండల్ పేరుతో ఓ.బీ.సీ లకు రిజర్వేషన్ అవకాశాలపై అధ్యయనానికి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వా త 1989లో లోహియా, జయవూపకాశ్ వారసులుగా గుర్తింపు పొందిన వ్యక్తుల నాయకత్వంలో (వీపీ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం) అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత సాహసోపేతంగా మండల్ సిఫార్స్‌లను పరిగణనలోకి తీసుకుంటూ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియను ప్రారంభించిం ది. ఓబీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా అగ్రవర్ణ మనువాదులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు.
సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దేశబంధు కళాశాలకు చెందిన రాజీవ్ గోస్వామి అనే బ్రాహ్మ ణ విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేశాడు. (ఇతను 2004లో చనిపోయాడు )ఈ ఘటన తర్వాత సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత దుర్భర జీవితాలను అనుభవిస్తున్న అణగారిన కులాలకు, వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రత్యేక సదుపాయాన్ని కల్పించే రిజర్వేషన్ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించకుండా దేశంలోని ప్రజాస్వామిక వాదులు కుండబద్దలు కొట్టినట్లు తేల్చిచెప్పారు. రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇంత స్పష్టంగా రిజర్వేషన్ల కొనసాగింపు సరైన విధానమేనని ప్రపంచమంతా ప్రకటించినా కూడా, ప్రకాష్ ఝా లాంటి మనువాదులు ఇరవై ఏళ్ల తరువాత తన సినిమాతో తిరిగి చర్చకు పెట్టాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమయ్యాడు.
ఏ సామాజికాంశమైనా నిర్దిష్ట సమకాలీన పరిస్థితుల్లో చర్చ అనివార్యమైతే కచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఇది ప్రజాస్వామికమైన హక్కు. దీన్ని కాదనే సాహ సం చేయడం మూర్ఖత్వం. రిజర్వేషన్లపై ప్రకాష్ ఝా తన అభివూపాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం చర్చ మాత్రమే జరగాలనడం నూటికి నూరు శాతం కుట్ర అవుతుంది తప్ప ప్రజాస్వామికం కాదు. ప్రకాష్ ఝూ తోపాటు గొంతు కలిపిన బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ కళలకు కులాలు అంటగట్టవద్దని అగ్రకులాల ప్రచార భాషను ఉపయోగిస్తున్నాడు. ఈ దేశంలో భావ స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించడం వినడానికి అందంగా, ఆదర్శంగానే ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా సామాజిక బాధ్యతలను విస్మరిస్తే ఎలా? ప్రేమ, శాంతి, సామాజిక న్యాయ సాధనాల కోసం ఒళ్లంతా తూట్లు పొడిచేలా 44 బుల్లెట్లతో అత్యంత పాశవికంగా కాల్చబడి శాంటియాగో వీధుల్లో శవంగా విసిరేయబడిన మహా కళాకారుడు ‘విక్టర్ జరా’ కళాత్మక జీవితం ప్రపంచ కళాకారులందరికీ ఆదర్శం కావాలి. పౌరహక్కు లు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లో పుష్పించిన నల్లజాతి వజ్రం పాల్ రాబ్‌సన్ గొప్ప కళాకారుడు, రచయిత, ఫుట్‌బాల్ ప్లేయర్.
కేవలం నల్లజాతివాడైనందుకే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యం చేయాలని ఉద్యమించిన రాబ్‌సన్ ను అధోగతి పట్టించిన అమెరికన్ పాలకుల ఫాసిస్ట్ వైఖరిని గుర్తుంచుకోవాలి. దేశాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ దొంగలను అంతమొందించకుండా సామాజిక మార్పు అసాధ్యమని భావించి ‘హల్లాబోల్’ వంటి అద్భుతమైన వీధి నాటకాన్ని ప్రదర్శిస్తుండగానే కత్తులకు బలైన సఫ్దర్ హశ్మి ఇంకా గుర్తుకు రావడం లేదా? ప్రపంచాన్ని చాపలా చుట్టి తన జాత్యాహంకారపు పిడికిట్లో సమస్త ప్రజల్ని బందీ చేయాలని భావించిన హిట్లర్, గోబెల్స్ దురాగతాలను ఎండగడుతూ వ్యంగాత్మక చిత్రాల్లో నటించి, నిర్మించిన చార్లి చాప్లిన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? అంకుర్, నిశాంత్, భూమిక లాంటి భారతీయ సామాజిక జీవన స్థితిగతులకు చిత్ర రూపం కలిపించిన శ్యామ్‌బెనెగల్ లాంటి దార్శనిక దర్శకుడు కళాకారులకు స్ఫూర్తిదాయంగా భావించాలి.కానీ బాలీవుడ్ మాత్రం బండరాయిలా మిగిలిపోవడాన్ని ఏమనాలి? ఈ పరిణామాలన్నింటిని చూస్తే బాలీవుడ్ చిత్ర ప్రపంచానికి కుల,వర్గ (మనువాదం, పెట్టుబడిదారీవాదం) పక్షపాతం లేదని ఎవరైనా అనగలరా?
కళ కళ కోసం, కళ ప్రజల కోసం కాదు, కాసుల కోసం అన్నట్టుగా బాలీవుడ్ సినీ సమాజం ప్రవర్తిస్తున్నది. అందులో భాగంగానే భారత బడా క్యాపిటలిస్ట్ అగ్రకుల అంబానీలు నిర్మించిన ఆరక్షణ్ చిత్రం మనువాదాన్ని, పెట్టుబడిదారీ వాదాన్ని సుదీర్ఘంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ సమకాలీన, ఆర్థిక, రాజకీయ, సాం ఘిక పరిస్థితుల రీత్యా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కోరే ఉద్యమా లు మునుముందు రాబోతున్నాయని ముందుగానే ఊహించి,మెరిట్ అంశా న్ని లేవనెత్తుతూ అగ్రకుల పెట్టుబడిదారీ వర్గం ఈ చిత్రాన్ని నిర్మించింది. చిత్రంలోని ప్రతి సంఘటనలో దళితుల్ని కించపరిచే విధంగా, నీచంగా చూసే పాత్రలు, డైలాగులే మొత్తంగా కనిపిస్తాయి.సినిమా ఆద్యంతం దళితులు, బహుజనులు, ఆదివాసులు ప్రభుత్వ రక్షణలతో, రిజర్వేషన్లతో అగ్రకులాల అవకాశాలన్నింటిని కొల్లగొడుతున్నారనే అన్యాయమైన వాదాన్ని పదేపదే లేవనెత్తింది.
ఇండియా వర్సెస్ ఇండియా (సినిమా క్యాప్షన్) నిజమే! ఈ దేశంలో రెండు వర్గాలున్నాయి. తమ చెమట ధారపోసి శ్రమించి సకల సంపదలను సృష్టించిన వర్గం ఒకటి. ఆ శ్రమను దోచుకుంటూ అప్పనంగా కూర్చొనితింటూ మెరిట్ గూర్చి మాట్లాడే దోపిడీ వర్గం మరొకటి. ఈ చిత్రంలోనే కె్లైమాక్స్ సన్నివేశం విద్యా ప్రైవేటీకరణను సంపూర్ణంగా సమర్థించేదిగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉచితంగా కఠినమైన కోచింగ్‌లు తీసుకొని మెరిట్‌లో సీట్లు సాధించాలి కానీ, రిజర్వేషన్లు వద్దని చెబుతుంది. ప్రైవేట్ రంగం వర్ధిల్లాలని ‘ఆరక్షణ్’లు ఉండకూడదని ఈ చిత్రం అంతిమ సారాంశం.
-సుదర్శన్ బాలబోయిన
వేణుగోపాల్‌డ్డి బండారి
(ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్)

No comments:

Post a Comment