Sunday, September 4, 2011

ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి----ఎస్. మల్లాడ్డి Namasethe Telangana 14/08/2011


ఆహార భద్రతపై బహుళజాతి కంపెనీల దాడి
భారతీయ సమాజంపై బహుళజాతి కంపెనీలు అంతిమ దాడికి పూనుకున్నాయి. ఇన్నాళ్లూ తమ దోపి డీ విధానాలతో వీపు మీద కొట్టిన సామ్రాజ్యవాదులు ఇప్పుడు ఏకంగా కడుపుమీద కొట్టడానికి సిద్ధమయ్యా రు. ఈసారి భారత ప్రజల నోటికాడి ముద్దను కాజేస్తున్నారు. రైతులను సాంప్రదాయ వ్యవసాయంనుంచి దూరంచేసి.., జీవితంతో సంబంధంలేని వాణిజ్య పంటలకు బలిచేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ బహుళజాతి విత్తన కంపెనీల పన్నాగం పూర్తయి తే.. దేశం మరో సోమాలియా, ఇతియోపియా కాబోతున్నది.పాడీ పంటలతో విలసిల్లిన పల్లెసీమలు వల్లకాడు కాబోతున్నాయి.
బహుళజాతి కంపెనీలతో మిలాఖతైన ఇక్కడి ప్రభుత్వాలు ఈ దుర్మార్గానికి పూనుకున్నాయి. ఇదం తా అందమైన రెండో హరితవిప్లవం పేరుతో సాగడం మరో విషాదం. ఈ రెండో హరిత విప్లవంలో.. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో దిగుబడులులేక, రాబడులు రాక దారివూద్యంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకని చెప్పుకొస్తున్నారు. దీనిని పదేళ్లుగా..మెల్ల మెల్లగా.. చాపకింది నీరులా విస్తరింపజేస్తున్నారు. 2001సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతో.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పిపిపి)పేరుతో బహుళజాతి కంపెనీలతో కలిసి అమలు చేస్తున్నారు.మొక్కజొన్న(పసుపుదాడి) తో.. భారతీయ రైతాంగం నడ్డివిరిచేందుకు ముప్పేట దాడిచేస్తున్నారు.
గోల్డెన్ డేస్.. బంగారు కిరణాలు.. ఇంద్రధనస్సు.. ఇవన్నీ గతకాలపు గొప్పతనం గూర్చి చెప్పుకున్న కవితాత్మక పంక్తులు కావు. బహుళజాతి విత్తన కంపెనీల హైబ్రీడ్ మొక్కజొన్న పండిస్తే జీవితాల్లో వెలుగులు నిండుతాయని నమ్మించడానికి అందంగా చెప్తున్న అబద్ధాలు. సాంప్రదాయక వరి, జొన్న, సజ్జ లాంటి ఆహార పంటలు మాని తమ మొక్కజొన్న పండిస్తే.. లాభాలమీద లాభాలు వచ్చి ఇంట్లో ధనరాసులు నిండుతాయని ఊదరగొడుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద గుత్తపెట్టుబడిదారీ సంస్థ అయిన మోన్‌సాం టో, మైకో, చరీన్ పోక్పాండ్ మరో నాలుగు కంపెనీ లు హైబ్రీడ్ మొక్కజొన్న పంటను రైతాంగంపై రుద్దుతున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ విధానంలో ఉన్న రైతాంగం ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలను ఎంచుకొని వారిచేత ఈ మొక్కజొన్న పంటలను వేయిస్తున్నారు. దీనికోసం ఈ కంపెనీలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మోన్‌సాంటో కంపె నీ అయితే.. ఏకంగా ఏడాదికి కోటి రూపాయల ఖర్చుచేసి ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ఊళ్లమీద వదిలిపెట్టింది. వీరు హైబ్రీడ్ మొక్కజొన్నతో వచ్చే లాభాల గురించి రైతులను మభ్యపెట్టి పంటమార్పిడికి ఉసిగొల్పుతున్నారు.
సాంప్రదాయ వ్యవసాయ పంటతో దిగుబడి రాక దారివూద్యంలో బతుకుతున్న రైతు ఇంట్లో హైబ్రీడ్ మొక్కజొన్న బంగారాన్ని నింపుతుందని చెప్పుకొస్తున్నారు. అంతేగాక హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాలతో పాటు ఎరువులు, క్రిమిసంహారక మందు లు అన్నీ ఒక కిట్‌గా తయారుచేసి రైతులకు ఉచితంగా పంచుతున్నారు. ఈ విధంగా మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతాలను ఎంచుకొని, ఆదివాసీ రైతులతో.. మొక్కజొన్న పంటను వేయిస్తున్నారు. ఎకరాకు అర క్వింటాల్ పండే జొన్న స్థానంలో రెండు క్వింటాళ్ల పంట వస్తుందని చెప్తున్నారు.ఈ విధమైన ప్రచారంతో.. రాజస్థాన్, మధ్యవూపదేశ్, గుజరాత్, ఒడిసా, ఆంధ్రవూపదేశ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో హైబ్రీడ్ మొక్కజొన్నను పండించేందుకు రైతులకు ఎరవేశా రు. ఈ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల అండదండల తో.. బహుళజాతి కంపెనీలు తమ విత్తనాలు, ఎరువు లు, పురుగుమందుల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటున్నాయి.
మొదటి హరిత విప్లవం ఏం సాధించింది, దాని పరిణామాలు ఏంటో.. కళ్లముందు కనిపిస్తూనే ఉంది. కానీ.. ఈ రెండో హరిత విప్లవం పేరుతో.. వస్తున్న బహుళజాతి కంపెనీల దాడి, వాటి ప్రయోజనాలు దేశాన్ని అతలా కుతలం చేయనున్నాయి . భారత ప్రజ ల ప్రజాధనాన్ని ప్రైవేటు కంపెనీల లాభాలకోసం ఖర్చుచేయడం దేశ చరివూతలో ఇదే మొదటి సారేమో. ఇంత నిస్సిగ్గుగా, బరితెగించి పాలకులు చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు. హైబ్రీడ్ మొక్కజొన్న నిజానికి అది ఆహార పంటకాదు. ఇది పూర్తిగా వ్యాపారాత్మకమైన పారిక్షిశామిక పంట. దీనితో.. యూరప్ దేశాల్లో ఎక్కువగా వాడే బ్రెడ్డు, స్టార్చ్, ఐస్‌క్రీమ్‌లో ఉపయోగించే పొడులు ఉత్పత్తి అవుతాయి. ఈ అవసరాల కోసం దేశంలోని రైతులు మొక్కజొన్న పండిం చి వారి కడుపు నింపాలన్నమాట. ఇంకా అయితే.. కోళ్లకు దానాగా ఉపయోగిస్తారు. పెరుగుతున్న పౌల్ట్రీ పరిక్షిశమ అవసరాల కోసం హైబ్రీడ్ మొక్కజొన్న ఉత్ప త్తి అవసరమని అంటున్నారు.
మరో విషాదం ఏమం ఈ హైబ్రీడ్ మొక్కజొన్న మనుషులు తినడానికి పనికిరాదు. కనీసం పశువులకు గడ్డిగా కూడా పనికిరాదు. ఇలాంటి దానిని సాంప్రదాయక వ్యవసాయం చేసుకుని బతికే ఆదివాసి రైతులతో పండించి వారిని వ్యవసాయిక జీవనం నుంచి బేదఖల్ చేస్తున్నారు. దీంతో.. ప్రకృతిపై ఆధారపడి, వ్యవసాయిక జీవనం సాగించే ఆదివాసులు తమ ఆహారం కోసం మార్కెట్ పై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నా రు. అభివృద్ధి చెందిన మైదాన ప్రాంత రైతులే.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువులు, పురుగుమందు ల పేరుతో పెరిగిన వ్యవసాయ పెట్టుబడితో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే.., వెనుకబడ్డ గిరిజన రైతుల బతుకులు అతలాకుతలం కావడం ఖాయం.
జాతీయ వాదం గుత్త సొత్తుగా చెప్పుకొనే బీజేపీ, దాని రోల్‌మోడల్ నరేంవూదమోడీ గుజరాత్‌లోని వెనుకబడ్డ లోతట్టు ప్రాంతాలను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టాడు. దీంతో.. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో హైబ్రీడ్ మొక్కజొన్న పంటతో వినాశనానికి పూనుకున్నారు.
బహుళజాతి విత్తన కంపెనీలతో మిలాఖత్ అయిన పాలకులు భారతీయ వ్యవసాయ జీవనాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు.ఆహార భద్రతను ఛిన్నాభిన్నం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. మోన్‌సాంటో కంపెనీ మెప్పుకోసం దేశ ప్రజల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
తరతరాల చరివూతలో.. భారతదేశ వ్యవసాయిక జీవన విధానానిది విశిష్ట స్థానం. ఎన్ని యుద్ధాలు జరిగినా, రాజులు మారి రాజ్యాలు మారినా.. స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ గల పల్లెసీమలు ఎలాంటి ఒడుదొడుకులకు గురికాలేదు. పల్లెజీవనం చెదిరిపోలేదు. కరువుకాటకాలు దరిచేరలేదు. ఏగ్రామానికి ఆగ్రామం స్వయం సంపూర్ణంగా ఓ ద్వీపంగా వెలుగొందాయి. నేటికీ ఈ ఆధునిక కాలంలో ఎదురైన సంక్షోభాలన్నింటినీ తట్టుకొని భారత సమాజం నిలిచిందంటే.. అది మన భారతీయ జీవన విధానపు గొప్పతనమే. సాంప్రదాయ వ్యవసాయ విధానంలోని విశిష్టతనే. ఇందులో.. పాలకుల గొప్పదనం ఏమీలేదు. స్వాతంవూత్యానంతరం పాలకులు అవలంబిస్తు న్న ఆర్థిక విధానాలు వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నాయి. దేశానికి రైతే వెన్నెముక అన్న దేశంలో.. రైతు నడ్డి విరుస్తున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు రైతులను అంగట్లో ఆగం చేశాయి. పురుగుమందులే పెరుగన్నంగా తాగే దుస్థితి వచ్చింది. ఈ దశాబ్దకాలంలోనే రెండున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలదన్నట్లుగా.. రైతులపై మరో దాడి ముంచుకొచ్చింది. హైబ్రీడ్ మొక్కజొన్నతో ఆహార భద్రతకు తూట్లు పొడిచి ఆకలి చావులకు గురిచేసే కుట్ర వేగంగా అమలు జరుగుతోంది.
పాలకుల విధానాలు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో..అన్నపూర్ణ ఆంధ్రవూపదేశ్ ఆకలితో అలమటిస్తుందని జన్యుపంటలను వ్యతిరేకించే వ్యవసాయక శాస్తవేత్తలు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కజొన్న ముప్పును ఆదిలోనే ఎదిరించాలి. రానున్న కాలంలో.. మన పల్లెసీమలన్నీ ఆకలిచావుల కు ఆలవాలం కాకుండా కాపాడుకోవాలి.
-ఎస్. మల్లాడ్డి

No comments:

Post a Comment